close

తాజా వార్తలు

Published : 19/04/2020 00:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మహిళపై ఉమ్మిన వ్యక్తి అరెస్టు 

ముంబయి : కరోనా వైరస్‌ ఉద్ధృతమవుతున్న నేపథ్యంలో బహిరంగంగా ఉమ్మివేయడంపై నిషేధాజ్ఞలు కొనసాగుతున్నాయి. కొవిడ్‌ తీవ్రత ఎక్కువగా ఉన్న మహారాష్ట్రలోనూ ఈ అదేశాలు అమలవుతున్నాయి. ఈ నేపథ్యంలో మహిళపై ఉమ్మిన ఓ వ్యక్తిని ముంబయి పోలీసులు అరెస్టు చేశారు.

మణిపూర్‌కు చెందిన ఓ మహిళ ఈ నెల 6న  మహారాష్ట్రలోని కలినా మార్కెట్‌లో కూరగాయలు కొనేందుకు తన సోదరితో కలిసి వెళ్లింది.  ఇద్దరు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా.. అటుగా  ద్విచక్రవాహనంపై వచ్చిన  23 ఏళ్ల  వ్యక్తి ఆమె ముఖంపై ఉన్న మాస్క్‌ను లాగి ఉమ్మి పారిపోయాడు. దీంతో ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో విచారణ చేపట్టిన పోలీసులు ఎట్టకేలకు ఆ వ్యక్తిని అరెస్టు చేశారు. నిందితుడిని కుర్లాకు చెందిన మహ్మద్‌ అలియాస్‌ మహ్మద్‌ అమీర్‌గా గుర్తించారు. ఈ విషయంపై జాతీయ మహిళా కమిషన్‌ కూడా స్పందించింది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.