close

తాజా వార్తలు

Published : 23/05/2020 00:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

హత్తుకునేంతలా..

ఎమోజీ ట్రెండ్

ఇప్పుడు ఏ ఇద్దరూ ఆత్మీయంగా కలిసే వీలు లేకపోయినా.. ఏ ఒక్కరి చేతిలో చూసినా స్మార్ట్‌ఫోనే.. విధిగా సామాజిక దూరం పాటిస్తున్నారు.. వర్చువల్‌ మీటింగ్‌లకే పరిమితం అవుతున్నారు. సోషల్‌ మీడియాలోనే ముచ్చట్లు పెడుతున్నారు. మనసులో భావాల్ని పంచుకుంటున్నారు. ఒకరినొకరు తాకలేని పరిస్థితిలో ఎఫ్‌బీ వేదికగా మనసారా హత్తుకుంటున్నారు. కేరింగ్‌ని తెలిపేందుకు మాస్క్‌ ఎమోజీని వాట్సాప్‌లో షేర్‌ చేస్తున్నారు. అవును.. ఇప్పుడు గతంలో కంటే ఎక్కువగా ఎమోజీలు ట్రెండింగ్‌ అవుతున్నాయి. భావప్రసారానికి వారధులవుతున్నాయి. మరి ఈ లాక్‌డౌన్‌లో ఎక్కువగా వాడిన ఎమోజీ ఏంటి? వేటి వాడకం ఎంత శాతం పెరిగిందో ఓ లుక్కేద్దాం!!

* గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఎమోజీల వాడకం 36శాతం పెరిగిందట! అందులోనూ బాధ, కోపం, భయంతో ఉన్న ఎమోజీలు ఎక్కువగా వాడేస్తున్నారట. మనసుకి ఊరటనిచ్చే పాజిటివ్‌ ఎమోజీల వాడకం రేటు చాలా వరకు తగ్గిందని కొన్ని సర్వేలు చెబుతున్నాయి.●

* మొత్తంగా ఎమోజీల వాడకంలో tears of laughter మొదటి స్థానంలో ఉంటే, loudly crying రెండో స్థానంలో ఉంది. ఈ మధ్యనే సరికొత్తగా అందుబాటులో కొచ్చిన pleading face emoji మూడో స్థానంలో నిలిచింది. ●

* ట్విటర్‌లో ‘నమస్కారం’ ఎమోజీ వాడకం 25శాతం పెరిగింది. ధన్యవాదాలు తెలపడం, భయపడకుండా ఉండమని సూచించడం, ధైర్యాన్ని చెప్పడం వంటి వాటికి ఈ ఎమోజీని ఎక్కువగా పంపుతున్నారు. త్వరలో ‘గ్రాటిట్యూడ్‌’ తెలియజేసే మరో ఎమోజీని ట్విటర్‌ ప్రవేశపెట్టనుంది. ●

* లాక్‌డౌన్‌లో కుర్రకారు ఇతరులకు వైరస్‌ గురించి తెలిపేందుకు ఎక్కువగా మైక్రోబ్‌, మాస్క్‌, ఫేస్‌ విత్‌ హెడ్‌బ్యాండేజ్‌.. లాంటి వార్నింగ్‌ సంబంధిత ఎమోజీలను బాగా వాడుతున్నారు.●

* కరోనా కోరలకు చిక్కకుండా జాగ్రత్తగా ఉండమని సూచించే ‘రెడ్‌ సర్కిల్‌, పోలీస్‌ కార్‌ లైట్‌, వార్నింగ్‌’.. లాంటి ఎమోజీలనూ ఎక్కువగా వినియోగిస్తున్నారు.


ఇవే కొత్తగా పుట్టుకొచ్చినవి..

* ఈ మధ్యే ఫేస్‌బుక్‌ ప్రవేశపెట్టిన ‘హగ్‌’ఎమోజీని చాలా మంది ఇష్టపడుతున్నారు. తమ ప్రియమైన వారిని తాకలేని తరుణంలో ఈ హగ్‌ ఎమోజీతో తమ ప్రేమని తెలుపుతున్నారు.

* ఇద్దరు వ్యక్తులు ఒకరినొకరు హత్తుకున్నట్లుగా ఉండే ఎమోజీ Unicode Consortium ప్రతిపాదనలో ఉంది. దాంతో మీ ప్రియమైన వారికి మరింత చేరువవుతారు.

* ట్విటర్‌ కూడా ఈ సమయంలో ఇతరులకు మీ ప్రేమను పంచే మరికొన్ని ఎమోజీలను త్వరలో వినియోగదారులకు అందించే ప్రయత్నాల్లో ఉంది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.