మనసుకు దగ్గరై గెలవండి!
close

తాజా వార్తలు

Updated : 14/06/2020 00:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మనసుకు దగ్గరై గెలవండి!

‘నిన్నమొన్నటి వరకు నేను లేకుండా నవ్య ఎక్కడికీ వెళ్లేదికాదు. నేనే లోకంలా ఉండేది కాస్తా ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. ఎప్పుడూ చూసినా ఫ్రెండ్స్‌... ఫ్రెండ్స్‌. నేనేదన్నా చెబుదామంటే నీకేం తెలియదని విసుక్కుంటోంది’ ఇది... ఓ టీనేజర్‌ తల్లి ఆవేదన. అయితే ఇది ఒక్క నవ్య వాళ్లమ్మ సమస్య మాత్రమే కాదు... ఎందరో తల్లులు తమ టీనేజ్‌ పిల్లల ప్రవర్తనతో ఇబ్బందిపడుతున్నారు. వారితో ఇలా మెలిగి చూడండి...

మీ పిల్లలకు మొదటి గురువులు మీరే కాబట్టి వాళ్ల ప్రవర్తనలో వచ్చిన మార్పులు మీకు స్పష్టంగా తెలుస్తాయి. వాళ్లు మాటిమాటికీ అసహనానికి గురైనా మీరు మాత్రం సంయమనం కోల్పోకుండా వ్యవహరించాలి. ఎందుకంటే మీరు ఆ వయసును దాటుకుని వచ్చారు కాబట్టి మీకు వారి ప్రవర్తన మీద అవగాహన ఉంటుంది. కానీ పిల్లలు పదేపదే మొండిగా ప్రవర్తిస్తుంటే అది తప్పనే విషయాన్ని తెలియజేయాలి. మనకు ఇష్టంలేని విషయాన్ని కూడా ఎదుటివాళ్లు నొచ్చుకోకుండా సున్నితంగా చెప్పొచ్చని తెలియజేయాలి.

సూటిగా..

 

ఇంట్లో పెద్దవాళ్లు ఏదైనా అడిగినప్పుడు దురుసుగా సమాధానం చెబుతుంటారు టీనేజర్లు. తాము దురుసుగా ప్రవర్తిసున్నామని కూడా గుర్తించరు. అలాంటి సందర్భాల్లో ప్రవర్తనను మార్చుకోమని కచ్చితంగా చెప్పేయండి. ఇలా సూటిగా తెలియజేయడం వల్ల పిల్లల ప్రవర్తనలో మార్పు వచ్చే అవకాశం లేకపోలేదు.

చిన్ని ప్రశంస చాలు..

మీరిచ్చే చిన్న ప్రశంసతో వాళ్లు మరింత చక్కగా పనిచేస్తారు. అయితే అనవసరంగా పొగడటమూ మంచిదికాదు. ఆటల్లో, పరీక్షల్లో విజయం సాధించినప్పుడు అభినందించి ఊరుకోకుండా కష్టపడి సాధించిన క్రమాన్ని అడిగి తెలుసుకోవాలి. ఇలా చేయడం వల్ల వారి మనసుకు మీరు మరింత చేరువవుతారు. అప్పుడు వారు తమ భావాలను మీతో స్వేచ్ఛగా పంచుకోగలుగుతారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని