close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 27/05/2020 01:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

త్రిఫలప్రదం!

రోగనిరోధక శక్తి పెరగాలి.  మతిమరుపు దరిచేరకూడదు. వయసుతో వచ్చే అనారోగ్య సమస్యలు మిమ్మల్ని చూసి దూరంగా పారిపోవాలి అనుకుంటున్నారా. అయితే మీకు త్రిఫల చూర్ణం కావాల్సిందే..

సిరికాయ, తానికాయ, కరక్కాయ ... ఈ మూడింటినీ కలిపి త్రిఫలాలు అంటారు. వీటితో తయారుచేసిందే  త్రిఫల చూర్ణం. దీంట్లో విటమిన్‌-సి, ఫైటో కెమికల్స్‌, ఫైటో న్యూట్రియంట్స్‌, పాలీఫినాల్స్‌, ఎసెన్షియల్‌ ఆయిల్స్‌ ఉంటాయి. పోషకాల కంటే ఇందులో ఔషధ గుణాలే ఎక్కువ. ఈ చూర్ణాన్ని సమాన పరిమాణంలో తీసుకుంటే ఎలాంటి ఇబ్బందీ ఉండదు. సాధారణంగా దీన్ని మలబద్ధక సమస్య నివారణకు వాడతారు.

ఎలా తీసుకోవాలంటే...
త్రిఫల చూర్ణాన్ని దేనితో కలిపి తీసుకుంటున్నారనేది ముఖ్యం. అనుపాతంతో దీని గుణాలు మారుతుంటాయి. గోరువెచ్చని లేదా చల్లటి నీళ్లు, పాలు, తేనె... ఇలా వివిధ రకాల ద్రవాలతో కలిపి తీసుకున్నప్పుడు ఫలితాలు మారుతుంటాయి. పెద్దవాళ్లు అరచెంచా, చిన్నపిల్లలు పావుచెంచా చొప్పున తీసుకోవచ్చు.
* నేత్ర సంబంధ సమస్యలున్నవాళ్లు పాలతోపాటు తీసుకోవాలి. పాలల్లో తేనె, నెయ్యితో ఈ చూర్ణాన్ని కలిపి తింటే కళ్లు, చర్మం, మెదడుకు మేలు చేస్తుంది.  
* నిద్రపోయే ముందు గోరువెచ్చటి నీళ్లతో కలిపి తీసుకుంటే మలబద్ధకం ఉండదు.
* అధిక బరువున్నవాళ్లు చల్లటి నీళ్లతో తీసుకుంటే బరువు తగ్గుతారు. అరచెంచా చొప్పున రెండు పూటలా వాడాలి. ఇబ్బందులొస్తే పావుచెంచా చొప్పున తీసుకోవాలి.
* మధుమేహగ్రస్థులు నరాల సమస్యలను,  కాలేయ పనితీరును మెరుగుపరచడానికి... ఈ చూర్ణాన్ని చల్లటి నీళ్లతో కలిపి అరచెంచా చొప్పున వాడితే మంచిది.
* సొరియాసిస్‌ లాంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవాళ్లు గోరువెచ్చటి నీళ్లు లేదా తేనెతో దీన్ని కలిపి వాడాలి.
* నోటిపూత, చిగుళ్లవాపులు వచ్చిన వాళ్లు గోరువెచ్చని నీటిలో ఈ చూర్ణాన్ని వేసుకుని పుక్కిలించాలి.
* వైట్‌డిశ్చార్జ్‌ సమస్యతో బాధపడే స్త్రీలు దీన్ని నీళ్లలో వేసి మరిగించి ఆ ప్రాంతాన్ని శుభ్రం చేసుకుంటే ఉపశమనం లభిస్తుంది.
* జుట్టు రాలిపోతుంటే కుంకుడు రసంలో అరచెంచా చూర్ణాన్ని కలిపి మాడుకు పట్టించాలి.
* జలుబు, దగ్గు, అజీర్తి సమస్యలకు ఈ చూర్ణం చాలా మంచిది. శొంఠి, పిప్పళ్లు, మిరియాలతో కలిపి దీన్ని తీసుకోవాలి.
* కడుపులో నులిపురుగులు ఉంటే అరచెంచా త్రిఫల చూర్ణాన్ని వాముతో కలిపి తినాలి.
* ఈ చూర్ణాన్ని మోతాదుకు మించి తీసుకుంటే విరేచనాలు అవుతాయి. దీనికి విరుగుడుగా పెరుగు లేదా మజ్జిగ తీసుకోవాలి.


త్రిఫలాల ప్రయోజనాలు...

* ఎండిన ఉసిరికాయలో ఎక్కువగా ఉండే విటమిన్‌-సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
* కరక్కాయ రోగ నిరోధకశక్తిని పెంచి, అజీర్తి నుంచి కాపాడుతుంది.
* జుట్టు రాలే సమస్యను తానికాయ అరికడుతుంది. రోగనిరోధక శక్తినీ పెంచుతుంది. జ్వరం వచ్చినప్పుడు దీన్ని వాడితే తీవ్రత తగ్గడంతోపాటు రోగి త్వరగా కోలుకునే అవకాశముంది.

- డాక్టర్‌ పెద్ది రమాదేవి, ఆయుర్వేద నిపుణులు


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.