close

తాజా వార్తలు

Updated : 18/05/2020 09:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ - 9 AM

1.  భవిష్యత్తు విమానయానం!

మనిషి జీవన గమనంలో ‘ప్రయాణం’ ఓ నిత్యావసరం. కరోనా మహమ్మారి దెబ్బకు ప్రపంచంలో ప్రయాణం రూపురేఖలే మారిపోతున్నాయి. ముఖ్యంగా విమానయానం భవిష్యత్తులో అనేక మార్పులకు లోనుకావడం తథ్యమని నిపుణులు చెబుతున్నారు. ఇకపై మనం విమానం ఎక్కితే పక్కపక్కనే కూర్చోలేం.. సీటింగ్‌ కొత్తగా ఉంటుంది.. ‘ఐసొలేషన్‌ క్లాస్‌’ అనే కొత్త ప్రయాణ తరగతి పుట్టుకురావచ్చు. ఆరోగ్యాన్ని కాపాడేది భౌతిక దూరమే అన్న ప్రధాన సూత్రానికి అనుగుణంగా భవిష్యత్తులో ప్రయాణాలుంటాయన్నది యథార్థం. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి


2. రాష్ట్రంలో రేపటి నుంచి బస్సులు!

తెలంగాణలో ఆర్టీసీ బస్సులు మళ్లీ రోడ్డెక్కనున్నాయి. మంగళవారం నుంచి ప్రజారవాణా సేవలు ప్రారంభం కానున్నాయి. కేంద్ర తాజా మార్గదర్శకాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం బస్సులను నడిపించాలని నిర్ణయించింది. సోమవారం సాయంత్రం అయిదు గంటలకు ముఖ్యమంత్రి అధ్యక్షతన మంత్రిమండలి సమావేశం జరగనుంది. ఆర్టీసీ బస్సులకు అనుమతివ్వడంతో పాటు లాక్‌డౌన్‌ విషయంలో అనుసరించాల్సిన వ్యూహంపై సమావేశంలో చర్చించనున్నారు. రాష్ట్రంలో సమగ్ర వ్యవసాయ విధానంలో భాగంగా నియంత్రిత పద్ధతిలో పంటల సాగు విధివిధానాలపైనా చర్చించే అవకాశం ఉంది. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి


3. కలిసి సాగాల్సిందే

లండన్‌, బీజింగ్‌: కరోనా కోరల్లో చిక్కుకొని మానవాళి ఉక్కిరిబిక్కిరవుతున్న వేళ ఇటలీ ప్రధానమంత్రి గిసెప్పీ కొంటె, బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ ఆందోళనకర వ్యాఖ్యలు చేశారు. ఈ మహమ్మారిని సమర్థంగా నిలువరించే టీకా సమీప భవిష్యత్తులో రాకపోవచ్చునని పేర్కొన్నారు. వైరస్‌తో కలిసి ముందుకు సాగాల్సిందేనని వ్యాఖ్యానించారు. కొవిడ్‌ సంక్షోభంతో ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలుతున్న నేపథ్యంలో.. లాక్‌డౌన్‌లను ఎత్తివేసి, తిరిగి వ్యాపార కార్యకలాపాలను ప్రారంభించాల్సిన ఆవశ్యకతను వారు నొక్కిచెప్పారు. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

4.  కరోనా గుట్టు తేల్చాల్సిందే

కరోనా మహమ్మారి విజృంభణపై స్వతంత్ర దర్యాప్తు చేపట్టాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) వార్షిక సదస్సులో ఐరోపా సంఘం, ఆస్ట్రేలియా నేతృత్వంలోని 62 దేశాల కూటమి తీసుకొస్తున్న ప్రతిపాదనను భారత్‌ సమర్థించింది. చైనాను దృష్టిలో పెట్టుకొని దీన్ని సిద్ధం చేస్తున్నారు. అయితే అందులో ఎక్కడా ఆ దేశం పేరును ప్రస్తావించలేదు. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

5. కొంటే రూ.17.. తయారుచేస్తే రూ.1.7

కరోనా మహమ్మారి విజృంభణ వేళ స్వాబ్‌ల కొరత రూపంలో ఎదురైన సవాలును భారత్‌ 10 రోజుల వ్యవధిలో అధిగమించింది. ‘భారత్‌లో తయారీ’లో భాగంగా ఉత్పత్తిని ప్రారంభించింది. చైనా నుంచి దిగుమతి చేసుకున్న ఒక్కో స్వాబ్‌ పుల్ల ధర రూ.17 కాగా.. అందులో పదో వంతు రేటుకే ప్రస్తుతం మన దేశంలో అవి అందుబాటులోకి రావడం విశేషం. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి


6. అడవి బిడ్డల అస్తిత్వ పోరు 

కరోనా మహమ్మారి.. లాటిన్‌ అమెరికాలోని ఆటవిక తెగలకు అస్తిత్వ పోరు తెచ్చింది. అబేధ్యమైన అమెజాన్‌ అడవిలో కల్లోలం సృష్టిస్తోంది. వైరస్‌ నుంచి తప్పించుకొనేందుకు వారు బయటి ప్రపంచంతో సంబంధాలు తెంచుకొంటున్నారు. తెగల్లోని వృద్ధులను కాపాడుకోవడం ఇప్పుడు కీలకంగా మారింది. లాటిన్‌ అమెరికాలో అటవీ తెగల జనాభా 4.2 కోట్లు. అక్కడి జనాభాలో ఇది 8 శాతం. ఇప్పటికే చట్టవ్యతిరేకంగా జరుగుతున్న మైనింగ్‌, చమురు వెలికితీత, అడవుల నరికివేత వంటి కార్యకలాపాలతో వారి జీవన విధానానికి ముప్పు పొంచి ఉంది. ఇప్పుడు వైరస్‌ రూపంలో ఉపద్రవం వచ్చింది. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి


7. క్వారంటైన్‌ ‘రాణి’!

క్వారంటైనా.. 15 రోజులు ఒంటరిగా ఉండాలా? అక్కడ సౌకర్యాలు ఎలా ఉంటాయో? ఇది పలువురి ఆవేదన. కానీ ఈమె కథ వింటే ఆ ఆవేదన కొంత తీరే అవకాశం ఉంది. ఎందుకంటే ఆమె ఒకటీ రెండుసార్లు కాదు, ఏకంగా నాలుగుసార్లు క్వారంటైన్‌లో ఉన్నారు మరి! అదీ మూడు నెలల్లో.. రెండు ఖండాల్లో. దీంతో ఆమెను ఆమె స్నేహితులు సరదాగా క్వారంటైన్‌ రాణి అని పిలుస్తున్నారట. ఇదీ అమెరికా జర్నలిస్ట్‌ అమిక్విన్‌ నిజ జీవిత కథ...  పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి


8. ఆదమరిస్తే ఆగమాగమే!

కరోనా ఇళ్లకు ఇళ్లనే చుట్టేస్తోంది. ఆదివారం జీహెచ్‌ఎంసీ పరిధిలో 37 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వైరస్‌ సోకిన వారిలో కొద్దిమందిలోనే అనారోగ్య లక్షణాలు కన్పిస్తుండడం గమనార్హం. జియాగూడలో తాజాగా నమోదైన రెండు కేసులతో కలిపి బాధితుల సంఖ్య 94కు చేరింది. ఒకే ఇంట్లో 16 మందికి ... మంగళ్‌హాట్‌లో ఒకే ఇంట్లో 16 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.  పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి


9. జియో ప్లాట్‌ఫామ్స్‌లోకి రూ.6,589.38 కోట్లు

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌) డిజిటల్‌ విభాగమైన జియో ప్లాట్‌ఫామ్స్‌లోకి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా అంతర్జాతీయ ఈక్విటీ సంస్థ జనరల్‌ అట్లాంటిక్‌ 1.34 శాతం వాటాను రూ.6,598.38 కోట్లతో కొనుగోలు చేసింది. దీంతో జియో ప్లాట్‌ఫామ్స్‌ ఈక్విటీ విలువ రూ.4.91 లక్షల కోట్లు, ఎంటర్‌ప్రైజ్‌ విలువ రూ.5.16 లక్షల కోట్లకు చేరినట్లైంది. జనరల్‌ అట్లాంటిక్‌కు ఆసియాలో ఇదే అతి పెద్ద పెట్టుబడి కావడం గమనార్హం. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి


10.  ఆ కళని ఎప్పుడు బయటపెడతానో!

ఇస్మార్ట్‌ గాళ్‌...నిధి అగర్వాల్‌. కుర్రకారు మతులు పోగొట్టేంత అందం ఆమె సొంతం. హిందీ చిత్రం ‘మున్నామైఖేల్‌’తో వెండితెరకు వచ్చింది. ‘సవ్యసాచి’తో తెలుగులోకి అడుగు పెట్టింది. ‘మిస్టర్‌ మజ్ను’, ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ చిత్రాలతో సందడి చేసింది. త్వరలోనే మరిన్ని చిత్రాలతో అలరిస్తానంటోంది. ప్రస్తుతం బెంగళూరులో గడుపుతున్న నిధిని ‘ఈనాడు సినిమా’ పలకరించింది. ఆమె చెప్పిన విషయాలివీ... పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.