close
Array ( [0] => stdClass Object ( [video_news_id] => 120063629 [video_srlno] => 1 [video_type] => 1 [video_link] => RnmEvZxgyKU [video_short_link] => RnmEvZxgyKU [created_by] => [created_date] => [modified_by] => 9820033 [modified_date] => 2020-05-13 16:38:53.333111 [display_status] => 1 [video_isdeleted] => ) ) 1

తాజా వార్తలు

Published : 13/05/2020 23:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కేటాయింపుల ఆధారంగా అంచనా వేయవచ్చు

ఆర్థికరంగ నిపుణులు అనంత్‌తో ముఖాముఖి.. 

హైదరాబాద్‌ : లాక్‌డౌన్‌ కొనసాగుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం మరోసారి భారీ ఆర్థిక ప్యాకేజీతో ప్రజల ముందుకు వచ్చింది. చిన్న, మధ్యతరహా పరిశ్రమలను ప్రోత్సహించడంతోపాటు ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ రూ. 20 లక్షల కోట్లతో ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించారు. ఈ ప్యాకేజీ ఏఏ రంగాలకు ఎలా ఉపయోగకరంగా ఉండనుంది వంటి విషయాలు తెలుసుకోవడానికి ప్రముఖ ఆర్థిక రంగ నిపుణులు అనంత్‌తో ఈటీవీ ముఖాముఖి.. 

ప్రధాని రూ. 20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు. లాక్‌డౌన్‌ సమయంలో ఇది రెండో ప్యాకేజీ. దీన్ని మనం ఎలా చూడవచ్చు? 

జీడీపీలో 10 శాతం అంటే.. రూ. 20 లక్షల కోట్లు చాలా పెద్ద ప్యాకేజీలా చూడవచ్చు. ఇలాంటి విపత్కర సమయంలో ప్రభుత్వం ఎలాంటి సహకారం అందించినా స్వాగతించాలి. వివిధ రంగాలకు ఆర్థిక మంత్రి ఇచ్చే కేటాయింపుల ద్వారానే ఆర్థికపరంగా ఎలాంటి పరిణామాలు ఉండనున్నాయో అంచనా వేసుకోవచ్చు. ప్రస్తుతం డిమాండ్‌తోపాటు సప్లయి కూడా సమస్యగా మారింది. కరోనా నేపథ్యంలో క్రమంగా సడలింపులు మొదలు పెట్టారు. చరిత్రలో మొదటిసారిగా ఆర్థిక కార్యకలాపాలు సున్నాకు వచ్చాయి. ఇక్కడి నుంచి  మొదలు పెట్టుకొని మెల్లిగా ముందుకు వెళ్తుంటే రెండు, మూడు నెలల వరకు ఎవరి శక్తి ఎంటో చెప్పలేం. ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులున్నా.. లేకున్నా ఎవరికివ్వాలి.. ఏ రూపంలో ఇవ్వాలి అనేదానిపై ఆర్థిక వ్యవస్థ ఎంత త్వరగా రికవరీ అవుతుందో చెప్పవచ్చు. ఏ రికవరీ అయినా వచ్చిన క్యూర్‌పైనే ఆధారపడి ఉంటుంది. వ్యాధి సోకకుండా ఉండడానికి వాక్సిన్‌ ఉపయోగపడుతుంది.. సోకిన వారికి క్యూర్‌ ఉపయోగపడుతుంది. వ్యాక్సిన్‌, క్యూర్‌ రెండూ ఎంత త్వరగా వస్తే ఆర్థిక వ్యవస్థ అంత వేగంగా గాడిలో పడుతుంది. 


ఇప్పుడు ప్రవేశపెట్టిన ప్యాకేజీలో స్వదేశీ యూనిట్లు, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ప్రోత్సాహం ఇచ్చే విధంగా ఉంటుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడున్న పరిస్థితులేంటి.. వాటికి ఎలాంటి ప్రోత్సాహకాలు అవసరం? 

ప్రధాని మాటలను క్షుప్తంగా చెప్పుకోవాలంటే స్టేట్‌మెంట్‌ ఆఫ్‌ ఆబ్జెక్టీవ్స్‌... ఇవన్నీ మేము చేయాలనుకుంటున్నాం.. చేస్తామని చెప్పారు. దీనిలో రకరకాల దశలుంటాయి.. సమస్యను విశ్లేషించుకోవడం, ఏం చేద్దామని అనుకోవడం, ఆబ్జెక్టీవ్స్‌ అనౌన్స్‌ చేయడం, ముఖ్యమైన దశ అమలు చేయడం.. స్టేట్‌మెంట్‌ ఆఫ్‌ ఆబ్జెక్టీవ్స్‌లో స్వదేశీ అన్నారు. మనకు ఉండాల్సిన లక్ష్యాలు అన్నీ ఉండాల్సినవే.. కానీ స్వదేశీ అనేది మనకు కొత్త కాదు.. స్వదేశీ ఉద్యమం వచ్చినప్పటి నుంచీ అందరూ స్వదేశీ అనే చెబుతున్నారు. 1991లో గ్లోబలైజేషన్‌తో కొంత వరకు దాని ప్రభావం తగ్గింది. మళ్లీ ఇప్పుడు దాన్ని ముందుకు తీసుకెళ్లాలని చూస్తున్నారు. కొన్ని అంశాల్లో అది ఎప్పుడూ మంచిది. కానీ అందరూ స్వదేశీ అనుకుంటే అంతపెద్దగా ప్రయోజనం ఉండదు. గ్లోబలైజేషన్‌ విధానంలో ప్రయోజనం పొందిన వాటిలో భారతదేశం కూడా ఒకటి. అవన్నీ పక్కన పెట్టినా స్టేట్‌మెంట్‌ ఆఫ్‌ ఇంటెన్షన్‌ అనేది చాలా బాగుంది. ప్రధాని ప్రత్యేకంగా ల్యాండ్‌, లేబర్‌, లాస్‌ వంటి కొన్ని ప్రత్యేకమైన అంశాల గురించి చెప్పారు. ఐదు ముఖ్యమైన సూత్రాలు పెట్టి వాటి ఆధారంగా ముందుకు వెళ్దామన్నారు. వాటిని జాగ్రత్తగా ప్రణాళిక వేసుకొని ముందుకు వెళ్లే ఆర్థిక పరంగా దీర్ఘకాలం బాగుంటుంది.  

 



Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.