close

తాజా వార్తలు

Updated : 22/03/2020 16:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నెలాఖరు వరకూ తెలంగాణలో లాక్‌డౌన్‌?

హైదరాబాద్‌: కరోనా కలవరం నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెలాఖరు వరకు లాక్‌డౌన్‌ ప్రకటించే అవకాశమున్నట్లు సమాచారం. ఈ సాయంత్రం 4 గంటలకు ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ అత్యున్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో కరోనా వైరస్‌ ప్రభావం, చేపట్టాల్సిన తదుపరి చర్యలు, జనతా కర్ఫ్యూ.. తదితర అంశాలపై ఉన్నతాధికారులతో చర్చించనున్నారు. ఈ సమావేశంలోనే లాక్‌డౌన్‌ సహా పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం.

లాక్‌డౌన్‌ ప్రకటిస్తే అత్యవసర సేవలు మినహా అన్నింటినీ కట్టడి చేసే అవకాశముంది. అనంతరం సాయంత్రం 5 గంటలకు సీఎం మీడియాతో మాట్లాడనున్నారు.  ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను కేసీఆర్‌ ప్రకటించే వీలుంది. మరోవైపు జనతా కర్ఫ్యూ నేపథ్యంలో మీడియా సమావేశంలోనే 5 గంటలకు సీఎం చప్పట్లు కొట్టి సంఘీభావం తెలపనున్నారు.

 



Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.