close

తాజా వార్తలు

Updated : 25/04/2020 17:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

శాశ్వత ప్రాతిపదికన టెలీ మెడిసిన్‌: సీఎం జగన్‌

శ్రీకాకుళం జిల్లాకు ప్రత్యేక అధికారిని నియమించాలని ఆదేశం

అమరావతి: కరోనా లాంటి విపత్తులను ఎదుర్కోవడానికి ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాలను మెరుగు పర్చుకోవడం చాలా అవసరమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అభిప్రాయపడ్డారు. గ్రామాల్లో విలేజ్‌ క్లినిక్స్‌ కీలక పాత్ర పోషిస్తాయని సీఎం వ్యాఖ్యానించారు. కొవిడ్- 19 నిరోధక చర్యలపై సమీక్షించిన ఆయన శ్రీకాకుళం జిల్లాలోనూకరోనా కేసులు వెలుగు చూసినందున ఆ జిల్లాలో దీని పర్యవేక్షణకు ఓ ప్రత్యేక అధికారిని నియమించాలని అధికారులను ఆదేశించారు. కరోనా పరీక్షల కోసం ల్యాబ్‌లు లేని మిగిలిన జిల్లాల్లో ల్యాబ్‌లు ఏర్పాటు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. 

ఇదివరకే నిర్ణయించిన విధంగా కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిని కొవిడ్‌ ఆస్పత్రిగా మార్చాలని సీఎం స్పష్టం చేశారు. ఏపీలో టెలీ మెడిసిన్‌ను శాశ్వత ప్రాతిపదికన నడపాలని సీఎం ఆదేశించారు. కాల్‌ చేసిన వారికి ప్రిస్కిప్షన్లు ఇవ్వడమే కాకుండా వారికి మందులు కూడా పంపించాలని, దీనివల్ల ప్రజలకు మేలు జరుగుతుందని ముఖ్యమంత్రి అభిప్రాయ పడ్డారు. టెలీ మెడిసిన్‌ టోల్ ఫ్రీ నెంబరు 14410కు మరింత ప్రచారం కల్పించాలని సీఎం సూచించారు.

కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి భౌతిక దూరం పాటిస్తూ అనుమతించిన ప్రాంతాల్లో పరిశ్రమలు, ఇతర వ్యవసాయ కార్యకలాపాలు కొనసాగించాల్సిందిగా సీఎం ఆదేశాలు ఇచ్చారు. అక్కడ పనిచేస్తున్న వారికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల ప్యాకింగ్, ప్రాథమిక ప్రాసెసింగ్, విక్రయాలు కోసం చేపట్టనున్న జనతాబజార్ల ఆలోచనకు మంచి మద్దతు లభిస్తోందని మంత్రి కన్నబాబు సీఎంకు ఈసందర్భంగా వివరించారు. ఒక్కరోజే 6928 కరోనా పరీక్షలు చేయించామని అధికారులు సీఎంకు తెలిపారు. ఇప్పటి వరకు 61,266 పరీక్షలు చేసినట్టు చెప్పారు. ప్రతి 10 లక్షల మందికి 1147 మందికి పరీక్షలు చేసి దేశంలోనే ప్రథమ స్థానంలో ఏపీ నిలిచినట్టు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.

ఇవీ చదవండి..
24 గంటల్లో 61 పాజిటివ్‌ కేసులు
మూడో వ్యాక్సిన్‌కు చైనా అనుమతి



Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.