అతని గురించి ఆలోచించడం తప్పా?
close

తాజా వార్తలు

Published : 15/06/2020 01:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అతని గురించి ఆలోచించడం తప్పా?

ఈ మధ్య నా సహోద్యోగి నాతో చనువుగా ఉంటున్నాడు. ప్రతి విషయంలో జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. అతని సాన్నిహిత్యం నాకూ ఇష్టంగానే అనిపిస్తోంది. కానీ నాకు పెళ్లయ్యింది. ఒకబాబు ఉన్నాడు. పైగా నాకూ, నా భర్తకూ మధ్య ఏ గొడవలూ లేవు. అయినా అతడి ఆలోచనలు నన్ను ఇబ్బంది పెడుతున్నాయి. ఇది నాలో అపరాధ భావం కలుగజేస్తోంది. దీన్నుంచి బయటపడేదెలా?

- ఓ సోదరి.

పనిచేసే చోట, చదువుకునే ప్రదేశంలో ఆడా, మగా తేడా లేకుండా అందరితోనూ మాట్లాడొచ్చు. అయితే అది హద్దుల్లో ఉండాలి. అది ఆరోగ్యకరమైన వాతావరణంలో సాగాలి. కానీ ఇప్పుడు మీరు రెండు పడవల మీద ప్రయాణం చేస్తున్నారు. అది ఎప్పటికైనా ప్రమాదమే! ఇలాంటి బంధాలు... సరదాగా సాగిపోయినన్నాళ్లూ బాగానే ఉంటాయి. ఎప్పుడైతే దారి తప్పుతాయో అప్పుడు మీ కుటుంబ జీవితం ప్రమాదంలో పడుతుంది. ఆ వ్యక్తి మీకు నచ్చుతున్నాడు... అతడి సాన్నిహిత్యంలో ఎక్కువ సేపు గడపాలనిపిస్తుంది అని అంటున్నారు. అసలు మీరెందుకు అతడిపై ఆసక్తి చూపుతున్నారో గమనించుకున్నారా? ఆ లక్షణం మీ వారిలో లోపించిందా లేక మీరు ఆయన నుంచి దాన్ని పొందలేకపోతున్నారా? అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఇవి మాత్రమే సరిపోవు. మీ సహోద్యోగి మీపై ప్రత్యేకాసక్తి చూపించడానికి కారణాలు అన్వేషించండి. అతడి కుటుంబ చరిత్ర ఏంటి? వైవాహిక జీవితంలో ఏమైనా ఇబ్బందులున్నాయా వంటివన్నీ లోతుగా పరిశీలించండి. అప్పుడే మీ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. చిన్నచిన్న కారణాలు, సంతోషాలను తాత్కాలికంగా కోరుకుంటే చిక్కుల్లో పడొచ్చు. మీ బంధం చక్కటి స్నేహంగా నిలిచిపోవాలంటే మీరే మీ చనువుకి హద్దులు గీసుకోవాలి. పరిమితులు విధించుకోవాలి. అప్పుడే ఈ సమస్య నుంచి బయటపడొచ్చు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని