close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 30/05/2020 00:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అమ్మ మాటే వింటాడు!

డియర్‌ వసుంధర

నేనో ప్రయివేటు ఉద్యోగిని. విధి నిర్వహణలో భాగంగా పొద్దుపోయే వరకు పనిచేయాల్సి ఉంటుంది. నాకు రెండేళ్ల బాబు ఉన్నాడు. నేనొచ్చేంతవరకు వాడిని మా అత్తగారే చూసుకుంటారు. మావారికి నేనంటే చాలా ఇష్టం. కానీ వాళ్ల అమ్మ మాట జవదాటరు. ఆమె చెప్పిందే వింటారు. అందులో తప్పులేదు కానీ... మా అత్తగారు అర్థం చేసుకోరు. ఆమెది చాలా సంకుచిత మనస్తత్వం. ఇంట్లో ఉన్న రోజు నేను, మా వారు పనిని పంచుకుంటార. ఆవిడకది నచ్చదు. ఇంట్లో పనంతా చేసి ఆఫీసుకు వెళ్లమంటారు. నేనేమైనా యంత్రాన్నా?

- ఓ సోదరి, ఈ-మెయిల్‌

జ: ఇంటి పనులతోపాటూ అత్తమామలను చూసుకుంటూ మీ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. ఇందుకు మిమ్మల్ని ముందుగా అభినందించాలి. మీ భర్తను పెంచి, ప్రయోజకుడిగా చేసినవాళ్లు ప్రస్తుతం పెద్దవయసులో ఉన్నారు. కాబట్టి వారి బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత కొడుకు, కోడలిగా మీ ఇద్దరిదీ. భర్తకు మీ వంతుగా తోచినంత సాయం అందించాల్సిన బాధ్యత మీపై ఉంది. ఇది మన సమాజంలో ఓ అనవాయితీ, సంప్రదాయం కూడా. అలాగే మీ తల్లిదండ్రులను చూసుకోవడానికి ఎవరూ లేకపోతే వారిని చూసుకోవాల్సిన బాధ్యత కూడా మీ దంపతులదే.

మీ భార్యాభర్తలిద్దరూ బాగానే ఉంటున్నారు. ఇక.. మీ అత్తామామ పాతతరం వాళ్లు. అంత త్వరగా మారలేరు. వాళ్లను తప్పు పట్టకుండా, వారితో వాదించకుండా మీరు చేయగలిగింది చేయండి. వాళ్లు అన్నది పట్టించుకోవద్ధు మీరు ఆఫీసుకు వెళ్లినప్పుడు బాబు బాగోగులను వారే చూస్తున్నారని రాశారు. రెండేళ్ల బాబును చూసుకోవడానికి చాలా ఓపిక ఉండాలి. ఇది చాలా పెద్ద బాధ్యత కూడా. తల్లిగా మీరు చేయాల్సిన పనులను వారు చేస్తున్నారు. వారి సంరక్షణలో బాబు చక్కగా పెరుగుతున్నాడు. ముందుగా మీరు ఇచ్చిపుచ్చుకునే ధోరణి నేర్చుకోవాలి. మీరేదో వారికి పనులు చేస్తున్నానని అనుకోవద్ధు పెద్దవారైనా వారు ఎంతో కొంత చేస్తున్నారు కదా! కాబట్టి సర్దుకుపోవడం అలవాటు చేసుకోండి. అత్తామామలు ఎలాంటివారైనా వారు మనకంటే పెద్దవారు. కాబట్టి వారికి గౌరవం ఇవ్వాల్సిందే. వారు చేసే ప్రతి పని తప్పు పట్టకుండా నెమ్మదిగా అర్థమయ్యేలా చెప్పండి. క్రమంగా వారిలో మార్పు వస్తుంది. ‘మా అమ్మలాగే ఈమె కూడా’ అని మీరు అనుకున్నప్పుడే పరిస్థితులు చక్కబడతాయి.

మీకు ఇంటా, బయటా రెండు చోట్ల పనిచేయడం కష్టమనిపిస్తే... కొన్నాళ్లపాటు ఉద్యోగానికి సెలవు పెట్టేసి బాబు సంరక్షణ బాధ్యతలు మీరే చూసుకోండి. పిల్లాడిని మీకు నచ్చిన పద్ధతిలో పెంచండి. మీవారు మీ అత్తగారి మాట వింటున్న మాత్రాన... మీపై ప్రేమ లేదని కాదు. విశాల దృక్పథంతో ఆలోచించండి. ఒకసారి మీ భర్త, అత్తమామల కోణం నుంచి కూడా ఆలోచించి చూడండి. ఇవన్నీ చేసిన తరువాత కూడా మీవారిలో, అత్తామామల్లో మార్పు రాకపోతే మీ దంపతులిద్దరూ కౌన్సెలింగ్‌ తీసుకోవాల్సి ఉంటుంది.

- డాక్టర్‌ మండాది గౌరీదేవి, సైకియాట్రిస్ట్‌


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.