అదిరే అందానికి టొమాటో
close

తాజా వార్తలు

Published : 15/06/2020 00:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అదిరే అందానికి టొమాటో

టొమాటోలు ఆరోగ్యానికే కాదు.. అందాన్ని కాపాడుకునేందుకూ ఉపయోగపడతాయి. మరి దాన్ని ఎలా ఉపయోగించాలో తెలుసుకుందామా?
*రోజూ పావుకప్పు టొమాటో గుజ్జులో చెంచా తేనె కలిపి ముఖానికి సవ్య, అపసవ్య దిశల్లో మృదువుగా మర్దన చేయాలి. ఇలాచేస్తే చర్మంపై పేరుకున్న మురికి, టాన్‌ తొలగి కాంతిమంతంగా కనిపిస్తుంది.  
*వయసు పెరిగే కొద్దీ చర్మం సాగినట్లు కనిపిస్తుంది. దీనికి పరిష్కారంగా పావుకప్పు టొమాటో గుజ్జులో ఒక గుడ్డులోని తెల్లసొన, చెంచా నిమ్మరసం కలిపి... ఈ మిశ్రమాన్ని కనీసం వారానికి రెండు సార్లు ప్యాక్‌లా వేసుకుంటే ఫలితం ఉంటుంది.
* కొందరి చర్మం కాలంతో సంబంధం లేకుండా పొడిబారుతుంది. వీరు రెండు చెంచాల టొమాటో రసం, అరచెంచా ఆలివ్‌నూనె, కొద్దిగా తేనె తీసుకుని ముఖం, చేతులకు రాసుకుంటే సరి.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని