close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 03/06/2020 00:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ప్రభుత్వ ఉద్యోగాలు

ఎన్‌టీపీసీలో ప్రొఫెషనల్స్‌

న్యూదిల్లీ ప్రధానకేంద్రంగా ఉన్న ఎన్‌టీపీసీ లిమిటెడ్‌ ఫిక్స్‌డ్‌ టర్మ్‌ ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 23

పోస్టులు-ఖాళీలు: ఎగ్జిక్యూటివ్‌ (ఎక్స్‌కవేషన్‌)-02, ఎగ్జిక్యూటివ్‌ (మైన్‌ ప్లానింగ్‌)-02, మైన్‌ సర్వేయర్‌ హెడ్‌-01, అసిస్టెంట్‌ మైన్‌ సర్వేయర్‌/ మైన్‌ సర్వేయర్‌-18. అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా (ఇంజినీరింగ్‌), ఇంజినీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణత, అనుభవం.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌. దరఖాస్తుకు చివరి తేది: జూన్‌ 22, 2020.

వెబ్‌సైట్‌: https://www.ntpc.co.in/

ఈసీఐఎల్‌, హైదరాబాద్‌

హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ఈసీఐఎల్‌) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

టెక్నికల్‌ ఆఫీసర్‌ మొత్తం ఖాళీలు: 12 అర్హత: ఇంజినీరింగ్‌ డిగ్రీ(కంప్యూటర్‌ సైన్స్‌) ఉత్తీర్ణత, అనుభవం. వయసు: 31.05.2020 నాటికి 30 ఏళ్లు మించకూడదు. ఎంపిక విధానం: రాతపరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌. దరఖాస్తుకు చివరి తేది: జూన్‌ 22, 2020.

వెబ్‌సైట్‌: http://www.ecil.co.in/

ఐఏఆర్‌ఐలో ప్రాజెక్ట్‌ స్టాఫ్‌

న్యూదిల్లీలోని ఐకార్‌-ఇండియన్‌ అగ్రికల్చరల్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఐఏఆర్‌ఐ) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 18. పోస్టులు: రిసెర్చ్‌ అసోసియేట్‌, జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలో, యంగ్‌ ప్రొఫెషనల్స్‌, సైంటిఫిక్‌ అడ్మినిస్ట్రేటివ్‌ అసిస్టెంట్‌ తదితరాలు. అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్‌, పోస్టు గ్రాడ్యుయేషన్‌, పీహెచ్‌డీ ఉత్తీర్ణత, అనుభవం. ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు విధానం: ఈమెయిల్‌ ద్వారా. దరఖాస్తుకు చివరి తేది: జూన్‌ 21, 2020.

వెబ్‌సైట్‌: https://www.iari.res.in/

ప్రవేశాలు

పీడీయూఎన్‌ఐపీపీడీ, న్యూదిల్లీ

న్యూదిల్లీలోని భారత ప్రభుత్వ సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖకు చెందిన పండిట్‌ దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ పర్సన్స్‌ విత్‌ ఫిజికల్‌ డిజెబిలిటీస్‌ (పీడీయూఎన్‌ఐపీపీడీ)(దివ్యాంగన్‌) 2020-21 విద్యాసంవత్సరానికి కింది ప్రోగ్రాముల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

కోర్సులు: 1) బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫిజియోథెరపీ (బీపీటీ)-4 1/2 ఏళ్లు, 2) బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆక్యుపేషనల్‌ థెరపీ (బీఓటీ)- 4 1/2 ఏళ్లు, 3) బ్యాచిలర్‌ ఆఫ్‌ ప్రోస్థటిక్స్‌ అండ్‌ ఆర్థోటిక్స్‌ (బీపీఓ)-4 1/2 ఏళ్లు. అర్హత: సంబంధిత సబ్జెక్టులతో ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణత.

వయసు: 31.12.2020 నాటికి 17 ఏళ్లు ఉండాలి.

ఎంపిక విధానం: ప్రవేశపరీక్షలో మెరిట్‌ ఆధారంగా.

పరీక్ష తేది: ఆగస్టు 09, 2020.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.

దరఖాస్తుకు చివరి తేది: జులై 09, 2020.

వెబ్‌సైట్‌: http://pdunippd.in/

అప్రెంటిస్‌షిప్‌

హెచ్‌ఎంటీ, బెంగళూరు

బెంగళూరులోని హెచ్‌ఎంటీ మిషన్‌ టూల్స్‌కి చెందిన హెచ్‌ఎంటీ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ కింది అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

అప్రెంటిస్‌

మొత్తం ఖాళీలు: 36. విభాగాల వారీగా ఖాళీలు: ట్రేడ్‌ అప్రెంటిస్‌-26, టెక్నీషియన్‌ అప్రెంటిస్‌-05, గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌-05 విభాగాలు: ఫిట్టర్‌, ఎలక్ట్రీషియన్‌, ఎలక్ట్రానిక్స్‌, వెల్డర్‌, మెకానికల్‌, ఎలక్ట్రికల్‌ తదితరాలు. అర్హత: అప్రెంటిస్‌ను అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో ఐటీఐ, డిప్లొమా, ఇంజినీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణత.

ఎంపిక విధానం: మెరిట్‌ టెస్ట్‌/ ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌.

చివరి తేది: జూన్‌ 16, 2020.

చిరునామా: హెచ్‌ఎంటీ ట్రెయినింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌, హెచ్‌ఎంటీ మిషన్‌ టూల్స్‌ లిమిటెడ్‌, బెంగళూరు కాంప్లెక్స్‌, జలహళ్లి పీ.ఓ, బెంగళూరు-560013.

వెబ్‌సైట్‌: http://www.hmtmachinetools.com/


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.