close

తాజా వార్తలు

Updated : 13/04/2020 09:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ - 9 AM

1. సరకులకెళ్తే... బె‘ధరా’ల్సిందే

లాక్‌డౌన్‌ నేపథ్యంలో కొందరు నిత్యావసర వస్తువుల ధరలను పెంచుతున్నారు. సరఫరా గొలుసు తెగుతుండటంతో ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. పంట కోతలు, ఉత్పత్తుల తయారీలో జాప్యం, పెరుగుతున్న రవాణా ఖర్చులు దీనికి కారణమవుతున్నాయి. లాక్‌డౌన్‌ తర్వాత అధికశాతం కుటుంబాలు అవసరానికి మించిన సరకుల్ని కొనుగోలు చేసి నిల్వ చేసుకోవడం మరో కారణం. ఆంక్షలు మరికొన్నాళ్లు పొడిగిస్తారనే ప్రచారంతో ఇప్పటికే చిల్లర దుకాణాల వద్ద వినియోగదారులు బారులు తీరుతున్నారు. దీన్ని ఆసరాగా చేసుకొని కొందరు వ్యాపారులు ధరలు పెంచేస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. సమృద్ధిగా హైడ్రాక్సీ క్లోరోక్విన్‌

భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్‌) మార్గదర్శకాల ప్రకారం కరోనా బాధితులకు చికిత్సలో భాగంగా అందించే హైడ్రాక్సీక్లోరోక్విన్‌, అజిత్రోమైసిన్‌ మాత్రలు రాష్ట్రంలో పుష్కలంగా అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వ ఆధీనంలోనే 13లక్షల హైడ్రాక్సీక్లోరోక్విన్‌, 36లక్షల అజిత్రోమైసిన్‌ మాత్రలు వేర్వేరు మోతాదుల్లో సిద్ధంగా ఉన్నాయి. ఇవికాక హైడ్రాక్సీక్లోరోక్విన్‌ మాత్రల ఉత్పత్తికి రాష్ట్రంలో 19 సంస్థలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. రాష్ట్రంతో పాటు దేశ అవసరాలకు అనుగుణంగా కరోనా సంబంధిత ఉత్పత్తులకు అనుమతిస్తూ తెలంగాణ సర్కారు కీలక నిర్ణయాలు తీసుకుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. కరోనా నిర్ధారణకు 4 పరీక్షలు

రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి నిర్ధారణకు విస్తృతంగా పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా అనుమానిత లక్షణాలు ఉన్నవారికి, పాజిటివ్‌ రోగులకు సన్నిహితంగా ఉన్నవారికి ఇప్పటికే చేస్తున్న ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్షలతో పాటు, ట్రూనాట్‌, ర్యాపిడ్‌ యాంటీబాడీ పరీక్షలు చేయాలని నిర్ణయించింది. వీటితోపాటు ‘కెమిలూమినిసెన్స్‌’ పరిజ్ఞానంతోనూ వ్యాధిని నిర్ధారిస్తారు. ఈ నాలుగు విధానాల్లో పరీక్షలు నిర్వహించేందుకు అవసరమైన కిట్లను సమకూర్చుకునేందుకు వైద్య, ఆరోగ్యశాఖ సన్నాహాలు చేస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. అప్పుడే హెచ్చరించారు.. 

కరోనా మహమ్మారి ధాటికి అగ్రరాజ్యం అమెరికా సైతం చిగురుటాకులా వణికిపోతోంది. ఆదివారం నాటికి దాదాపు ఐదు లక్షల మంది ఈ వైరస్‌ బారిన పడ్డారు. అయితే ఈ పరిస్థితి కారణం అధ్యక్షుడి వైఖరేనట. వైరస్‌ విజృంభణ గురించి అక్కడి అధికారులు ముందే అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ను హెచ్చరించారట. అయినప్పటికీ  ఆయన వారి సూచనలను పట్టించుకోకుండా, కేవలం ఆర్థిక వ్యవస్థ లాభాలపై దృష్టి సారించటం వల్లనే అమెరికాలో వైరస్‌ తీవ్రత ఎక్కువయిందని స్థానిక పత్రిక పేర్కొంది. ఈ మేరకు ప్రముఖ అమెరికన్‌ వార్తా పత్రిక ద న్యూయార్క్‌ టైమ్స్ ఒక పరిశోధనాత్మక కథనాన్ని ప్రచురించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. బిహార్‌లో ఇళ్ల ముందు కరెన్సీ నోట్లు

లాక్‌డౌన్‌ నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలు విచిత్ర సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. బిహార్‌లోని ఓ పట్టణంలో ఇళ్ల ముందు కరెన్సీ నోట్లు దర్శనమిస్తుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. సహస్ర పట్టణంలో ఓ అగంతకుడు పలు ఇంటి గుమ్మాల ముందు కరెన్సీ నోట్లు ఉంచుతున్నాడు. వాటితో పాటు ఓ చీటీలో ‘నేను కరోనాతో వచ్చాను. ఈ నోటును స్వీకరించండి, లేకుంటే ప్రతిఒక్కరినీ వేధిస్తాను’ అని అందులో రాశాడు. ఇళ్ల ముందు రూ.20, రూ.50, రూ.100 నోట్లు లభ్యమవుతున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. అమెరికాలో నిర్బంధ లాక్‌డౌన్‌ అంత సులువు కాదు

నిర్బంధంగా లాక్‌డౌన్‌ విధించడమంటే అమెరికా చట్టాల ప్రకారం పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం కల్గించడమేనని, అది అంత సులువు కాదని అమెరికా, న్యూజెర్సీ రాష్ట్రంలోని బయోనె నగరంలో నివాసం ఉండే తెలుగు ఇంజినీర్‌ డా. పమ్మి సతీష్‌చంద్ర తెలిపారు.  ‘ఈనాడు’తో ఫోన్‌లో మాట్లాడిన సతీష్‌ అక్కడి పరిస్థితిని వివరించారు. బృందాలుగా పార్టీలు చేసుకోవడం, ఆరు అడుగుల సామాజిక దూరం పాటించకపోవడం వంటివి చేస్తే నేరాలుగా పరిగణిస్తారన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ఇక్కడిట్టా..విదేశాల్లో ఎట్టా?

హైదరాబాద్‌ నుంచి పారిస్‌ వరకు.. కెనడా నుంచి సింగపూర్‌ వరకు.. ఏ నగరాన్ని కదిలించినా.. ఏ దేశాన్ని చూసినా.. ‘కరోనా’ కల్లోలమే కనిపిస్తోంది. నగరానికి చెందిన పలువురు వివిధ పనులు రీత్యా ఫ్రాన్స్‌, కెనడా, సింగపూర్‌ దేశాల్లో ఉంటున్నారు. వారిని పలకరించినప్పుడు అక్కడ లాక్‌డౌన్‌ పరిస్థితులు, కరోనా ప్రభావం, ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ‘ఈనాడు’కు వివరించారిలా.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. దేశంలో 3జోన్లు

కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ఏప్రిల్‌ 15 నుంచి దేశాన్ని మూడు జోన్లుగా విభజించే యోచనలో కేంద్రం ఉంది. ఈ విషయమై రాష్ట్రాలతో సంప్రదింపులు జరుపుతోంది. నమోదైన కేసుల ఆధారంగా రెడ్‌, ఆరెంజ్‌, గ్రీన్‌ జోన్లుగా గుర్తించాలని కేంద్రం భావిస్తోంది. ఏప్రిల్‌ 15 తర్వాత మరో రెండు వారాల పాటు కొవిడ్‌-19ను దీటుగా ఎదుర్కోవడానికి ఇది ఉపకరిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9.లాక్‌డౌన్‌లోనూ అదే కిక్కు

లాక్‌డౌన్‌లోనూ నగరంలో మద్యం అమ్మకాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. కొందరు మద్యం దుకాణాలు, బార్లు, రెస్టారెంట్ల నిర్వాహకులు గుట్టుచప్పుడు కాకుండా ప్రత్యేకంగా ఏజెంట్లను నియమించుకుని దందాను నిర్వహిస్తున్నారు. ఇటీవల ఒక్క మల్కాజిగిరి ఎస్‌వోటీ పోలీసులే ఏడు ప్రాంతాల్లో ఈ గుట్టును రట్టు చేశారంటే వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. తాజాగా సికింద్రాబాద్‌లో ఓ వ్యక్తి కారులో భారీగా మద్యం తరలిస్తూ పోలీసులకు చిక్కడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. సూచీల కదలికలకు లాక్‌డౌన్‌

కరోనా వైరస్‌ వ్యాప్తిని తగ్గించేందుకు విధించిన లాక్‌డౌన్‌ను మంగళవారం (14వ తేదీ) తర్వాత కొనసాగిస్తారా లేదా అన్న అంశం మార్కెట్‌కు దిశానిర్దేశం చేయనుందని విశ్లేషకులు భావిస్తున్నారు. చిన్న, మధ్య స్థాయి కంపెనీ (ఎస్‌ఎమ్‌ఈ)లకు ప్రకటిస్తారని భావిస్తున్న మరో ఆర్థిక ఉద్దీపనా కీలకం కానుంది. అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా మంగళవారం మార్కెట్లకు సెలవు. అంతర్జాతీయ మార్కెట్లు, ముడి చమురు ధోరణి సానుకూలంగా ఉండటం దేశీయ మార్కెట్లకు కలిసి వచ్చే అంశం. నిఫ్టీ-50కి ఈ వారం 8,800-9,600 పాయింట్ల శ్రేణిలో కదలాడవచ్చని సాంకేతిక నిపుణులు అంచనా వేస్తున్నారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.