close

తాజా వార్తలు

Updated : 03/05/2020 16:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కల్నల్‌, మేజర్‌ సహా ఐదుగురి వీరమరణం

శ్రీనగర్‌: ఉగ్రవాదులతో జరిగిన భీకర పోరులో ఐదుగురు సైనికులు వీరమరణం పొందారు. వీరిలో ఓ మేజర్‌, కల్నల్‌ స్థాయి సైనికాధికారులు కూడా ఉన్నారు. నార్త్‌ కశ్మీర్‌లోని హంద్వారా ప్రాంతంలో శనివారం భద్రతా బలగాలు, ముష్కరులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఓ ఇంట్లో ముష్కరులు బందీలుగా చేసుకున్న కొంత మంది పౌరులను రక్షించేందుకు చేపట్టిన ఆపరేషన్‌లో భాగంగా సైనికులు ఆ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. భద్రతా దళాల కదలికల్ని పసిగట్టిన ముష్కరులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఆర్మీ బృందానికి నాయకత్వం వహిస్తున్న కల్నల్‌ అశుతోష్‌ శర్మ, ఓ మేజర్‌ అమరులయ్యారు. అశుతోష్‌ శర్మ 21 రాష్ట్రీయ రైఫిల్స్‌కు కమాండింగ్‌ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. వీరితోపాటు ఓ ఎస్సై, ఇద్దరు సైనికులు కూడా వీరమరణం పొందారు. ఎట్టకేలకు పౌరుల్ని మాత్రం సురక్షితంగా కాపాడి బయటకు తీసుకొచ్చారు. ఓవైపు ప్రపంచమంతా కరోనా మహమ్మారితో తిరుగులేని పోరాటం చేస్తుంటే పాక్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాదుల ఆగడాలు మాత్రం ఆగడం లేదు.



Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
    ఎక్కువ మంది చదివినవి (Most Read)
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.