close

తాజా వార్తలు

Published : 27/04/2020 09:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ - 9 AM

1. లాక్‌డౌన్‌ తరువాత ఎలా?

లాక్‌డౌన్‌ తరువాత ఎలా వ్యవహరించాలి? ఇదే ప్రభుత్వం ముందున్న పెద్ద సవాలు. మే నాలుగు నుంచి ఏమి చేయాలనేదానిపై కేంద్రం ఇప్పటికే స్థూలంగా ప్రణాళికను రూపొందించినట్లు తెలుస్తోంది. కరోనా విస్తరణను అదుపు చేయడం-ఆర్థిక రంగాన్ని పునరుద్ధరించడం మధ్య సమతౌల్యాన్ని పాటిస్తూ ‘‘కనిష్ఠ చలనం... గరిష్ఠ పని’’ అన్న నినాదంతో ప్రభుత్వం ముందుకెళ్లనుంది. సోమవారం ఉదయం ముఖ్యమంత్రులతో జరపనున్న వీడియో సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ ప్రణాళిక గురించి చర్చించే అవకాశం ఉంది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. కిమ్‌ ‘సజీవం’గా ఉన్నారు

ఉత్తర కొరియా నాయకుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ ఆచూకీ, ఆయన ఆరోగ్యంపై అయోమయం కొనసాగుతోంది. ఆయన తాజా పరిస్థితిపై అనేక ఊహాగానాలు, వార్తలు వస్తున్నాయి. కిమ్‌ చనిపోయి ఉండొచ్చని.. ఆయనకు కరోనా వైరస్‌ సోకి ఉండొచ్చని లేదా ఆ మహమ్మారి బారిన పకుండా ఉండేందుకు విడిగా ఉంటున్నారని.. తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని.. ఇలా రకరకాల వార్తలు వచ్చాయి. పొరుగునున్న దక్షిణ కొరియా మరోసారి వీటిని తోసిపుచ్చింది. ఆయన ‘సజీవంగా, క్షేమంగా’ ఉన్నారని పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. కరోనా రహిత వుహాన్‌

కరోనా పుట్టుకకు కేంద్రమైన చైనాలోని వుహాన్‌ నగరం తాజాగా కీలక మైలురాయిని చేరుకుంది. అక్కడి ఆస్పత్రుల్లో కొవిడ్‌ బాధితుల సంఖ్య తొలిసారి సున్నాకు చేరుకుంది. చికిత్స పొందుతున్న చివరి వ్యక్తి శుక్రవారం కోలుకొని ఇంటికి చేరుకున్నట్లు జాతీయ ఆరోగ్య కమిషన్‌(ఎన్‌హెచ్‌సీ) అధికార ప్రతినిధి మి ఫెంగ్‌ తెలిపారు. హుబెయ్‌ ప్రావిన్సు రాజధాని వుహాన్‌. హుబెయ్‌లో మొత్తంగా ఇప్పటివరకు 68,128 కేసులు నమోదయ్యాయి. అందులో 50,333 ఒక్క వుహాన్‌లోనివే. నగరంలో 76 రోజులపాటు కొనసాగిన లాక్‌డౌన్‌ను ఈ నెల 8న ఎత్తివేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. కరోనాపై రణం మందగిస్తుందా?

కొవిడ్‌-19కు వ్యాక్సిన్లు జన సామాన్యంలోకి రావడానికి ఇంకా చాన్నాళ్లు పడుతుంది. ఈ ప్రక్రియలో మరింత ఆలస్యం జరిగితే ఏంటి పరిస్థితి? అప్పటివరకు వైరస్‌ వ్యాప్తిని ఆపే మార్గమే లేదా? ..ఈ ప్రశ్నలకు కొందరు చెబుతున్న సమాధానం ‘మందగా రోగ నిరోధక శక్తి పెంపొందించడం’ (హెర్డ్‌ ఇమ్యూనిటీ). సహజ రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉండే యువత, మధ్య వయస్కులకు వైరస్‌ సోకేలా చేసి వారి ద్వారా హెర్డ్‌ ఇమ్యూనిటీ లక్ష్యాన్ని సాధించాలనేది వారి వాదన. అయితే ఇది ప్రమాదకర పోకడ అని, ప్రస్తుతం ఇది సాధ్యం కాదని నిపుణులు చెబుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

ప్లాస్మా ప్రాణాధారమే.. అపోహలొద్దు  | *  చౌకగా వ్యాక్సిన్‌ తెచ్చేలా పరిశోధనలు

5. బిందువు నుంచి సింధువుగా!

తెలంగాణ ప్రజలు తమను తాము పరిపాలించుకోవాలనే ఆకాంక్షకు రాజకీయ వ్యక్తీకరణగా తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించింది. ఇరవై ఏళ్ల ప్రస్థానంలో చరిత్ర గతినే మార్చి వేసి, చిరకీర్తిని సంపాదించుకుంది. ఆంధ్ర వలసవాదం సుడిగాలిలో తెలంగాణ అస్తిత్వస్పృహ ఆరిపోకుండా ఉండటానికి ఎందరో కృషి చేశారు. 1969 ఉద్యమం అణగారిపోయిన తరవాత ఎప్పటికైనా తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించగల మరో నాయకుడు ఉద్భవించగలడా అని ఆశగా ఎదురు చూశారు. వారి నమ్మకం వమ్ము కాలేదు. గులాబీ జెండాను చేత పూనిన ఒక ధీరోదాత్తుడు ఆవిర్భవించి తెలంగాణను విముక్తం చేశాడు. రెండు దశాబ్దాలుగా తెలంగాణ జనం కలలోను, మెలకువలోను జపిస్తున్న మూడక్షరాల పేరు- కేసీఆర్‌! పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ధూళి కణాలూ కరోనా నిలయాలు!

కరోనా వైరస్‌కు, కాలుష్య కారకాలకు మధ్య బంధం ఏర్పడిందా?... వాయు కాలుష్యం తీవ్రంగా ఉన్నచోట్ల మహమ్మారి ఉద్ధృతి ఎక్కువవుతోందా?.. అవుననే అంటోంది ఓ తాజా అధ్యయనం. ఇటలీలోని బోలోగ్న యూనివర్సిటీ, ట్రియస్టె యూనివర్సిటీ పరిశోధకులు సంయుక్తంగా ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. లంబార్డీలోని బెర్గామో పారిశ్రామిక ప్రాంతం నుంచి మూడు వారాల వ్యవధిలో సూక్ష్మ ధూళికణాల (పీఎం10)కు సంబంధించి 30 నమూనాలను సేకరించి క్షుణ్నంగా పరిశీలించారు. చాలా నమూనాల్లో కరోనా వైరస్‌ జన్యు ఆనవాళ్లు కనిపించాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. కరోనా కోరల్లో గల్ఫ్‌

వారంతా నిరుపేదలు.. ఉన్న ఊరిని.. అయినవారిని వదిలి.. పొట్ట కూటి కోసం గల్ఫ్‌ దేశాలకు వెళ్లారు.. నాలుగు రాళ్లు సంపాదించుకుని కుటుంబ కష్టాలు తీరుద్దామనుకున్న వారి ఆశలను కరోనా అడియాసలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో అనేకమంది గల్ఫ్‌ దేశాల్లో పనుల్లేక.. చేతిలో చిల్లిగవ్వ లేక.. ఆకలితో అల్లాడుతున్నారు.. కొందరు వైరస్‌ బారిన పడి వైద్య సహాయం అందక అర్థిస్తున్నారు. అక్కడి ప్రభుత్వాలు స్థానికులనే తప్ప.. ప్రవాసులను పట్టించుకోవడంలేదు. దీంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో బాధిత కుటుంబాలలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. నడిచొచ్చినా ఏటీఎమ్‌ సలామీ

బ్యాంకు ఖాతాలో డబ్బులు పడ్డాయని సంబరం. కానీ, వెళ్లే దారేది! వెళ్తే వచ్చే వీలేది!! ఒడిశాలోని మారుమూల పల్లెల్లో గిరిజనుల దుస్థితి ఇది. వీరికి అండగా నిలబడింది సలామీ శశాంకర్‌. గిరిజనుల పాలిట నడిచివచ్చిన ఏటీఎమ్‌లా మారిందామె. ఒడిశా ముఖ్యమంత్రి కూడా ఆమెను మెచ్చుకున్నారు. ‘సలామీ సలామ్‌’ అంటూ ట్విటర్‌లో అభినందించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ఇప్పుడు మనమంతా సమంగా ఉన్నట్టే

బ్రహ్మానందంని చూడగానే నవ్వొస్తుంది. నటుడిగా ఆయన ప్రేక్షకులపై చూపించిన ప్రభావం అలాంటిది. ఆయన్ని పలకరిస్తే మాత్రం పూర్వాశ్రమంలోని అధ్యాపకుడు బయటికొస్తాడు, పేదరికం నుంచి ఎదిగిన ఓ శ్రమజీవి తొంగిచూస్తాడు. ఆయన మాటలన్నీ ఒక మంచి బతుకు పాఠంలా అనిపిస్తాయి. ఆయనతో ‘ఈనాడు సినిమా’ ప్రత్యేకంగా ముచ్చటించింది. ఈ సందర్భంగా బ్రహ్మానందం కరోనా విపత్తు, తన జీవితం, చిత్ర లేఖనం తదితర విషయాల గురించి మనసు విప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. మాతో ఆడండి.. నష్టాలు పూడ్చుకోండి

కరోనా మహమ్మారి కారణంగా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్న క్రికెట్‌ బోర్డులకు బీసీసీఐ బంపర్‌ ఆఫర్‌ ఇచ్చింది. భారత్‌తో వీలైనన్ని ఎక్కువ మ్యాచ్‌లు ఆడి నష్టాల్ని పూడ్చుకోవాలని సూచించింది. కష్టకాలంలో ఇతర బోర్డులకు సహాయం చేయడం ద్వారా ఐసీసీలో తన పట్టు పెంచుకోవాలని భావిస్తోంది. ఈ ఏడాది చివర్లో 2023-2031 భవిష్యత్‌ పర్యటనల ప్రణాళిక (ఎఫ్‌టీపీ)ను రూపొందించాలని భావిస్తున్న ఐసీసీ కూడా మరింత ఆదాయం కోసం బీసీసీఐ వైపే చూస్తుండటం గమనార్హం.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.