close
Array ( ) 1

తాజా వార్తలు

Updated : 21/05/2020 13:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఆగుదామా... సాగిపోదామా?

విదేశీవిద్యకు ప్లాన్‌-బి

కరోనా విపత్తు కారణంగా దేశాల మధ్య రాకపోకలు స్తంభించాయి. ఎంబసీలన్నీ మూతబడి, వీసా ఇంటర్వ్యూలు తదితర కార్యక్రమాలన్నీ వాయిదా పడ్డాయి. అంతర్జాతీయ విమానాలు ఎప్పుడు ఎగురుతాయో తెలియదు. విదేశీ విశ్వవిద్యాలయాలన్నీ తరగతి బోధనను ఆపేసి ఆన్‌లైన్‌ టీచింగ్‌ వైపు దృష్టిసారించాయి. ఈ పరిణామాల మధ్య ఇతర దేశాల్లో చదవాలని ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న కొందరు విద్యార్థులు సన్నాహాలు చేసుకున్నారు. ఇంకొందరు చేసుకుంటున్నారు. కానీ వెళ్లాలా.. వద్దా అనే సందిగ్ధంలో పడిపోయారు. ఈ నేపథ్యంలో అభ్యర్థులందరికీ ప్రత్యామ్నాయ ప్రణాళిక ‘ప్లాన్‌- బి’ని నిపుణులు సూచిస్తున్నారు.

విదేశాల్లో ఉన్నతవిద్య శ్రావిక కల. తగ్గట్టుగానే డిగ్రీ మొదటి సంవత్సరం నుంచి పక్కాగా ప్లాన్‌ వేసుకుంది. మంచి విశ్వవిద్యాలయంలో ప్రవేశం దక్కించుకుంది. వీసా ఇంటర్వ్యూ అన్నింటినీ సులువుగా దాటేసింది. తీరా నాలుగు రోజుల్లో ప్రయాణం ఇంతలో లాక్‌డౌన్‌.

ధీరజ్‌కి బీటెక్‌ పూర్తయింది. క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌లో ఉద్యోగాన్ని సాధించాడు. తనకేమో ఎంఎస్‌ చేయాలనే కోరిక. నాలుగో ఏడాదిలో ఉండగానే ప్రీరిక్విజిట్‌ పరీక్షలపై దృష్టిపెట్టాడు. మంచి స్కోరు సాధించాడు. నచ్చిన విదేశీ విద్యాసంస్థలకు దరఖాస్తు చేసుకుంటే అడ్మిషన్‌ ఆఫర్‌ వచ్చింది. కానీ ఎంబసీలు తెరుచుకోలేదు. దీంతో క్యాంపస్‌లో ఎంపికైన ఉద్యోగానికి వెళ్లాలా, ఫాల్‌-2020లో చేరాలా, లేకపోతే స్ప్రింగ్‌-2021 అడ్మిషన్ల డిఫర్‌మెంట్‌కు మొగ్గు చూపాలా అనే సందిగ్ధావస్థలో ఉన్నాడు.

మాధవ్‌ డిగ్రీ పాసయ్యాడు. ఉన్నతవిద్యకు విదేశాలకు వెళదామనుకున్నాడు. వచ్చే ఏడాది స్ప్రింగ్‌ను లక్ష్యంగా పెట్టుకున్నాడు. అందుకోసం ప్రీరిక్విజిట్‌ పరీక్షల తరగతులకు హాజరవుతున్నాడు. సిలబస్‌ సగం పూర్తయింది. అంతలో కరోనా పరిణామాలు. సన్నద్ధత కొనసాగించాలా? ప్రస్తుతానికి ఆపాలా? తెలియని స్థితిలో ఉన్నాడు.

అమెరికా, ఆస్ట్రేలియా, యూకే, కెనడా, న్యూజీలాండ్‌, జర్మనీ.. దేశంతో సంబంధం లేకుండా వీటికి దరఖాస్తు చేసుకున్న విద్యార్థులందరి పరిస్థితీ పై ముగ్గురిలాగే ఉంది.

విదేశీ విద్య నిర్ణయం వెనక కొన్ని సంవత్సరాల ప్రణాళిక, సన్నద్ధత ఉంటాయి. వివిధ పరీక్షలకు సిద్ధమవడం, రాయడం, కావాల్సిన సమాచారాన్ని సేకరించుకోవడం, ప్రణాళిక వేసుకోవడం, సరైన గమ్యాన్ని ఎంచుకోవడం, తగిన విశ్వవిద్యాలయం, కోర్సులను చూసుకోవడం.. వంటి ఎన్నో అంశాలు! వీటన్నింటికీ కరోనా బ్రేకు వేసేసింది. గత ఏడాది మనదేశం నుంచి ప్రముఖ గమ్యస్థానాలైన యూఎస్‌, ఆస్ట్రేలియా, యూకే, కెనడా లాంటి దేశాలకు వెళ్లినవారి సంఖ్య 7.5 లక్షలు. పరిస్థితులు సాధారణంగా ఉండి ఉంటే చాలామంది విద్యార్థులు ఫాల్‌ ప్రవేశాలకు వీసా ఇంటర్వ్యూల్లో ఉండేవారు.


తగ్గని ఆసక్తి

నదేశంతో పోలిస్తే వైరస్‌ విజృంభణ విదేశాల్లోనే ఎక్కువగా ఉంది. ఈ పరిస్థితుల్లో ఎవరైనా భయపడటం సహజమే. కానీ మన విద్యార్థుల ఆలోచనాధోరణి ఇందుకు భిన్నంగా ఉంది. విదేశీ విద్యకు ప్రణాళిక వేసుకున్న వారిలో 80 శాతానికిపైగా దేశీయ విద్యార్థులు ఇప్పటికీ అటువైపే స్థిరంగా మొగ్గు చూపుతున్నారు. ప్రముఖ సంస్థలు లివరేజ్‌ ఎడ్యు, క్యూఎస్‌ దేశీయ విద్యార్థులపై చేసిన సర్వేలో ఆ విషయాలు వెల్లడయ్యాయి.


* 60-76% మంది విద్యార్థులు వచ్చే ఏడాది (2021 స్ప్రింగ్‌, ఫాల్‌)కు తమ ప్రణాళికను వాయిదా వేసుకున్నారు.

* 16% విద్యార్థులు వేసవిలోపు దీనిపై నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారు. 8% మంది కొవిడ్‌ -19 విషయం తేలిన తర్వాత నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారు.

ముంబయికి చెందిన ఎడ్యుటెక్‌ స్టార్టప్‌- యాకెట్‌ సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది.

* దీని సర్వే ప్రకారం 70% విద్యార్థులు విదేశాల్లో చదవాలనే విషయంలో వెనుకంజ వేయటం లేదు.


వాయిదా వేయడమే మేలు

విదేశీ విద్యను అభ్యసించాలనుకునేవారికి ఫాల్‌ ఇన్‌టేక్‌ అతి పెద్దది. ఎక్కువమంది దీనిపైనే దృష్టిపెడుతుంటారు. కానీ కరోనా కారణంగా ఈ ప్రవేశం విషయంలో ఈసారి సందిగ్ధత ఏర్పడింది.

ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించే వీలుంది. మనదేశం నుంచి మధ్యతరగతి, ఆపైస్థాయి వారే ఎక్కువగా విదేశీవిద్యపై ఆసక్తి చూపుతుంటారు. మనవాళ్ల లక్ష్యం కేవలం చదువేకాదు, తర్వాత చేసే ఉద్యోగమూ అందులో భాగంగా ఉంటుంది. దేశంతో సంబంధం లేకుండా దాదాపుగా అన్ని సంస్థలూ విద్యార్థులకు పోస్ట్‌ స్టడీ వర్క్‌ వీసాను ఇస్తాయి. ఫిజికల్‌ తరగతులకు హాజరైనవారికే ఈ అవకాశం ఉంటుంది. కాబట్టి, విద్యతోపాటు ఉద్యోగం లక్ష్యంగా ఉన్నవారు ఇప్పటికి వాయిదా వేసుకోవడం అంటే డిఫర్‌మెంట్‌ ఆప్షన్‌కు వెళ్లడమే మేలు.

కొవిడ్‌-19 పరిస్థితితో సంబంధం లేకుండా విద్యార్థులు ఇప్పటికీ విదేశీవిద్యపై మొగ్గుచూపుతూనే ఉన్నారు. స్ప్రింగ్‌ కోసం సన్నద్ధమవుతున్నవారికి ఇప్పుడు అందిన అదనపు సమయాన్ని ఉపయోగించుకుంటే మంచి స్కోర్లు సాధించుకోవచ్ఛుఉత్తమ విద్యాసంస్థల్లో ప్రవేశాన్నీ పొందవచ్ఛు ఏ దేశమైనా ఫర్లేదు, వెంటనే వెళ్లడం లక్ష్యం అనుకున్నవారు కెనడా, న్యూజీలాండ్‌, ఐర్లాండ్‌లను పరిశీలించుకోవచ్ఛు ఈ దేశాల్లో ఫిజికల్‌ తరగతులకు 90% అవకాశం ఉంది.


ఉన్న మార్గాలేంటి?

విదేశీ విద్యకు సంబంధించి ‘ఫాల్‌’ను ప్రధాన ఇన్‌టేక్‌గా చెబుతారు. ఎక్కువమంది విద్యార్థులు దీనిపై దృష్టిపెడతారు. దాదాపుగా అన్ని మేజర్‌ కోర్సులూ ఈ సమయంలో అందుబాటులో ఉండటం ప్రధాన కారణం. కానీ ప్రస్తుత పరిస్థితి దృష్ట్యా దేశంతో సంబంధం లేకుండా చాలావరకూ విశ్వవిద్యాలయాలు ప్రస్తుతానికి ఫాల్‌ ఇన్‌టేక్‌ను రెండు నెలలు వాయిదా వేశాయి. కొన్ని ఏకంగా రద్దు చేసే అవకాశమున్నట్లూ ప్రకటించాయి. ఈ సమయంలో విదేశీ విద్యపై ఆశ పెట్టుకున్న విద్యార్థులు తమ ప్లాన్‌- బిపై దృష్టిపెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఇప్పటికే ప్రవేశం పొందినవారు: ఫిజికల్‌ తరగతులు ప్రారంభమవ్వడానికి సహజంగానే సమయం పడుతుంది. కాబట్టి, విశ్వవిద్యాలయాలు ఆన్‌లైన్‌ తరగతులను నిర్వహించే అవకాశముంది. ఇలా అయినా ఫర్లేదు అనుకున్నవారు వీటికి హాజరుకావచ్ఛు నిజానికి నేరుగా విశ్వవిద్యాలయానికి వెళ్లడం ద్వారా ఓరియెంటేషన్‌ తరగతులకు హాజరవడం, తోటి విద్యార్థులతో పరిచయం వంటి అనుభూతులను ఇక్కడ పొందే వీలుండదు. ఆన్‌లైన్‌ ద్వారా చదవడం ఆసక్తి లేనివారికి ‘డిఫర్‌మెంట్‌’ (వాయిదా) ఆప్షన్‌ ఉంది. అంటే వేరే ఇన్‌టేక్‌కు ప్రవేశాన్ని మార్చుకోవడం. ప్రస్తుత పరిస్థితి దృష్ట్యా భౌతికంగా హాజరయ్యే వీలు లేకపోవడం వల్ల వేరే ఇన్‌టేక్‌కు మార్చుకుంటున్నట్లుగా విశ్వవిద్యాలయానికి తెలియజేయడం. ప్రస్తుత విద్యార్థి తన అడ్మిషన్‌ను కావాలనుకుంటే 2021లో జరిగే స్ప్రింగ్‌ (జనవరి)కు కానీ, ఫాల్‌ (ఆగస్టు/ సెప్టెంబరు)కు గానీ మార్పించుకోవచ్ఛు

అడ్మిషన్‌ కోసం ఎదురు చూసేవారు: నిపుణుల ప్రకారం విశ్వవిద్యాలయాలు అడ్మిషన్ల ప్రక్రియపై పనిచేస్తూనే ఉన్నాయి. నిర్ణయం త్వరలోనే వెలువడే వీలుంది. ప్రవేశం పొందినవారు ‘డిఫర్‌మెంట్‌’ ఆప్షన్‌ను ఎంచుకోవచ్ఛు రానివారు ఈ సమయాన్ని తిరిగి ప్రయత్నించడానికి ఉపయోగించుకోవచ్ఛు

ప్రవేశం పొందినవారు తమ విశ్వవిద్యాలయం పట్ల సంతృప్తిగా ఉంటే ఆన్‌లైన్‌లో కోర్సులు చేయవచ్ఛు సాధారణంగా విశ్వవిద్యాలయాల్లో చదివేవారు నిర్ణీత సంఖ్యలో కోర్సులు పూర్తిచేయాల్సి ఉంటుంది. ఒకదాన్ని ఎంచుకుని ఈ సమయంలో పూర్తిచేయవచ్ఛు తర్వాతి ఇన్‌టేక్‌లో వీసా సులువుగా పొందడానికీ ఇది ఉపయోగపడుతుంది.

దేశీయంగా ఏదైనా తక్కువ వ్యవధి కోర్సుల్లో చేరవచ్ఛు ఇప్పటికే ఉద్యోగం చేస్తున్నవారు/ ప్రాంగణ నియామకాల్లో ఉద్యోగం పొందినవారు వాటిల్లోనే కొనసాగొచ్ఛు ఇది విద్యార్థిపై సానుకూల అభిప్రాయాన్ని కలుగజేస్తుంది.

మెరుగైన విద్యాసంస్థకు ప్రయత్నిద్దామనుకునేవారు ప్రీరిక్విజిట్‌ స్కోర్లను మెరుగుపరచుకునే ప్రయత్నాల్లో ఉండవచ్ఛు తద్వారా మంచి ఫెలోషిప్‌, స్కాలర్‌షిప్‌ అవకాశాలను మెరుగుపరచుకునే వీలూ కలుగుతుంది.

విదేశీ ప్రయత్నాలు చేస్తున్నవారు: కరోనా ప్రభావం ఏమాత్రం లేని గ్రూపు ఇది. వీరు యథావిధిగా తమ సన్నద్ధతను కొనసాగించవచ్ఛు అనుకోకుండా దొరికిన ఎక్కువ సమయాన్ని వారికి అనుగుణంగా మార్చుకోవచ్ఛు ప్రీరిక్విజిట్‌ టెస్టుల్లో మంచి స్కోరు సాధించడంపై దృష్టిపెట్టాలి. ముందు నుంచీ ప్రయత్నం చేస్తున్నవారితో సమానంగా చేరే అవకాశం వీరికి ఉంటుంది.


నైపుణ్యాలు పెంచుకోవాలి

ప్రస్తుత పరిస్థితుల్లో డిఫర్‌మెంట్‌ మంచిదే. దీని వల్ల దొరికిన ఖాళీ సమయంలో తమ విభాగానికి సంబంధించి స్కిల్‌ గ్యాప్‌పై దృష్టి పెట్టాలి. ఉదాహరణకు- మనదేశం నుంచి పైచదువులకు ఎక్కువగా బీటెక్‌ పూర్తయినవారు వెళ్తుంటారు. డిఫర్‌మెంట్‌ కారణంగా అందుబాటులోకి వచ్చిన సమయాన్ని వీరు పైథాన్‌, ఏఐ లాంటి సాంకేతిక నైపుణ్యాలు పెంచుకోడానికి ఉపయోగించుకోవచ్ఛు వీటిని ఇంజినీరింగ్‌ బ్రాంచితో సంబంధం లేకుండా నేర్చుకోవచ్ఛు ఆపై విదేశాలకు వెళ్లిన తర్వాత వీటిని అవసరమైతే కొనసాగించవచ్చు లేదా మెరుగుపరచుకోవచ్ఛు.

- వెంకటేశ్వర రెడ్డి ఉడుముల, విదేశీవిద్య నిపుణులు.

 venkat@wweconline.com


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.