close
Array ( [0] => stdClass Object ( [video_news_id] => 120057543 [video_srlno] => 1 [video_type] => 1 [video_link] => HCrlj2DCGck [video_short_link] => HCrlj2DCGck [created_by] => [created_date] => [modified_by] => 9820033 [modified_date] => 2020-04-29 19:58:28.884994 [display_status] => 1 [video_isdeleted] => ) ) 1

తాజా వార్తలు

Published : 30/04/2020 01:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కుటుంబం ప్రోత్సహిస్తే మద్యపానం దూరం 

ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయం సూపరింటెండెంట్‌తో ముఖాముఖి 

హైదరాబాద్‌ : లాక్‌డౌన్‌ సందర్భంగా ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు.. ఇంటి నుంచి బయటకు వెళ్లలేని పరిస్థితి.. దీంతో దాదాపు నెల రోజులపాటు వారికి ఇల్లే ప్రపంచమైంది. ఈ నేపథ్యంలో ప్రజలు ఎలాంటి మానసిక వ్యాధులకు గరవుతున్నారు.. వారి ప్రవర్తనలో ఎలాంటి మార్పులు ఉంటాయి.. మద్యానికి బానిసైన వారు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు.. లాక్‌డౌన్‌ అనంతరం వారి పరిస్థితి ఎలా ఉంటుంది.. వివిధ అంశాలపై ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయం సూపరింటెండెంట్‌ వైద్యులు ఉమాశంకర్‌తో ‘ఈటీవీ’ ముఖాముఖి.. 

లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఆసుపత్రికి వచ్చే రోగుల సంఖ్య పెరిగిందా..? మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నట్లు ఎవరైనా ఫోన్‌ చేస్తున్నారా..? 

లాక్‌డౌన్‌ ప్రకటించిన మూడు, నాలుగు రోజుల తరువాత మద్యానికి బానిసైన వారు ఎక్కువగా వచ్చారు. పది రోజుల వరకు రోజూ ఇద్దరు, ముగ్గురి చొప్పున దాదాపు 200 మంది వరకు వచ్చారు. అవసరమైన వారిని ఆసుపత్రిలో చేర్చుకొని వైద్యం అందించాం.. కొందరికి కౌన్సెలింగ్‌ ఇచ్చి పంపించాం. రవాణా సౌకర్యం లేకపోవడంతో సాధారణ రోగుల సంఖ్య తగ్గింది. వారు హైదరాబాద్‌కు రాలేకపోయారు. జిల్లా ఆసుపత్రుల్లో విభాగాలున్నాయి. ఆయా జిల్లాల వారిని అక్కడే వైద్యం చేసుకోవాలని కోరాం. 

మద్యపానం అనేది చెడు వ్యసనం. దాన్ని మానేయాల్సిన అవసరం ఉంది. కానీ హఠాత్తుగా ఒకేసారి మానేయడంతో వారి ప్రవర్తనలో ఎలాంటి విపరీత మార్పులుంటాయి.?

ఆల్కహాల్‌ను అప్పుడప్పుడు తీసుకునే వారికి ఎలాంటి ఇబ్బందులుండవు. కానీ ఎక్కువగా తీసుకునే వారిలో కొన్ని సమస్యలు ఉత్పన్నమవుతాయి. కొందరు వాటిని తట్టుకొని ఉండగలరు.. కానీ కొంతమంది తీవ్ర ఇబ్బందులు పడతారు. ఫిట్స్‌ తదితర రోగాలు రావడం జరుగుతోంది. ఇలాంటి వారు తప్పని సరిగా వైద్యులను ఆశ్రయించాలి. 

మద్యానికి బానిసైన వారిని లాక్‌డౌన్‌ అనంతరం పూర్తిగా మన్పించాలంటే ఏం చేయాలి.. వారికి కుటుంబం నుంచి ఎలాంటి ప్రోత్సాహం అవసరం? 

లాక్‌డౌన్‌ అనంతరం వారిని మద్యానికి దూరం చేయడానికి మంచి అవకాశం. దీనికి కుటుంబ సభ్యుల ప్రోత్సాహం చాలా అవసరం. వారిని తాగుబోతులాగా చూడకుండా తాగడం మానేయడంతో వచ్చే సమస్యలను వారు అర్థం చేసుకోవాలి. తగిన వైద్యం అందించాలి.. కౌన్సెలింగ్‌ ఇప్పించాలి.. ఇక్కడి ఆసుపత్రిలోనూ కౌన్సెలింగ్‌ ఇచ్చే సౌకర్యం కల్పిస్తున్నాం.. 

 

 



Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.