బొమ్మను కాదు.. నేనూ ఆక్టోపస్‌నే!
close

తాజా వార్తలు

Published : 09/06/2020 00:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బొమ్మను కాదు.. నేనూ ఆక్టోపస్‌నే!

చూడగానే ముద్దొచ్చే బొమ్మలా కనిపిస్తున్న నేను నిజానికి ఆక్టోపస్‌ను! నన్ను గ్రింపోటెథిస్‌ అంటారు. పలకడానికి కష్టంగా ఉంది కదూ! ఎంచక్కా డుంబో ఆక్టోపస్‌ అనండి సరేనా! ఇదీ కష్టంగా ఉందనుకోండి అంబ్రెల్లా ఆక్టోపస్‌ అనేసేయండి. ఫర్లేదు! ఎందుకంటే ఇవన్నీ నా పేర్లే మరి! నా గురించి మరిన్ని విశేషాలు తెలుసుకోవాలని ఉందా? ఇంకెందుకాలస్యం అయితే చదివేయండి!

న్నట్లు మీకు అసలు విషయం ఒకటి చెప్పడం మరిచాను. నాకు ఏనుగుకు ఉన్నట్లే రెండు చెవుల వంటి నిర్మాణాలు ఉంటాయి. అందుకే నన్ను ఎలిఫెంట్‌ ఆక్టోపస్‌ అనీ అంటుంటారు. కానీ అవి చెవులు కాదు. నేను సముద్రం అడుగున ఉంటాను కదా! అక్కడ నేను సంచరించడానికి, దిశను మార్చుకోవడానికి ఇవి సాయపడతాయి.

అందమంటే నాదే!

* నేను సముద్ర జీవిని. దాదాపు ప్రపంచమంతా విస్తరించి ఉన్నా.

* వెయ్యి నుంచి ఏడువేల మీటర్ల లోతులో ఉంటాను కాబట్టి మీరు నన్ను చూసి ఉండరు.

* సముద్రంలో అత్యంత లోతున నివసించే ఆక్టోపస్‌ను నేనే అని మీ పరిశోధకులు తేల్చారు.

* అంతేకాదండోయ్‌.. ప్రపంచంలోకెల్లా అందమైన ఆక్టోపస్‌నూ నేనే. అందుకే నన్ను క్యూటెస్ట్‌ ఆక్టోపస్‌ అంటారు.

రంగోలి ఆడలేను కానీ..

* నేను మాములు ఆక్టోపస్‌ల్లా శత్రుజీవులపై ఒకరకమైన రంగులాంటి ద్రావణాన్ని పిచికారీ చేయలేను.

* కానీ ఊసరవెల్లిలా నేనూ రంగులు మార్చగలను.

* షార్క్‌ల వంటి శత్రువుల నుంచి రక్షించుకోవడానికే మాకు ఈ ఏర్పాటు. ఇలా నేను రంగులు మార్చేసుకుని శత్రుజీవులకు కనిపించకుండా వాటిని బురిడీ కొట్టిస్తా.

విచ్చుకున్న గొడుగల్లే ఉంటా..

* అలాగే నాకు అంతపెద్ద టెంటికల్స్‌ కూడా ఉండవు. చాలా చిన్నగా ఉంటాయి.

* అందుకే నేను సముద్రంలో ఒక చోట నుంచి మరోచోటకు ప్రయాణిస్తుంటే.. విచ్చుకున్న గొడుగు వెళుతున్నట్లే ఉంటుంది.

* ఇతర ఆక్టోపస్‌ల్లానే నేను గుడ్లు పెడతాను. ఇవన్నీ చూడటానికి ద్రాక్షగుత్తుల్లా ఉంటాయి.

* నేను సముద్రంలో ఉండే ఇతర చిన్న చిన్న జీవులను ఆహారంగా తీసుకుంటాను.

సరే.. ఫ్రెండ్స్‌ ఉంటామరి.. టిఫిన్‌ చేసే సమయమైందని మా అమ్మ పిలుస్తోంది.

బైబై!


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని