రాబోయే వారం రోజులు అత్యంత కీలకం
close

తాజా వార్తలు

Published : 25/04/2020 00:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రాబోయే వారం రోజులు అత్యంత కీలకం

కొవిడ్‌-19 జాతీయ సలహా మండలి ప్రతినిధి పి.గంగాధర్‌రావు

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా వైరస్‌ నివారణకు గానూ వచ్చే వారం రోజులు అత్యంత కీలకమైనవని కొవిడ్‌-19 జాతీయ సలహా మండలి ప్రతినిధి, ఐఎంఏ మాజీ జాతీయ ఉపాధ్యక్షుడు పొట్లూరి గంగాధర్‌రావు సూచించారు. వ్యాధి నిరోధకశక్తి పెంచుకోవడం ద్వారా ఈ మహమ్మారి నుంచి బయట పడగలమన్నారు. దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల పెరుగుదల సామాజిక వ్యాప్తికి సంకేతమంటున్నారు. కరోనా నివారణ కోసం ఐఎంఏ తరఫున కేంద్రానికి చేసిన సూచనలు ఏమిటి..? వైరస్‌ నివారణలో ప్రస్తుతం ఎదురవుతోన్న సవాళ్లు ఏంటి..? ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? అనే అంశాలపై పొట్లూరి గంగాధర్‌రావుతో ముఖాముఖి..

కొవిడ్‌-19పై ఐఎంఏ తరఫున కేంద్రానికి ఎలాంటి ప్రతిపాదనలు చేశారు..? 

కరోనా విజృంభన పట్ల ఒకింత ఆందోళనగా ఉంది. ఇది కంటికి కనిపించని శత్రువు. వైరస్‌ స్వరూపం, లక్షణాలు, ఎలా వ్యాప్తి చెందుతుంది అనే అంశాలపై పూర్తి స్థాయి అవగాహన ఎవరికీ లేదు. ఇంతటి విపత్కర పరిస్థితుల్లోనూ ప్రాణాలు లెక్కచేయకుండా సేవలందిస్తున్న వైద్యులపై కొన్ని చోట్ల దాడులు జరుగుతున్నాయి. దీనివల్ల వైద్యులు మరింత ఒత్తిడికి గురవుతున్నారు. వైద్యులు, వైద్య సిబ్బందిపై దాడులు చేస్తే శిక్షలు విధించాలని, కఠిన చట్టం తీసుకురావాలని 2005 నుంచి ఐఎంఏ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. కరోనా సమయంలో వైద్యులపై దాడులు చేస్తే ఏడు సంవత్సరాల జైలుశిక్షతో పాటు రూ.5లక్షల జరిమానా విధించేలా మార్పులు చేసి ఆర్డినెన్స్‌ పంపించాం. 

కరోనా నేపథ్యంలో ప్రభుత్వానికి, వైద్యులకు, ప్రజలకు మీరు సూచించే విషయాలు..? 

క్వారంటైన్‌లో ఉన్న వారు, వారికి సేవ చేసేవారు సరైన జాగ్రత్తలు పాటించడం లేదని నా వ్యక్తిగత అభిప్రాయం. అనుమానుతుల్ని తీసుకెళ్లి ఓ గదిలో కొన్ని పడకలు ఏర్పాటు చేసి క్వారంటైన్‌లో పెడుతున్నారు. వారికి ఆహారం అందించేటప్పుడు, తిరిగేటప్పుడు వ్యక్తిగత దూరం పాటించడం లేదు. వారిలో ఒక్కరికి పాజిటివ్‌ ఉన్నా అందరికి వైరస్‌ సోకే ప్రమాదం ఉంది. అందుకే కొన్ని రాష్ట్ర్ర ప్రభుత్వాలు ఓ హోటల్‌ను తీసుకొని ఒక్కొక్కరికి ఒక్కో గదిని కేటాయిస్తున్నాయి. కరోనాను ఎవరూ తేలికగా తీసుకోవద్దు. వైద్యులు సైతం తగిన జాగ్రత్తలు పాటిస్తూ రోగులకు చికిత్స అందివ్వాలి. ఐఎంఏ ఇప్పటికే కొన్ని నియమాలు సూచించింది. వాటిని ప్రతి ఒక్కరూ విధిగా పాటించాలి. 

రోగనిరోధక శక్తి పెంచుకోవాలంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఏం చేస్తే మేలు..? 

వైరస్‌ బారిన పడకుండా ఉండాలన్నా, బాధితులు కోలుకోవాలన్నా రోగనిరోధక శక్తి ముఖ్యం. దాన్ని పెంచుకునేందుకు ఎక్కువగా పోషకాలున్న ఆహారం తీసుకోవాలి. పండ్లు, గుడ్డు, పాలు, డ్రై ఫ్రూట్స్‌ రోజువారీ ఆహారంలో తీసుకుంటే మంచిది. శరీరంలో యాంటీబాడీస్‌ పెరగాలంటే పోషకాహారం తప్పనిసరి అవసరం. 

ఇంకా ఆయన ఏమన్నారో ఈ వీడియోలో చూడండి..

 Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని