close

తాజా వార్తలు

Updated : 01/06/2020 13:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

తెదేపా కార్యకర్తపై వైకాపా వర్గీయుల దాడి

పొన్నూరు: గుంటూరు జిల్లాలో గోపి అనే తెలుగుదేశం కార్యకర్తపై వైకాపా కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. పొన్నూరు మండలం పచ్చలతాడిపర్రుకు చెందిన గోపి హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. ప్రస్తుతం సెలవులు కావడంతో ఇంటికి వచ్చాడు. ఈ క్రమంలో రోడ్డుపైనే గోపిపై వైకాపా కార్యకర్తలు దాడికి దిగారు. అడ్డుకోబోయిన వృద్ధురాలిపైనా దాడి చేశారు. ఈ ఘటనలో గోపితోపాటు వృద్ధురాలికి కూడా గాయాలయ్యాయి. ఘటన అనంతరం బాధితులు పోలీసులను ఆశ్రయించారు. గతంలో జరిగిన గొడవలు మనసులో పెట్టుకుని వైకాపా కార్యకర్తలు తనపై మూకుమ్మడిగా దాడి చేశారని బాధితుడు గోపి ఆరోపించారు.



Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.