లావెండర్‌ వండర్‌ చూద్దామా!
close

తాజా వార్తలు

Updated : 14/06/2020 00:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

లావెండర్‌ వండర్‌ చూద్దామా!

లావెండర్‌ నూనె... అద్భుతమైన దీని పరిమళం మనసుకు సాంత్వన కలిగించడంతో పాటు మరెన్నో ప్రయోజనాలనీ అందిస్తుంది. చర్మం, జుట్టు సంరక్షణ కోసం దీనిని ఉపయోగిస్తే కోరుకున్న ఫలితాలు సొంతమవుతాయి...

* లావెండర్‌ నూనెకి యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ సెప్టిక్‌ గుణాలు ఎక్కువ. బ్యాక్టీరియాతో పోరాడుతుంది. ముఖంపై మొటిమల తాలూకు మచ్చలని లావెండర్‌ నూనెలో ముంచిన దూదితో శుభ్ర పరిస్తే... క్రమంగా అవి తగ్గుముఖం పడతాయి.

* కాలుష్యం ఇతరత్రా కారణాలు, వాతావరణంలోని వ్యర్థాలు, విషపూరిత రసాయనాలు చర్మాన్ని నిర్జీవంగా మార్చేస్తాయి. అలాకాకుండా ఉండాలంటే ఆలివ్‌నూనెలో రెండు చుక్కల లావెండర్‌ నూనెను కలిపి ఒంటికి మర్దన చేయాలి. దీనివల్ల చర్మానికి నిగారింపు వస్తుంది.

* జుట్టు పీచులా, నిర్జీవంగా తయారైనప్పుడు పావుకప్పు కొబ్బరి నూనెలో నాలుగైదు చుక్కల లావెండర్‌ నూనెను కలిపి శిరోజాలకు పట్టించాలి. ఆపై మృదువుగా మర్దన చేసి షవర్‌ క్యాప్‌ పెట్టేయాలి. అరగంటయ్యాక గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని