close

తాజా వార్తలు

Published : 06/06/2020 01:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అమ్మకో కానుక!

బిడ్డ పుడితే ఎవరైనా స్వీట్లు పంచుతారు. ఆ ఆసుపత్రి నిర్వాహకులు మాత్రం ప్రతి ప్రసవం తర్వాత ఆ తల్లికి ఒక మొక్కను కానుకగా అందజేస్తారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా పదేళ్ల కిందట ప్రారంభించిన ఈ సంప్రదాయం ఇప్పటికీ కొనసాగిస్తూనే ఉంది కేరళలోని ద మాట్రియా హాస్పిటల్‌ ఫర్‌ వుమెన్‌ అండ్‌ చిల్డ్రన్‌ యాజమాన్యం. 2010లో ప్రసవం కోసం వచ్చిన నిండు గర్భిణి బిడ్డతో ఇంటికి తిరిగి వెళుతున్నప్పుడు ఓ మామిడి మొక్కను బహుమతిగా ఇచ్చారు. అప్పట్నుంచి ఇది కొనసాగిస్తున్నారు. మొక్కను ఇస్తున్నప్పుడు దాన్ని బిడ్డను సంరక్షించినట్టే సాకాలని జాగ్రత్తలు చెబుతారు. ఏటా పర్యావరణ దినోత్సవాన ఆయా మొక్కల పర్యవేక్షణ ఎలా ఉందో సిబ్బంది స్వయంగా వెళ్లి పరిశీలిస్తారు. గడిచిన పదేళ్లలో ఇప్పటివరకు ఆ ఆసుపత్రిలో 15వేల మంది నవజాత శిశువులు పుట్టారు. ఆ సందర్భంగా నాటిన మొక్కల్లో ఎన్నో వృక్షాలయ్యాయి. ఈ ఏడాది పర్యావరణ దినోత్సవాన్ని ఆసుపత్రి యాజమాన్యం ఘనంగా నిర్వహించడమే కాకుండా, తాము అందించిన మొక్కల పరిస్థితిని పరిశీలించారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.