ఐన్‌స్టీన్‌ ఊహని... ఇంట్లో నుంచే నిజం చేసింది!
close

తాజా వార్తలు

Updated : 14/06/2020 08:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఐన్‌స్టీన్‌ ఊహని... ఇంట్లో నుంచే నిజం చేసింది!

ఏం చేద్దామన్నా ఈ లాక్‌డౌన్‌ ఒకటి వచ్చిపడింది అంటూ నిరాశ పడిన వాళ్లంతా అమృతా గాడ్గే సాధించిన విజయం గురించి తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే. ఎందుకంటే ఈ భారత సంతతి అమ్మాయి.. ఐన్‌స్టీన్‌ లాంటి గొప్ప శాస్త్రవేత్తల ఊహను ఇంట్లోనే కూర్చుని నిజం చేసింది కాబట్టి...

ఏదైనా ఒక పదార్థం ఘన, ద్రవ, వాయు, ప్లాస్మా రూపాల్లో ఉంటుందని తెలుసు. ఈ నాలుగూ కాకుండా మరో రూపమూ ఉంటుందని కొన్నేళ్ల క్రితమే మన శాస్త్రవేత్తలు ఊహించారు. ఆ అయిదో రూపాన్నే బీఈసీ(బోస్‌ ఐన్‌స్టీన్‌ కండెన్సేట్‌) అని పిలుస్తారు. సుమారు వందేళ్ల క్రితమే సత్యేంద్రనాథ్‌ బోస్‌, ఐన్‌స్టీన్‌లు ఈ ‘ఫిఫ్త్‌ మేటర్‌’ గురించి ఊహ మాత్రంగా చెప్పగలిగారు. బ్రిటన్‌లోని ససెక్స్‌ యూనివర్సిటీలో పనిచేస్తోన్న భారతీయ శాస్త్రవేత్త అమృతా గాడ్గే ఆ అయిదో రూపాన్ని ఇంట్లోనే ఉండి రిమోట్‌ కంట్రోల్‌తో ల్యాబ్‌లో సృష్టించింది. కొన్ని పరమాణువుల్ని అత్యంత శీతల వాతావరణంలో ఉంచినప్పుడు వాటి గమనం దాదాపు మందగించి ఒక పదార్థంగా మారుతుంది. ఈ రూపమే ‘ఫిఫ్త్‌ మేటర్‌’. నిజానికి ఈ వాతావరణ సృష్టి చాలా సంక్లిష్టమైన ప్రక్రియ. లాక్‌డౌన్‌ సమయంలో... ల్యాబ్‌ నుంచి రెండు మైళ్ల దూరంలో ఉన్న తన ఇంటికి ప్రత్యేకమైన కేబుల్‌ని ఏర్పాటుచేసుకుని దానిద్వారా లేజర్‌ కిరణాలూ, రేడియో తరంగాల్ని రిమోట్‌తో నియంత్రిస్తూ, పరమాణువుల్లో మార్పుల్ని నిరంతరం గమనిస్తూ బీఈసీ సృష్టించింది అమృత. ఈమె తల్లి భౌతికశాస్త్ర అధ్యాపకురాలు. ‘అమ్మ పాఠాలే నేను శాస్త్రవేత్త కావడానికి స్ఫూర్తి’ అంటారు అమృత.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని