ఆ సమస్య తీరేదెలా?
close

తాజా వార్తలు

Published : 14/06/2020 00:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆ సమస్య తీరేదెలా?

మా అత్తగారి వయసు 65 ఏళ్లు. ఆమెకు మలబద్ధకం సమస్య ఉంది. దీనికి పరిష్కారం చెప్పండి?

- ఓ సోదరి

వయసు పెరుగుతున్న కొద్దీ పేగుల్లోని కండరాలు కూడా బలహీనపడతాయి. జీర్ణశక్తి కూడా తగ్గుతుంది. దాంతో ఈ సమస్య మొదలవుతుంది. దీని నుంచి బయటపడాలంటే ప్రతిరోజూ కనీసం 10 గ్లాసుల నీటిని తాగాలి. ఆహారంలో ఆకుకూరలు తప్పనిసరిగా తీసుకోవాలి. బొప్పాయి, అరటి, జామ వంటి బాగా పండిన పండ్లను తినడం అలవాటు చేసుకోవాలి. అయితే జీర్ణశక్తి బట్టి ఈ పండ్లను తీసుకోవాలి. కరక్కాయపొడి మలబద్ధక సమస్యను తగ్గిస్తుంది. చెంచాడు కరక్కాయ పొడిని అరకప్పు పలుచని మజ్జిగలో కలిపి రాత్రిపూట నిద్రపోయే ముందు తాగాలి.


మరిన్ని కథనాలు https://epaper.eenadu.netలో


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని