close
Array ( [0] => stdClass Object ( [video_news_id] => 120061294 [video_srlno] => 1 [video_type] => 1 [video_link] => H20fm3HJZ6s [video_short_link] => H20fm3HJZ6s [created_by] => [created_date] => [modified_by] => 8925861 [modified_date] => 2020-05-07 22:10:01.874484 [display_status] => 1 [video_isdeleted] => ) ) 1

తాజా వార్తలు

Published : 08/05/2020 02:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పేలుడు సంభవించి ఉంటే పరిస్థితి తీవ్రం!

ముఖాముఖిలో ఐఐపీఈ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ ప్రసాద్‌.. 

విశాఖ: రేపటి సూర్యోదయం ఇలా ఉంటుందని ఊహించని ఆ ప్రజలు నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నారు. తెల్ల తెల్లవారుతుండగా శ్వాస తీసుకోవడంలో ఎందుకో ఇబ్బంది. ముక్కు, కళ్లలో తెలియని మంటలు. పొద్దున్నే హుషారుగా పరుగులు పెట్టే చిన్నారులు పిట్టల్లా ఎక్కడికక్కడే రాలిపోవడం. ఏమవుతోందో అర్థంకాని పరిస్థితి. అప్పటికే విషవాయువు శరీరంలోకి వెళ్లడంతో కనీసం బయటకు వెళ్లి చూడలేని దుస్థితి. విశాఖలోని ఆర్‌.ఆర్‌ వెంకటాపురం ప్రజలకు గురువారం ఉదయం ఇలా ప్రారంభమైంది. ఎల్‌జీ పాలీమర్స్‌లో గ్యాస్‌ లీకేజీ కారణంగా పరిసర ప్రాంతాల్లోని ప్రజలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వాయువు గాఢత తీవ్రంగా ఉండటంతో ఆ ప్రాంతమంతా ప్రాణ వాయువు కోసం అల్లాడింది. అసలు ఈ ప్రమాదం ఎలా జరిగి ఉంటుంది..? దాని ప్రభావం అక్కడి ప్రజలపై ఎలా ఉండనుంది..? అనే అంశాలపై ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోలియం అండ్‌ ఎనర్జీ (ఐఐపీఈ) డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ ప్రసాద్‌తో ముఖాముఖి...

విశాఖ గ్యాస్‌ దుర్ఘటన ఎలా జరిగి ఉంటుందని మీరు అనుకుంటున్నారు..? పర్యవసనాలు ఎలా ఉండనున్నాయి..?
కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్‌ కారణంగా 40 రోజులుగా పరిశ్రమ మూసి ఉంది. నిబంధనల సడలింపుతో తిరిగి పనులు ప్రారంభించాలని యాజమాన్యం భావించి ఉంటుంది. 40 రోజులుగా నిలిచి ఉన్న స్టైరీన్‌తో పాలిమర్‌ తయారు చేసేటప్పుడు ఎక్కువ మోతాదులో ఉష్టోగ్రత విడుదల చేస్తుంది. దానివల్ల ఒత్తిడి పెరిగి లీకేజీలు ఏర్పడతాయి. వెంటనే గమనించి లీకేజీలను అరికట్టాలి. సాధారణ రోజుల్లో ఇలాంటి ఘటనలు చాలా తక్కువగా జరుగుతాయి. ఎందుకంటే రోజు వారీ కార్యకలాపాల్లో భాగంగా కొన్నిసార్లు గ్యాస్‌ లీకైనా ప్రత్యేక విభాగం వెంటనే స్పందించి చర్యలు చేపడుతుంది. అందుకే ఇలాంటి ప్రమాదాలు తక్కువగా జరుగుతాయి. లాక్‌డౌన్‌ తర్వాత పరిశ్రమను తిరిగి ప్రారంభించే ముందు అన్ని విభాగాలను పరిశీలిస్తూ రావాల్సింది. దీనివల్ల గ్యాస్‌ లీకేజీ లేకుండా అరికట్టే అవకాశం ఉండేది. ఈ విషయంపై శ్రద్ధ వహించడంలో పరిశ్రమ యాజమాన్యం, సిబ్బంది పూర్తిగా విఫలమయ్యారు. ప్రమాదం వేకువజామున జరగడం వల్ల ప్రజలు నిద్రలో ఉండి అలాగే అపస్మారక స్థితిలోకి వెళ్లారు.  పేలుడు సంభవించి ఉంటే పరిస్థితి మరింత దారుణంగా ఉండేది. 

జనావాసాల మధ్య ఇలాంటి పరిశ్రమలు ఉండటం ఎంతవరకు సమంజసం..? దీనిపై మీ అభిప్రాయం..?
40, 50 సంవత్సరాల వెనక్కి వెళితే.. మొదట ఈ పరిశ్రమ హిందూస్థాన్‌ పాలీమర్స్‌ అనే పేరుతో ప్రారంభమైంది. ఇప్పడు ఎల్‌జీ పాలీమర్‌గా మార్చారు. హిందూస్థాన్‌ పాలీమర్స్‌గా ఉన్నప్పుడు దాని చుట్టుపక్కల ఎలాంటి జనావాసాలు లేవు. ఇదొక్కటే కాదు ఇప్పుడున్న చాలా ప్రాంతాల్లో పరిశ్రమల పరిసరాల్లో నివాసాలు లేవు. నెమ్మదిగా జనావాసాలు పరిశ్రమలకు దగ్గరగా వచ్చాయి. అసలు అలాంటి ప్రాంతాల్లో ఇళ్లు నిర్మించుకునేందుకు అనుమతులు ఇవ్వకూడదు. ఒకవేళ ఇచ్చినా వారికి కావాల్సిన సౌకర్యాలు కల్పించే బాధ్యత తీసుకోవాలి. ఇప్పటికిప్పుడు పరిశ్రమలు తరలించినా కూడా మరికొన్ని సంవత్సరాల తర్వాత ఇదే మాదిరి అక్కడ జనావాసాలు వెలుస్తాయి. అప్పుడు కూడా ఇలాంటి ఇబ్బందులు తప్పవు. మరిన్ని వివరాలు కింది వీడియోలో..



Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.