close

తాజా వార్తలు

Updated : 01/06/2020 14:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

జగన్‌ తక్షణమే రాజీనామా చేయాలి: కన్నా

విజయవాడ: ముఖ్యమంత్రి పదవిలో కొనసాగే హక్కు జగన్‌ మోహన్‌ రెడ్డికి ఏ మాత్రం లేదని.. తక్షణమే సీఎం పదవికి రాజీనామా చేయాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. విజయవాడలోని ఓ హోటల్ ఆయన మీడియాతో మాట్లాడారు. 2019లో ప్రజలు నమ్మి జగన్‌కు అవకాశం ఇస్తే.. ఇప్పుడు తన అసలు రూపం చూపిస్తున్నారని మండిపడ్డారు. అనుభవరాహిత్యం, అసమర్థ పాలన, కక్షసాధింపు, అహంకారం, ఆత్రం, అప్పులు, అవినీతి రివర్స్ పాలన, కోర్టు మొట్టికాయలు... ఏడాది పాలనంతా ఇలాగే సాగిందని కన్నా ఆరోపించారు. 

‘రాష్ట్రంలో అప్రజాస్వామిక పాలన నడుస్తోంది. ప్రభుత్వం మీద ప్రజలకు నమ్మకం లేదనడానికి హైకోర్టు ఇచ్చిన తీర్పులే నిదర్శనం. రాక్షస పాలనకు ఇంతకన్నా నిదర్శనం ఇంకోటి ఉందా. కౌన్సిల్‌లో తనకు వ్యతిరేకంగా బిల్లు పెట్టి సెలెక్ట్ కమిటీకి పంపినందుకు ఏకంగా మండలినే రద్దు చేయడం జగన్ అహంకారానికి నిదర్శనం. అవినీతి చక్రవర్తి చంద్రబాబు నాయుడు అని గత ఐదేళ్లలో పుస్తకాలు ముద్రించి కేంద్రం చుట్టూ తిరిగిన జగన్.. ఏడాది కాలంలో ఆ అవినీతిపై విచారణ ఎందుకు జరిపించలేదు? గత ప్రభుత్వం జన్మభూమి కమిటీల పేరుతో దోచుకుంటే.. ఇప్పుడు జగన్ వాటికి చట్టబద్ధత కల్పించేలా వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చి గ్రామాలపైకి వదిలారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి హిందూ దేవాలయాలు, భక్తుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరిస్తున్నారు’ అని కన్నా అన్నారు. 

భాజపా పోరాటాలతో దేవాలయాల ఆస్తుల అమ్మకం విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గిందని కన్నా గుర్తు చేశారు. ఏడాది కాలంలో ఒక్క పరిశ్రమ కూడా తీసుకురాలేదని ఆరోపించారు. ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారు తప్ప సుస్థిర అభివృద్ధి దిశగా ఒక్క పనీ చేయడంలేదని ఆయన వైకాపా ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఎన్నికల్లో బెదిరింపులు, భయోత్పాతం సృష్టించి ప్రక్రియను అస్తవ్యస్తం చేశారన్నారు. సాక్షాత్తూ ఎన్నికల కమిషనర్‌కే కులం ఆపాదించడం చూస్తుంటే జగన్ అహంకారం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చని దుయ్యబట్టారు. హైకోర్టు తీర్పునకు అనుగుణంగా ప్రభుత్వం వెంటనే రమేశ్‌ కుమార్‌ను తిరిగి ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించేలా చూడాలని కన్నా విజ్ఞప్తి చేశారు. 



Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.