నెలసరి తప్పితే సమస్యేనా?
close

తాజా వార్తలు

Published : 13/06/2020 00:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నెలసరి తప్పితే సమస్యేనా?

ప్ర: నా వయసు 26. డెలివరీ అయి ఏడాదిన్నర అవుతోంది. ప్రసవం అయిన ఐదు నెలలకే పీరియడ్స్‌ మొదలయ్యాయి. కానీ 45 రోజులకు, 59 రోజులకు.. ఇలా ఓ క్రమం లేకుండా వస్తున్నాయి. ఇంతకు ముందు ఇలా ఉండేది కాదు. దీనివల్ల ఏవైనా సమస్యలొస్తాయా?

జ: మీకు పీరియడ్స్‌ ఈ మధ్యే ఇలా వస్తున్నాయని రాశారు. ఉన్నట్లుండి పీరియడ్స్‌ క్రమంలో మార్పు వచ్చిందంటే దానికి ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది. అదేంటో తెలుసుకోవాలంటే మీ అండాశయాల నుంచి హార్మోన్లు ఏ రకంగా విడుదలవుతున్నాయి? మీ ఇతర హార్మోన్ల సమతుల్యత ఏ రకంగా ఉంది?.. ఇవన్నీ తెలుసుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా కాన్పు తర్వాత బరువు పెరగడం వల్ల నెలసరి సరిగా రాదు. కాబట్టి మీరు ఒకసారి గైనకాలజిస్ట్‌ని సంప్రదిస్తే అవసరమైన పరీక్షలన్నీ చేసి మీ సమస్య ఏంటో తెలుసుకొని దానికి తగిన చికిత్స సూచించగలుగుతారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని