‘అన్మోల్‌’ కహానీ
close

తాజా వార్తలు

Published : 15/06/2020 00:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘అన్మోల్‌’ కహానీ

ఐదడుగుల జడ.. కొప్పు కట్టేసింది. విశాల నేత్రాలు నిశితంగా చూస్తున్నాయి. ఒరలో నుంచి కత్తిని లాగుతూ.. చురకత్తిలా ఉన్న ఆమె రూపాన్ని చూసి ఎవరీమె? అని ఆరాలు తీయడం మొదలుపెట్టారు. ఆమె పేరు అన్మోల్‌ నారంగ్‌. ఇండో-అమెరికన్‌ యువతి. అమెరికా మిలిటరీ అకాడెమీ నుంచి గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన తొలి సిక్కు యువతి. అన్మోల్‌ కహానీ చదివేయండి...
అన్మోల్‌ తాత భారత సైన్యంలో పనిచేశాడు. తండ్రి తరం వచ్చేసరికి ఆ కుటుంబం అమెరికా వలస వెళ్లింది. జార్జియాలోని రోస్‌వెల్‌లో స్థిరపడింది. అక్కడే పుట్టింది అన్మోల్‌. తాతయ్య వీరగాథలు తండ్రి చెబుతుంటే.. ఊ కొడుతూ.. నిద్రలోకి జారుకునేది. బడిలో చదువుకుంటున్న రోజుల్లో.. ఓసారి తల్లిదండ్రులతో కలిసి హవాయిలోని పెరల్‌ హార్బర్‌ వార్‌ మెమోరియల్‌కు వెళ్లింది అన్మోల్‌. అక్కడ అసువులు బాసిన సైనికులకు నివాళులు అర్పించింది. ఇంటికి వచ్చాక సైన్యంలో చేరతానన్న తననిశ్చయాన్ని చెప్పేసింది.
జార్జియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో న్యూక్లియర్‌ ఇంజినీరింగ్‌లో అండర్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసింది అన్మోల్‌. ఇది చదువుతున్నప్పుడే మిలిటరీ అకాడెమీకి దరఖాస్తు చేసుకుంది. నాలుగేళ్ల కిందట అకాడెమీలో చేరింది. అన్మోల్‌ది బారెడు జడ. మోకాళ్ల వరకూ వస్తుంది. జడను కొప్పు చుట్టుకొని నెట్టుకొచ్చిందామె. పద్ధతిగా కొప్పు చుట్టుకోవడం పెద్ద సవాలే అంటుంది అన్మోల్‌. అకాడెమీలోని కఠిన నిబంధనలు పాటిస్తూ విజయవంతంగా గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసింది. సెకండ్‌ లెఫ్టినెంట్‌ స్థాయికి చేరుకుంది. అనుకున్న లక్ష్యాన్ని అందుకున్న ఈ యువకెరటం.. ఒక్లోహామాలోని లాటన్‌లో ఉన్న ఫోర్ట్‌సిల్‌ శిక్షణ శిబిరంలో బేసిక్‌ ఆఫీసర్‌ లీడర్‌షిప్‌లో శిక్షణ తీసుకోనుంది.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని