close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 12/06/2020 00:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

‘గోల్‌’ గోల చేద్దామా!

చూస్తుండగానే వర్షాకాలం మొదలైంది. బయట ఆడుకుందామంటే కుదరదు. అలా అని ఆడకుండా ఉండలేం. దీనికి పరిష్కారంగా ఈ రోజు ఓ కొత్త ఇండోర్‌ గేమ్‌ ఆడటం ఎలాగో తెలుసుకుందామా. ఇద్దరు ఉంటే చాలు ఎంచక్కా ఈ ఆట ఆడేసుకోవచ్చు.

ఏమేం కావాలంటే..

* ఓ పది పన్నెండు బెలూన్లు

* రెండు సన్నని ప్లాస్టిక్‌ పైపులు (ప్లాస్టిక్‌ బ్యాట్‌లు, పీవీసీ పైపులు అయినా ఫర్లేదు)

* రెండు పెద్ద ప్లాస్టిక్‌ బుట్టలు

ఎలా ఆడాలంటే..

* అమ్మానాన్న సాయంతో ఇంట్లోనే ఓ కోర్టులాంటిదాన్ని తయారు చేసుకోండి.

* కోర్టుకి అటూ ఇటూ రెండు ప్లాస్టిక్‌బుట్టలు పెట్టుకోండి.

* ఇవి గోల్‌ పోస్టులన్నమాట.

* మధ్యలో గాలి ఊది సిద్ధం చేసుకున్న బెలూన్లు పెట్టుకోండి.

* ఇప్పుడు పైపులతో చాలా నెమ్మదిగా.. జాగ్రత్తగా.. ప్లాస్టిక్‌ బుట్టలోకి బెలూన్లను నెట్టండి. ఒకరు నెడుతుంటే.. మరొకరు అడ్డుకోకూడదు. ఇలా చేస్తే బెలూన్లు పగిలిపోతాయి.

* అలా చేసేటప్పుడు బెలూన్‌ పగిలిపోతే వారికి మైనస్‌ పాయింట్లు.

* ఎవరు ఎక్కువ బెలూన్లు బుట్టలో వేసి గోల్‌ చేస్తే వారే గెలిచినట్లు.

* ఇంకెందుకాలస్యం ఓ సారి ప్రయత్నించండి మరి.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.