మగాళ్ల కోటలో పాగా వేద్దాం!
close

తాజా వార్తలు

Published : 13/06/2020 00:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మగాళ్ల కోటలో పాగా వేద్దాం!

వంట గది నుంచి కంపెనీ సీఈవో వరకు... పిల్లల ఆలనాపాలనా నుంచి విమానాలు నడిపే వరకు... అతివ అడుగిడని రంగం లేదు. అయినా అన్నిరంగాల్లో ఇప్పటికీ మగాళ్లదే ఆధిపత్యం. పురుషుల మధ్యలో పని చేయాల్సిన సందర్భంలో మహిళ తనని తాను ఎలా నిరూపించుకోవాలంటే.

* గొంతెత్తాలి: కీలక సమావేశాలు, చర్చల్లో పురుషులతో పోలిస్తే మహిళలు నలభైశాతం తక్కువగా గొంతు విప్పుతారంటోంది హార్వర్డ్‌ బిజినెస్‌ రివ్యూ. ప్రతిభ ఉన్నా కార్యాలయ సమావేశాల్లో నోరు విప్పడానికి ఉద్యోగినులు సంకోచిస్తుంటారు. ఈ పరిస్థితి మారాలి. చర్చించబోయే విషయం గురించి కొంచెం సన్నద్ధం అయితే ఆటోమేటిగ్గా మనపై మనకు నమ్మకం కలుగుతుంది.

* నిందించవద్దు: ఏ పని చేస్తున్నా మనం ఎదగడానికి నెట్‌వర్క్‌ పెంచుకోవడం ముఖ్యం. అందరితో సఖ్యతగా ఉండాలి. అంతేగానీ ఇతరులపై చాడీలు చెబుతూ, రాజకీయాలు చేస్తూ ఉంటే అందరిలో చులకన అయిపోతాం.

* గుర్తింపు: మహిళలు ఎక్కువగా ‘నన్నెవరూ గుర్తించడం లేదు’, ‘చేస్తున్న పనికి గుర్తింపు దక్కడం లేదు’ అని అదేపనిగా ధపడుతుంటారు. ఈ కుంగుబాటు వదిలేయాలి. నిజాయతీగా, ఆకట్టుకునేలా పని చేస్తే కాస్త ఆలస్యంగానైనా గుర్తింపు దక్కుతుందని మరవొద్ధు

* సమష్టిగా ముందుకు: పనిచేసే చోట ఎదగాలంటే అందరితో కలిసి నడవాలి. పెద్దవాళ్లని గౌరవించడం, మంచి సలహాలిస్తే చిన్నవాళ్ల నుంచైనా స్వీకరించాలి.

* తుంచేయాలి: ఎక్కువమంది మగాళ్ల మధ్య పని చేయాల్సి వచ్చినప్పుడు మహిళలు లైంగిక వేధింపులు ఎదుర్కొంటుంటారు. ఈ పరిస్థితి రాకుండా ముందే జాగ్రత్త పడాలి. మనతో సన్నిహితంగా మెలిగేలా ఎవరికీ చనువు, చొరవ ఇవ్వొద్ధు ఎవరైనా తప్పుగా ప్రవర్తిస్తే వెంటనే పై అధికారులకు ఫిర్యాదు చేయాలి.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని