close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 28/05/2020 00:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఎండకు గొడుగు పడతాయి!

భానుడు నిప్పులు చెరుగుతున్నాడు. స్ట్రా వేసుకుని మనలోని శక్తిని జుర్రున పీల్చేస్తున్నాడు.. అలాంటి ఎండలో అలసిన శరీరానికి తక్షణశక్తిని అందించే ఈ పానీయాల గురించి తెలుసుకోండి...


కొకొనట్‌ మిల్క్‌షేక్‌...

కావాల్సినవి: లేత కొబ్బరి మీగడ-కప్పు, పాలు-పావు లీటరు, చక్కెర-రెండు చెంచాలు, ఐస్‌క్రీమ్‌-అరకప్పు, కొబ్బరిపాలు- పావు కప్ఫు

తయారీ: పదార్థాలన్నింటినీ ఫుడ్‌ప్రాసెసర్‌లో వేసి చక్కగా బ్లెండ్‌ చేసుకోవాలి. ఆ తరువాత గ్లాసులోకి తీసుకుని కాసిన్ని కొబ్బరిపాలు పోసి, కొబ్బరి తురుముతో గార్నిష్‌ చేసుకోవాలి. వెంటనే చల్లచల్లగా తాగితే చాలా రుచిగా ఉంటుంది.

ప్రయోజనాలు: కొబ్బరి బలవర్థకమైన పదార్థం. దీంట్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి తక్షణ శక్తిని అందివ్వడమే కాకుండా రక్షణనూ ఇస్తాయి. పాలలోని క్యాల్షియం ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుతుంది.


బనానా మిల్క్‌షేక్‌...

కావాల్సినవి: అరటిపండు-ఒకటి, పాలు-పావులీటరు, జీడిపప్పులు-అయిదారు, యాలకుల పొడి-చిటికెడు, తేనె-రెండు చెంచాలు.

తయారీ: గిన్నెలో అరటిపండు ముక్కలు, కాజు, తేనె, పాలు, యాలకుల పొడిని కలిపి మిక్సీలో వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని గ్లాసులోకి తీసుకుని జీడిపప్పుతో గార్నిష్‌ చేసుకుని తాగేయడమే.

ప్రయోజనాలు: అరటిపండులో పొటాషియం అధిక మొత్తంలో ఉంటుంది. ఇది గుండెకు మేలు చేస్తుంది. అలాగే ఎలక్ట్రోలైట్స్‌ను భర్తీ చేస్తుంది. దీంట్లోని పీచు జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది..


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.