close

తాజా వార్తలు

Published : 27/03/2020 09:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ - 9 AM

1. ప్రపంచవ్యాప్తంగా 5లక్షలు దాటిన కరోనా కేసులు

చైనాలో మొదలైన కరోనా మహమ్మారి రోజురోజుకీ వేగంగా విస్తరిస్తోంది. ఈ వైరస్‌ ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల ప్రజలను నిద్రలేని రాత్రులు గడిపేలా చేస్తోంది. తాజాగా ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 529,614కు చేరింది. కరోనా కారణంగా ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా 23,714 మంది మృతి చెందగా 1,21,454 మంది బాధితులు కోలుకున్నారు. మరోవైపు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం భారత్‌లో కరోనా కేసుల సంఖ్య 694గా ఉంది.

2. రాత్రి కర్ఫ్యూ పొడిగింపు?

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో అమలులో ఉన్న రాత్రి పూట కర్ఫ్యూను ఈనెల 31 తర్వాత కూడా కొనసాగించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్‌ 14 వరకు లాక్‌డౌన్‌ ప్రకటించిన నేపథ్యంలో అందుకనుగుణంగా రాత్రి కర్ఫ్యూను కూడా అప్పటి వరకు పొడిగించాలని చూస్తున్నట్లు సమాచారం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

3. సరిహద్దుల్లో ఉద్రిక్తం

ఆంధ్ర, తెలంగాణ సరిహద్దుల్లో పరిస్థితి ఇంకా గందరగోళంగానే ఉంది. అత్యవసర అనుమతులున్న వారిని వదిలేస్తున్న పోలీసులు మిగిలిన వారిని వెనక్కి వెళ్లాలని ఆదేశిస్తుండటం.. వెళ్లబోమని జనం మొరాయించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారుతోంది. గురువారం ఆంధ్ర, తెలంగాణ సరిహద్దులైన కృష్ణా జిల్లా జగ్గయ్యపేట, తిరువూరు, గుంటూరు జిల్లా పొందుగల, దామరచర్ల, పశ్చిమగోదావరి జిల్లా అల్లిపురం, గురపట్లగూడెం, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలతోపాటు ప్రకాశం, కడప, అనంతపురం జిల్లాల సరిహద్దుల్లోని అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులవద్ద చాలామంది రోడ్లపైనే ఉండిపోయారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. జూన్‌ వరకు ఖర్చులకు రూ.65 వేల కోట్లు!

ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే మూడు నెలల కాలానికి అవసరమైన ఖర్చుల నిమిత్తం (ద్రవ్య వినిమయానికి) ప్రభుత్వం ఆర్డినెన్సు తీసుకురాబోతోంది. ఇందుకోసం శుక్రవారం రాష్ట్ర మంత్రిమండలి సమావేశం కాబోతోంది. మంత్రిమండలి సమావేశంలో ఈ మేరకు ఆమోదం తీసుకుని రాష్ట్ర గవర్నర్‌కు పంపిస్తారు. ఆయన ఆమోదంతో ఆర్డినెన్సు విడుదల కానుంది. రూ.60 వేల కోట్ల నుంచి రూ.65 వేల కోట్ల వరకు ద్రవ్య వినిమయానికి ఆమోదం తీసుకుంటారని సమాచారం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

5. కొనసాగిన ‘శత’కోద్యమం

పూర్తిస్థాయి నిర్బంధం అమల్లో ఉన్నా అమరావతి ఉద్యమం వందో రోజు కొనసాగింది. బయటకు వచ్చేందుకు వీలు లేకపోవడంతో రైతులు, రైతు కూలీలు, మహిళలు ఇళ్ల నుంచే దీక్ష చేపట్టారు. ఎవరికి వారు ఇళ్లపైకెక్కి, అమరావతి ఐకాస జెండాలు, ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. ఆంక్షలు అమల్లో ఉండటంతో 29 గ్రామాల్లోని దీక్షా శిబిరాల్లో కొన్ని చోట్ల నలుగురికి మించకుండా హాజరయ్యారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6. ఏపీ సీఎం సహాయనిధికి పంపాలంటే..

ఏపీ సీఎం సహాయనిధికి విరాళమిచ్చే వారు పంపాల్సిన వివరాలను రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి తెలిపారు. చెక్కులు: చీఫ్‌ మినిస్టర్‌ రిలీఫ్‌ ఫండ్‌, ఆంధ్రప్రదేశ్‌; ఆన్‌లైన్‌ చెల్లింపులు: భారతీయ స్టేట్‌బ్యాంకు వెలగపూడి సచివాలయం శాఖ, ఖాతా నంబరు: 38588079208, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌: ఎస్‌బీఐఎన్‌0018884; ఆంధ్రాబ్యాంకు, వెలగపూడి సచివాలయం శాఖ ఖాతా నంబరు: 110310100029039 ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌: ఏఎన్‌డీబీ0003079

7. ఇంట్లో ఉంటూనే ఇలా ఆస్వాదించండి

కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వాలు తప్పనిసరి నిర్బంధాన్ని అమలు చేస్తుండటంతో అందరూ ఇళ్లకే పరిమితం కావాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రజలు ఈ పరిస్థితులను ఎదుర్కోవడానికి యునిసెఫ్‌ కౌన్సిలింగ్‌ సిబ్బంది చేసిన సూచనలను ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ ‘యునిసెఫ్‌’ కార్యనిర్వాహక డైరెక్టర్‌ హెన్రియెట్టా హెచ్‌ ఫోర్‌  వివరించారు. ‘‘ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి.. సంగీతం, కుటుంబం, పఠనం, పాటలు పాడటం, నవ్వులు, ఆశలు, ఆకాంక్షలపై ఎలాంటి నిషేధం, ఆంక్షలు లేవు. వీటిని మీరు హాయిగా ఆస్వాదించండి.’’ అని సూచించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

8. కరోనా మందు తయారు చేస్తారా.. వెంటనే అనుమతి ఇస్తాం

ప్రాణాంతక కరోనా వైరస్‌ (కోవిడ్‌-19) కు ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడా మందు లేదు. వ్యాక్సిన్‌ కూడా లేదు. దేశీయ ఫార్మా- బయోటెక్‌ కంపెనీలను కరోనా వైరస్‌కు మందు లేదా వ్యాక్సిన్‌ తయారు చేసే దిశగా ప్రోత్సహించడం సరైన పరిష్కారంగా ప్రభుత్వ- పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఇందులో భాగంగా దేశీయ కంపెనీలు ముందుకు వస్తే సత్వర అనుమతులు ఇవ్వటానికి సిద్ధమని పేర్కొంటూ డ్రగ్‌ కంట్రోల్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ) మార్గదర్శకాలు జారీ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. ఫలిస్తున్న లాక్‌డౌన్‌

ప్రధాని మోదీ ప్రకటించిన లాక్‌డౌన్‌ కారణంగా ప్రజలు పాటిస్తున్న సామాజిక దూరం ఫలితాన్నిస్తున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ తెలిపారు. ప్రస్తుతం దేశంలో కరోనా రోగుల సంఖ్య తగ్గకపోయినా, పెరుగుదల నిష్పత్తిలో కొంత తగ్గుదల కనిపిస్తోందని చెప్పారు. ఉదాసీనత ప్రదర్శించకుండా ఆంక్షలన్నింటినీ యథాతథంగా అనుసరించాలని  ఆయన గురువారం విలేకరుతో తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. వచ్చే ఏడాది మహిళల ఐపీఎల్‌ ఆరంభించాలి

వచ్చే ఏడాది మహిళల ఐపీఎల్‌ను ఆరంభించాలని భారత అమ్మాయిల వన్డే జట్టు కెప్టెన్‌ మిథాలీరాజ్‌.. బీసీసీఐని కోరింది. ‘వచ్చే ఏడాది మహిళల ఐపీఎల్‌ ఆరంభించాల్సిందేనన్నది నా వ్యక్తిగత అభిప్రాయం. నిబంధనల్లో కొన్ని మార్పులు చేసి లీగ్‌ను చిన్నగానైనా మొదలెట్టాలి. పురుషుల ఐపీఎల్లో తుది జట్టులో ఆడేందుకు జట్టుకు నలుగురు విదేశీ ఆటగాళ్లను మాత్రమే అనుమతిస్తారు. తొలి మహిళల ఐపీఎల్‌లో మాత్రం జట్టులో ఐదారుగురు విదేశీ క్రికెటర్లు ఉండేలా చూడాలి’’అని అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.