మీ ఆహారంలో ఇవి ఉన్నాయా..?
close

తాజా వార్తలు

Published : 15/06/2020 00:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మీ ఆహారంలో ఇవి ఉన్నాయా..?

ఇంటా, బయటా కష్టపడి పనిచేసే మహిళలకు పోషకాహారం తీసుకోవాల్సిన అవసరమెంతో. వేళకింత తిని భోజనం అయ్యిందనిపించకుండా ఆహారంలో విటమిన్లు, ఖనిజాలు, పోషకాలు ఉండేలా చూసుకోవాలి.
చేపలు: వారానికి ఒకటి, రెండుసార్లు వీటిని ఆహారంలో భాగం చేసుకోవాలి. నెలసరి సమస్యలను అధిగమించడానికి ఇనుము ఎక్కువగా ఉండే చేపలు సహాయపడతాయి. వీటిల్లో ఉండే ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్లు అనేక అనారోగ్య సమస్యల నుంచి రక్షిస్తాయి. అధిక రక్తపోటు, కీళ్ల నొప్పులు, గుండె జబ్బుల బారినపడకుండా చేపలు సాయపడతాయి.
పాలు, పెరుగు: ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది మహిళలు క్యాల్షియం లేమితో ఇబ్బంది పడుతున్నారు. క్యాల్షియం అధికంగా ఉండే పాలు, పెరుగును తీసుకోవడం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి. తిన్న ఆహారం జీర్ణంకావడానికి పెరుగు తోడ్పడుతుంది. పాలు, పెరుగులో ఉండే పొటాషియం, మెగ్నీషియం రక్తపోటును నియంత్రిస్తాయి.
అవిసె గింజలు: వీటిల్లో ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్లు, పీచు, ప్రొటీన్‌ ఇతర పోషకాలు, ఖనిజాలుంటాయి. నెలసరి సంబంధిత ఇబ్బందులను తొలగిస్తాయి. రక్తంలో ట్రైగ్లిజరాయిడ్ల స్థాయిని తగ్గించి గుండెపోటు బారినపడకుండా సాయపడతాయి.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని