close
Array ( [0] => stdClass Object ( [video_news_id] => 120058497 [video_srlno] => 1 [video_type] => 1 [video_link] => z6QvcLFWfiM [video_short_link] => z6QvcLFWfiM [created_by] => [created_date] => [modified_by] => 8923881 [modified_date] => 2020-05-10 08:35:33.356429 [display_status] => 1 [video_isdeleted] => ) ) 1

తాజా వార్తలు

Updated : 10/05/2020 08:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

‘వర్క్‌ఫ్రం హోం’తో థియేటర్లకు మంచి రోజులు

ముఖాముఖిలో ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేశ్‌బాబు

తెలుగు చిత్రసీమలో సురేశ్‌ ప్రొడక్షన్స్‌ది సుదీర్ఘ ప్రస్థానం.. నలభై ఎనిమిదేళ్ల అలుపులేని విజయ యాత్ర.. 130కిపైగా చిత్రాలు నిర్మించడం సినీ చరిత్రలో ఓ రికార్డు. దగ్గుబాటి వారికి సినిమాలే వ్యాపకం.. అదే వారి వ్యాపారం. తండ్రి రామానాయుడు నుంచి సినిమా నిర్మాణ అనుభవం, వ్యాపార సూత్రాలు అందిపుచ్చుకున్నారు ఆయన తనయుడు సురేశ్‌బాబు. తండ్రి తర్వాత అదే సినీ పరిశ్రమలో విజయవంతమైన నిర్మాతగా రాణిస్తున్నారు. ఈ మధ్య కాలంలో భారీ చిత్రాలు లేకుండా కొత్త నటీనటులు, తక్కువ బడ్జెట్‌లో అద్భుతమైన చిత్రాలతో ప్రేక్షకులకు నూతన తరాన్ని, కథల్ని పరిచయం చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో కరోనా సినీ పరిశ్రమను పెద్ద దెబ్బే తీసింది. అయితే సినిమా రంగం తిరిగి ఎలా కోలుకుంటుంది..? ఎలాంటి మార్గాలున్నాయి..? తదితర అంశాలపై సురేశ్‌ ప్రొడక్షన్స్‌ అధినేత సురేశ్‌బాబుతో ముఖాముఖి..

ప్రస్తుతం షూటింగ్స్‌ నిలిచిపోయాయి. ఎప్పుడూ లేనంతగా ఖాళీ సమయం దొరికింది. రోజువారీ జీవితం ఎలా సాగుతోంది..?

సాధారణంగా రిటైర్‌మెంట్‌ తర్వాత ఇంట్లో చేయాల్సిన పనులను ఇప్పుడే చేసేస్తున్నాం. కొన్ని సంవత్సరాల ముందు రిటైర్ అవుదామనుకున్నా.. కానీ కాలేదు. ఇప్పుడు ఖాళీ సమయం దొరకడంతో కుటుంబంతో సరదాగా గడుపుతున్నా. అయితే కరోనా వల్ల సమాజానికి, సినీ పరిశ్రమకు జరుగుతున్న నష్టాన్ని చూస్తే బాధేస్తుంది. అంతలోనే కుదుటపడేందుకు ఏదో మార్గం ఉంటుందనే భావనలోకి వస్తా. ఇక రోజు వారీ కార్యక్రమాలకు వస్తే యోగా చేయడం, పుస్తకాలు చదవడం, మిత్రులతో ఫోన్‌ మాట్లాడం, కుటుంబ సభ్యులతో సరదాగా ముచ్చట్లు.. ఇలా గడిచిపోతోంది. 

లాక్‌డౌన్‌ అనంతరం కూడా సినీ పరిశ్రమ అంతగా కోలుకోకపోవచ్చని పలువురు అంటున్నారు. ఏయే విభాగాల మీద ప్రభావం ఉంటుందని మీ అభిప్రాయం..? 

రానున్న రోజుల్లో కరోనా వ్యాప్తి ఎలా ఉంటుందో చెప్పలేం. ప్రస్తుతం అంతటా లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. విడతల వారీగా లాక్‌డౌన్‌ ఎత్తివేస్తే థియేటర్లు తెరుచుకోవు. చిన్న సినిమా షూటింగ్‌లు జరగొచ్చు. అయితే వారు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యక్తిగత దూరం విధిగా పాటించాలి. పోస్ట్‌ప్రొడక్షన్‌ పనులు కొంత సులువుగానే జరుగుతాయి. ఎక్కువ మంది ఆర్టిస్టులు అవసరమయ్యే సినిమాలు, భారీ ప్రాజెక్టుల పనులు మాత్రం ఇప్పట్లో కష్టం. పూర్తిస్థాయిలో వైరస్‌కు వ్యాక్సీన్‌ వచ్చే వరకు ఇబ్బందులు తప్పవనే చెప్పాలి. సినీ పరిశ్రమలో కొన్ని చెడు అలవాట్లున్నాయి. ఇకనైనా వాటిని వదిలేయాలి. కరోనా అనంతరం కూడా క్రమశిక్షణ, జాగ్రత్తలు తప్పక పాటించాలని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. మన జీవితంలో ఇదో కొత్త అనుభవం. దీని ద్వారా అందరూ కొత్తగా, విభిన్నంగా ఆలోచిస్తారు. చాలా సంస్థలు వర్క్‌ఫ్రం హోం ఇచ్చేస్తామంటున్నాయి. దీని ద్వారా సినీ పరిశ్రమకు కొంతమేర మేలు జరిగే అవకాశముంది. ఎందుకంటే ఉదయం నుంచి ఇంట్లో పనిచేసిన వారు సాయంత్రం కాగానే రెస్టారెంట్లు, థియేటర్లు, పార్కులకు వెళ్లేందుకు ఎక్కువగా బయటకు వస్తారు. 

కరోనాతో దిగ్గజ సంస్థలు సైతం పొదుపు చర్యలు చేపట్టాయి. ఇలాంటి నేపథ్యంలో హీరోలు, హీరోయిన్లు, ఇతర నటులు, దర్శకులు, ఆర్టిస్టుల పారితోషికాలపై ఏ మేర ప్రభావం పడనుంది..? 

ఏ వ్యాపారంలోనైనా పెద్దగా లాభాలు లేకపోతే ఆ ప్రభావం అందరి మీద పడుతుంది. తిరిగి పుంజుకోవాలంటే ఉద్యోగి అయినా.. హీరో అయినా.. ఆర్టిస్టైనా.. కొంత మేర తగ్గించుకోక తప్పదు. ఇప్పటికే మనం చాలా విపత్తులు ఎదుర్కొన్నాం. కాకపోతే కరోనా ప్రభావం ప్రపంచం మొత్తం ఉండటంతో ఇబ్బందులు తప్పడం లేదు. నిజానికి ప్రభుత్వాలు వైరస్‌ కట్టడికి చాలా కృషి చేశాయి.. చేస్తున్నాయి. ప్రతి ఒక్కరూ జాగ్రత్తలతో కూడిన అడుగులేస్తూ ముందుకు సాగాలి. లేదంటే ప్రపంచమే నిలబడి పోయే ప్రమాదం ఉంది. ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిన పెట్టుకోగలగాలి. సినిమా పరిశ్రమ వరకైతే కొన్ని డబ్బింగ్‌ సినిమాలున్నాయి. ముందుగా వాటిని పూర్తి చేసుకుంటే కొంత డబ్బు సంపాదించుకోవచ్చు.  

‘వెంకిమామ’తో విజయం అందుకున్నారు. వెంకటేశ్‌, రానా, నాగచైతన్యతో సినిమా కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. వారికి ఏం చెబుతారు..? 

కథ బాగుంటే ఎప్పుడైనా చేయొచ్చు. ఎవరైనా మంచి కథతో ముందుకొస్తే లాక్‌డౌన్‌ పూర్తి కాగానే మొదలు పెడతాం (నవ్వుతూ). 

కరోనా కట్టడి దిశగా ప్రజలకు మీరిచ్చే సూచనలేమైనా ఉన్నాయా..?

లాక్‌డౌన్‌ అమలులో ఉన్నంత వరకు దేని గురించి ఆలోచించకుండా ప్రతి ఒక్కరూ ఇళ్లకే పరిమితమైపోవడం మంచిది. లాక్‌డౌన్‌ ముగిశాక కూడా తగు జాగ్రత్తలు పాటిస్తూ పనులు చేసుకోవాలి. అందులో ఏ మాత్రం అలసత్వం వహించొద్దు. కొంతమంది ‘నాకేం భయం లేదు.. నాకు ఏ వైరస్‌ సోకదు’ అనే ధోరణితో ప్రవర్తిస్తారు. ఈ వైరస్‌ బారిన పడితే మనతో పాటు కుటుంబం, మనతో సంబంధాలున్న వారంతా బాధపడాల్పి ఉంటుంది. అందుకు అందరూ సామాజిక బాధ్యతతో నడుచుకోవడం మంచింది. 

మరిన్ని వివరాలు కింది వీడియోలో చూడండి.

 

 



Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.