close

తాజా వార్తలు

Updated : 29/04/2020 18:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మత్స్యకారులకు ₹2 వేలివ్వండి: జగన్‌

కరోనా నివారణ, ప్రభావిత రంగాలపై సీఎం సమీక్ష

అమరావతి: రాష్ట్రంలో గాలి వాన వల్ల దెబ్బతిన్న పంటల గుర్తించడం సహా నష్టపోయిన రైతులను వెంటనే  ఆదుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. లాక్‌డౌన్‌ దృష్ట్యా రైతులు పండిచిన ధాన్యం సహా ఉత్పత్తులకు మంచి ధర వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. కరోనా కట్టడికి మరింత పటిష్ఠంగా లాక్‌డౌన్‌ అమలుచేయాలని, రెడ్‌జోన్లలో ఆర్టీసీ బస్సుల ద్వారా కూరగాయలు ఇంటివద్దకే పంపిణీ చేయాలని ఆదేశించారు. ఈ మేరకు కరోనా నివారణా చర్యలు, ప్రభావిత రంగాల్లో పరిస్థితులపై సీఎం జగన్‌ సమీక్షించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన భేటీలో మంత్రి ఆళ్లనాని, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగ్‌, వైద్యారోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.

గుజరాత్‌ నుంచి తెలుగు మత్స్యకారులను స్వస్థలాలకు తరలించే ప్రక్రియపై సీఎం ఆరా తీశారు. 4,065 మంది బయల్దేరాని, వారందరికీ రవాణా, భోజనం సహా దారి ఖర్చులన్నీ రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని అధికారులు తెలిపారు. వచ్చిన మత్స్యకారులందరికీ ₹2 వేల చొప్పున ఇవ్వాలని సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో నమోదైన కేసులు, తీసుకుంటున్న చర్యలపై సీఎం సమీక్షించారు. గడిచిన 24 గంటల్లో 73 కేసులు నమోదయ్యాయని, గుంటూరు జిల్లాలో 29 కేసులు నమోదవ్వగా.. ఒక్క నరసారావుపేట నుంచే 27 కేసులు వచ్చాయని అధికారులు తెలిపారు. అక్కడ పెద్దఎత్తున కంటైన్‌మెంట్‌ చర్యలు తీసుకుంటున్నామన్నారు. 24 గంటల్లో 7,727 పరీక్షలు చేశామని వీటిలో  70 శాతం పరీక్షలు రెడ్‌జోన్లలోనే చేశామని సీఎంకు అధికారులు వివరించారు. మొత్తంగా 88,061 పరీక్షలు చేశామని వివరించారు. శ్రీకాకుళం రిమ్స్‌లో ఏర్పాటు చేసిన ల్యాబ్‌లో ట్రయల్‌ టెస్టులు ప్రారంభం అయ్యాయని ఒంగోలు, నెల్లూరులో ల్యాబ్‌ ఏర్పాటునకు ముమ్మరంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. శనివారం నాటికి ఈ మూడు కొత్త ల్యాబ్‌లు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తాయని తెలిపారు. టెలీమెడిసిన్‌ పరీక్షపై సీఎం నిశితంగా సమీక్షించారు. టెలీమెడిసిన్‌కు కాల్‌చేసిన వారికి అదేరోజు మందులు అందించే ప్రయత్నాలు చేస్తున్నామని అధికారులు తెలిపారు. జిల్లాకు ఏర్పాటు చేస్తున్న ముగ్గురు జేసీల్లో ఒకరికి టెలీ మెడిసిన్ వ్యవస్థను పర్యవేక్షించే బాధ్యతలు అప్పగించాలని సీఎం ఆదేశించారు. కుటుంబ సర్వేలో గుర్తించిన వారిలో ఇప్పటి వరకూ 12,247 పరీక్షలు చేశామన్న అధికారులు, మిగిలిన వారికి 3 రోజుల్లో పూర్తి చేస్తామన్నారు.

వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలుపై సమీక్షించారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది రైతుల వద్ద నుంచి అన్ని పంటలను ఎక్కువే కొనుగోలు చేశామని సీఎం అన్నారు. గతంలో ఎప్పుడూ లేనిరీతిలో మొక్కజొన్నను  సేకరిస్తున్నామన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల కారణంగా మార్కెట్లో ధరల స్థిరీకరణ నెలకొంటోందని అధికారులు తెలిపారు. ఈ క్రాపింగ్, ఫాంగేట్, టోకెన్ల పద్ధతి ద్వారా కొనుగోలు చేస్తున్నట్లు చెప్పారు. అరటి, టమాటా ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల ఏర్పాట్లపై దృష్టిపెట్టాలని, చీనీ పంటకు ధర వచ్చేలా చూడాలని సీఎం ఆదేశించారు. గాలివాన కారణంగా పంటలు దెబ్బతిన్న ప్రాంతాల్లో వెంటనే సర్వే చేసి రైతులను ఆదుకోవాలని సీఎం ఆదేశించారు.

ఇవీ చదవండి..

వారిపై సానుభూతి చూపించండి: పవన్‌


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.