close

తాజా వార్తలు

Published : 08/05/2020 09:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్ - 9 AM

1. కూలీలపై దూసుకెళ్లిన గూడ్స్‌రైలు: 14 మంది మృతి

మహారాష్ట్రలోని ఔరంగబాద్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. కర్మాడ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ట్రాక్‌పై నిద్రిస్తున్న వలస కూలీలపై గూడ్స్‌ రైలు దూసుకెళ్లింది. ఈప్రమాదంలో 14 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో, ఎక్కువ మంది మహిళలు, చిన్నారులు ఉన్నారు. మృతులంతా మధ్యప్రదేశ్‌కు వెళ్తున్న వలస కార్మికులుగా గుర్తించారు. పట్టాలపై నిద్రిస్తున్న వారిని రైలు వేగంగా ఢీకొనడంతో మృతదేహాలు చెల్లాచెదురుగా పడిఉన్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. మళ్లీ భారీగా గ్యాస్‌ లీక్‌!

విశాఖ శివారులోని ఎల్‌జీ పాలిమర్స్‌ సంస్థ నుంచి గురువారం అర్ధరాత్రి మళ్లీ భారీ స్థాయిలో విషవాయువు లీకవుతోంది. పెద్ద ఎత్తున పొగలు బయటకు రావటంతో సమీప ప్రాంతాల్లోని ప్రజలు ప్రాణాలరచేతపట్టుకుని సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లిపోతున్నారు. మరోవైపు పోలీసులు సైతం అందరినీ ఖాళీ  చేయాలని చెబుతూ మొత్తం పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. పూర్త వార్త కోసం క్లిక్‌ చేయండి 

3. ఆక్సిజన్‌ అందకే అపస్మారకంలోకి

విశాఖలో విషాదానికి కారణమైన స్టైరీన్‌ వాయువు ప్రభావం ఆ ప్రాంతంపైనా, ప్రజలపైనా దీర్ఘకాలం పాటు ఉండబోదని విశాఖలోని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోలియం అండ్‌ ఎనర్జీ(ఐఐపీఈ) డైరెక్టర్‌, రసాయనశాస్త్ర ఆచార్యులు వీఎస్‌ఆర్‌కే ప్రసాద్‌ పేర్కొన్నారు. రాబోయే తరాలను అది ఇబ్బంది పెట్టబోదని అభిప్రాయపడ్డారు. గ్యాస్‌ లీకయినప్పుడు దాని ప్రభావానికి ఎక్కువ గురైనవారిలో మాత్రం దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. నేటికీ వెంటాడుతున్న భోపాల్‌ పాపాల్‌

భోపాల్‌ విషవాయువు లీకేజీ దుర్ఘటన ఈ శతాబ్దంలోనే అతిపెద్ద పారిశ్రామిక ప్రమాదం. 1984 డిసెంబర్‌ 2వ తేదీ అర్ధరాత్రి భోపాల్‌ నగరంలో జనం గాఢనిద్రలో ఉండగా.. ఒక్కసారిగా విషవాయువు చుట్టేసింది. ఊపిరాడని ప్రజలు ప్రాణ భయంతో బయటికి పరుగుతీశారు. మృత్యువుతో జరిగిన ఈ పరుగు పందెంలో చాలా మంది ఓడిపోయారు. వీరిలో ఎక్కువ మంది మహిళలు, వృద్ధులు, వికలాంగులు, పిల్లలే. నోటివెంట నురగలు కక్కుతూ ప్రాణాలు కోల్పోయారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

5. రైతన్నకు భరోసా

తెలంగాణ రాష్ట్రంలో రుణమాఫీ అమలుకు రూ.1,200 కోట్లు, రైతుబంధు పథకానికి రూ.7,000 కోట్లు విడుదల చేస్తున్నట్లు ఆర్థిక, వ్యవసాయ శాఖ మంత్రులు హరీశ్‌రావు, నిరంజన్‌రెడ్డి ప్రకటించారు. రూ.25 వేలలోపు రుణాలను ఒకేసారి రద్దు చేస్తున్న నేపథ్యంలో 6.10 లక్షల మంది రైతుల ఖాతాల్లో వెంటనే రుణమాఫీ నిధులను జమచేయాలని ఆదేశించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6. బీటెక్‌ రుసుముల జీవో నిలిపివేత

ప్రైవేటు అన్‌ ఎయిడెడ్‌ వృత్తి విద్యా సంస్థల్లో 2019-20 విద్యా సంవత్సరానికి బీటెక్‌ కోర్సుల రుసుమును ఖరారు చేస్తూ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మార్చి 24న జారీచేసిన జీవో 15ను సోమవారం వరకు సస్పెండ్‌ చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. కౌంటర్లు దాఖలు చేయాలని ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి, సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి, ఏపీహెచ్‌ఈఆర్‌ఎంసీ ఛైర్మన్‌ను ఆదేశించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

7. అక్టోబరు నుంచి ఐఐటీ, ఎన్‌ఐటీ తరగతులు!

వచ్చే విద్యా సంవత్సరం ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీల్లో తరగతులు ఆలస్యంగా ప్రారంభం కానున్నాయి. ప్రతిఏటా జులై నెలాఖరులో తరగతులు మొదలవుతాయి. వచ్చే ఏడాది మాత్రం రెండు నెలలు ఆలస్యంగా విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. ఆగస్టు 23న అడ్వాన్స్‌డ్‌ పరీక్ష నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. సత్వరంగా ఫలితాలు వెల్లడించినా కనీసం 10 రోజుల సమయం పడుతుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

8. 23 సింహాల మృత్యువాత

ఆసియా సింహాలకు పుట్టినిల్లు అయిన గుజరాత్‌లోని గిర్‌ అడవుల్లో మృత్యువు వికటాట్టహాసం చేస్తోంది. గత మూడు నెలల్లో 23 సింహాలు ఇక్కడ మృత్యువాత పడ్డాయి. ప్రొటోజొవా పారాసైట్‌ కారణంగా వచ్చే బబేసియా మృగరాజులను కబళిస్తోందని జునాగఢ్‌కు చెందిన ప్రధాన అటవీ సంరక్షణాధికారి డీటీ వాసుదేవ తెలిపారు.

9. ఓటీటీ కంటెంట్‌కు మించి ఇవ్వాల్సిందే: రాజమౌళి

‘‘కరోనా - లాక్‌డౌన్‌ తర్వాత సినిమా పరిశ్రమలో మార్పులు ఉంటాయనిపిస్తోంది. సినిమాను నదితో పోలిస్తే... ప్రస్తుతం సినిమా దారి మార్చుకుంది. దానికి తగ్గట్టే దర్శకులు కూడా కథల విషయంలో మార్పు చూపించాలి’’ అని ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి అన్నారు.  కరోనా ప్రభావం సినిమాపై ఎలా ఉండబోతుందనే అంశంపై ఓ వెబినార్‌లో తెలుగు పరిశ్రమ నుంచి ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి, ప్రముఖ నిర్మాత డి.సురేశ్‌ బాబు, యువ దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ పాల్గొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. హెచ్‌యూఎల్‌ నుంచి జీఎస్‌కే బయటకు

భారత ఎఫ్‌ఎమ్‌సీజీ దిగ్గజం హిందుస్థాన్‌ యునిలీవర్‌ (హెచ్‌యూఎల్‌) నుంచి గ్లాక్సోస్మిత్‌క్లైన్‌ పీఎల్‌సీ(జీఎస్‌కే) వైదొలగింది. ఆ కంపెనీలో ఉన్న 5.7 శాతం వాటాను రూ.25,480 కోట్లకు విక్రయించింది. హెచ్‌యూఎల్‌లో జీఎస్‌కే అనుబంధ సంస్థ గ్లాక్సోస్మిత్‌క్లైన్‌ కన్జూమర్‌ హెల్త్‌కేర్‌(జీఎస్‌కే ఇండియా)ను విలీనం చేసిన సమయంలో కంపెనీకి ఆ షేర్లు లభించాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.