close

తాజా వార్తలు

Published : 05/05/2020 11:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

వైకాపా నేత హడావుడిపై ఎస్పీ ఆగ్రహం

గుంటూరు: గుంటూరు నగరంలోని నల్లపాడు పోలీస్‌స్టేషన్‌లో వైకాపా నేత హడావుడిపై అర్బన్‌ జిల్లా ఎస్పీ రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై డీఎస్పీ కమలాకర్‌ను పోలీస్‌స్టేషన్‌కు పంపించి విచారణ జరిపించారు. ఆయన ఇచ్చిన నివేదిక మేరకు ఓ కానిస్టేబుల్‌ను సస్పెండ్‌ చేశారు. ఘటన జరిగిన విషయం తన దృష్టికి తీసుకురాకపోవటంపై నల్లపాడు సీఐకి ఛార్జిమెమో ఇచ్చారు.  గత కొద్ది రోజులుగా స్టేషన్లో సదు వ్యక్తి చేస్తున్న పైరవీలపైనా విచారణ జరిపించారు. అతనితో చనువుగా ఉండటంతో పాటు డబ్బులు తీసుకున్నట్టు తేలడంతో  ఓ కానిస్టేబుల్‌ను వీఆర్‌కు పంపారు. స్టేషన్లో హడావుడి చేసిన వ్యక్తిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చారు. కోర్టు ఆదేశాల మేరకు అతన్ని రిమాండ్‌కు పంపించారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.