శిరోజాలకు... థాలి తినిపిద్దాం!
close

తాజా వార్తలు

Published : 13/06/2020 00:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

శిరోజాలకు... థాలి తినిపిద్దాం!

అన్నం, కూర, పప్పు, పచ్చడి... అన్నీ ఉన్న సంపూర్ణ భోజనం గురించి తెలుసు.. మరి శిరోజాలకు కూడా సంపూర్ణమైన భోజనం ఒకటి ఉంటుందని తెలుసా? కేరళ అమ్మాయిలు వాళ్ల అమ్మమ్మల కాలం నుంచీ అనుసరించే హెయిర్‌ థాలి గురించి తెలుసుకుందాం...

జుట్టుకు నల్లదనాన్నిచ్చే కరివేపాకు, మృదుత్వాన్ని అందించే మందారాకులు, పూలు.. తలలోని వేడిని తగ్గించి కురులను రాలకుండా చేసే గోరింటాకు, కలబందలతోపాటు మాడును ఆరోగ్యంగా ఉంచి, చుండ్రును దూరంగా ఉంచే తులసి, వేపాకులను ఎండలో ఆరబెట్టాలి. వీటితోపాటు చిన్నగా కోసిన ఉసిరికాయ ముక్కలు, గుప్పెడు పెసలు, మెంతులను విడిగా ఎండబెట్టుకోవాలి. ఇవన్నీ ఎండటానికి సుమారుగా ఓ పది రోజులు పడుతుంది. ఆకుల మిశ్రమాన్ని విడిగా, మిగతావాటిని విడిగా తీసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇందులో దోరగా వేయించి చల్లార్చిన అవిసె గింజల పొడిని కూడా అదనంగా కలుపుకోవాలి. ఈ మొత్తం మిశ్రమాన్ని పొడిగా ఉండే సీసాలో భద్రపరుచుకోవాలి. రెండు చెంచాల హెయిర్‌ థాలి పొడి తీసుకుని దానికి బియ్యం నానబెట్టిన నీళ్లు, చెంచా చొప్పున నిమ్మరసం, పెరుగు, గుడ్డులోని తెల్ల సొన కలిపి పేస్టులా చేసుకొని కురుల మొదళ్ల నుంచి పట్టించాలి. అరగంట తరువాత నేచురల్‌ షాంపూ లేదా కుంకుడుకాయ రసంతో తలస్నానం చేస్తే చాలు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని