close

తాజా వార్తలు

Published : 26/03/2020 21:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కరోనా: గూగుల్‌లో చెప్పేయ్‌ అన్నా...

దుకాణం తెరిచింది, లేనిదీ గూగుల్‌ ద్వారా తెలిపే వీలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: కొవిడ్‌-19 లాక్‌డౌన్‌తో నిత్యావసర వస్తువులు లభించే దుకాణాలు తెరిచి ఉన్నాయో లేదో తెలియక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. తమ ప్రాంతంలో ఏయే షాపులు తెరిచి ఉన్నాయో తెలియక అంతా తిరగాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో దుకాణ యజమానులు తాజా సమాచారాన్ని వినియోగదారులకు ఎప్పటికప్పుడు తెలియచేసే వీలును గూగుల్‌ కలిగిస్తోంది. ఈ కొత్త సదుపాయాన్ని దుకాణదారులు ‘గూగుల్‌ సెర్చ్‌’ ద్వారా మాత్రమే కాకుండా ‘గూగుల్‌ మ్యాప్‌’ల ద్వారా కూడా తెలియజేయవచ్చని ఈ మేరకు చేసిన ఓ ప్రకటనలో గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌  తెలియచేశారు.

ఎలా చెప్పాలంటే...

* దుకాణ యజమానులు గూగుల్‌లో ‘గూగుల్‌ మై బిజినెస్‌’ ఖాతా తెరవాలి. (ఇప్పటికే లేనివారు)

* అనంతరం దాని మెనూలో ఉండే ‘CLOSE THE BUSINESS ON GOOGLE’ (క్లోజ్‌ ద బిజినెస్‌ ఆన్‌ గూగుల్‌) అనే సెక్షన్‌కు వెళ్లాలి. 

* అక్కడ ఉండే మూడు ఆప్షన్లలో “MARK AS TEMPORARILY CLOSED” (మార్క్‌ యాజ్‌ టెంపరరీలీ క్లోజ్డ్‌‌) అనే దానిని ఎంచుకోవటం ద్వారా... తమ దుకాణం తాత్కాలికంగా మూసివేయబడింది అనే సమాచారాన్ని తమ ప్రొఫైల్‌లో అని అప్‌డేట్‌ చేయవచ్చు. 

* ఇక తమ వ్యాపార వేళల్లో మార్పులు చోటుచేసుకున్నట్లయితే, ‘SPECIAL HOURS’ (స్పెషల్‌ అవర్స్‌) అనే ఫీచర్‌ ద్వారా ఆ విషయాన్ని కూడా తమ ఖాతాదారులకు తెలియచేయవచ్చు. 

ఇదివరకు ప్రభుత్వ సమాచారం ఆధారంగా మాత్రమే దుకాణాలకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు అందించేది. కాగా, తమ దుకాణాలు మూసి ఉన్నట్లయితే ఆ విషయాన్ని వ్యాపారులు ప్రజలకు నేరుగా తెలిపే విధంగా అప్‌డేట్‌ చేయగల సదుపాయాన్ని గూగుల్‌ ఇప్పుడు కల్పించింది. ఐతే సరైన సమాచారాన్ని అందించాల్సిన బాధ్యత దుకాణదారులపైనే ఉందని... ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని గూగుల్‌ విజ్ఞప్తి చేసింది. 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.