మెరిసిపోదామా మెంతితో...
close

తాజా వార్తలు

Published : 18/06/2020 01:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మెరిసిపోదామా మెంతితో...

వంటింటి వస్తువుల్లో మెంతిది ప్రత్యేక స్థానం. దాన్ని అందం కోసం వినియోగిస్తే మరింత ప్రయోజనం. ఇంతకీ ఎలా వాడాలో తెలుసుకుందామా?

మెంతిలో అధిక మోతాదులో లభించే ప్రొటీన్‌ జుట్టు రాలడాన్ని నివారించడంలో కీలకంగా పనిచేస్తుంది. నికోటినిక్‌, లెసిథిన్‌ కుదుళ్లు బలంగా మారేందుకు, జుట్టు ఎదగడంలోనూ సాయం చేస్తాయి. ఇక పొటాషియం బాలమెరుపును అరికడుతుంది. నానబెట్టిన మెంతిపిండిలో కాసిని కొబ్బరి పాలు కలిపి తలకు ప్యాక్‌ వేసుకోవాలి. అరగంటయ్యాక తలస్నానం చేస్తే ఫలితం ఉంటుంది.

* పావుకప్పు మెంతుల్ని నానబెట్టి రుబ్బుకోవాలి. దానికి కొద్దిగా పెరుగు, కాస్త పాలపొడి కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. దాన్ని ముఖానికి పూతలా వేసుకోవాలి. కాసేపయ్యాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మంపై ఉండే మచ్చలు మాయమవుతాయి.

* నానబెట్టిన మెంతిపిండిలో చెంచా తేనె, పావుకప్పు పంచదార కలుపుకొని ముఖం, మెడ, చేతులు తదితర ప్రదేశల్లో రాసుకుని సవ్య, అపసవ్య దిశల్లో రుద్దితే సరి. మృతకణాలు తొలగిపోతాయి. చర్మం నునుపుగా మారుతుంది. ఛాయా మెరుగుపడుతుంది.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని