close

తాజా వార్తలు

Published : 22/03/2020 09:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ - 9 AM

1. ఇళ్లలోనే జనం..రోడ్లన్నీ ఖాళీ

ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపుమేరకు దేశ వ్యాప్తంగా జనతా కర్ఫ్యూ కొనసాగుతోంది.  తెలుగు రాష్ట్రాల్లో జనతా కర్ఫ్యూను విజయవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకోవడంతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. అత్యవసర సేవలు మినహా అన్ని సేవలు బద్‌ అయ్యాయి. రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించడంతో రోడ్లన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

2. మాస్కు గరిష్ఠ ధర రూ.8

కొవిడ్‌-19 భయాల నేపథ్యంలో దేశవ్యాప్తంగా హ్యాండ్‌ శానిటైజర్లకు (చేతులు శుభ్రం చేసుకునే ద్రావణాలకు) విపరీతంగా గిరాకీ నెలకొంది. ఈ నేపథ్యంలో ధరల కట్టడికి కేంద్రం రంగంలోకి దిగింది. 200 మిల్లీ లీటర్ల ద్రావణం గరిష్ఠ ధరను రూ.100కు పరిమితం చేసింది. ఈ ధర జూన్‌ 30వరకు అమల్లో ఉండనుంది. రెండు పొరల (సర్జికల్‌) మాస్కు గరిష్ఠ ధర  రూ.8, మూడు పొరల (సర్జికల్‌)  మాస్కు గరిష్ఠ ధర 10గా నిర్ణయించింది. ఈ ధరలూ జూన్‌ 30 వరకు అమల్లో ఉంటాయని తెలిపింది. 

3. కొవిడ్‌పై ఐసీఎంఆర్‌ కొత్త వ్యూహం

దేశంలో కరోనా వైరస్‌ తీవ్రత పెరుగుతున్న క్రమంలో భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) వ్యూహం మార్చింది. తీవ్ర శ్వాసకోశ సమస్యలు, జ్వరం, దగ్గు, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది ఉన్న రోగులందరికీ కొవిడ్‌-19 పరీక్షలు చేయాలంటూ శనివారం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఎవరికైనా వైరస్‌ లక్షణాలు లేకపోయినా, పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వ్యక్తులతో సంబంధమున్నట్టు తేలితే వారిని 5-14 రోజుల మధ్యలో పరీక్షించాలని ఆదేశించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. కర్ఫ్యూలోనూ ఇళ్లలోనే దీక్ష  

కరోనా వైరస్‌ వ్యాప్తి దృష్ట్యా రాజధాని అమరావతి ఉద్యమాన్ని సరికొత్తగా ముందుకు తీసుకెళతామని అమరావతి పరిరక్షణ సమితి నేతలు, మహిళలు, రైతులు, రైతు కూలీలు పేర్కొన్నారు. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి 6.45 గంటల వరకు మళ్లీ రాత్రి 9 గంటల నుంచి 9.45 గంటల వరకు శిబిరాల్లో దీక్ష చేయాలని నిర్ణయించారు. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్య ఇళ్లలోనే కుటుంబమంతా దీక్ష చేసి నిరసన వ్యక్తం చేయాలని అనుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

5. తొలి బాధితుడికి ఇలా నయం చేశాం..

తెలంగాణలో తొలి కరోనా వైరస్‌ బాధితుడికి నయం చేయడంలో క్లోరోక్విన్‌ ఔషధాలు వినియోగించినట్లు గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శ్రావణ్‌కుమార్‌ తెలిపారు. విదేశాల నుంచి వచ్చిన ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌లో మార్చి 3న కరోనా ఉన్నట్లు వెల్లడైన విషయం తెలిసిందే. ఇలా రాష్ట్రంలోకి ప్రవేశించిన వ్యాధికి చికిత్స అందించడాన్ని గాంధీ వైద్యులు సవాలుగా తీసుకుని కృషి చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6. కరోనా నివారణలో ప్రైవేటు భాగస్వామ్యం

కరోనా వైరస్‌ (కొవిడ్‌ 19) వ్యాప్తిని కట్టడి చేయడంలో ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. అవసరాలను బట్టి ప్రైవేటు ఆసుపత్రుల సేవలను కూడా వినియోగించుకోవడానికి ఆదేశాలిచ్చింది. ‘అంటువ్యాధుల నియంత్రణ చట్టం, 1897’లో తాజాగా ‘కొవిడ్‌ 19’ నియంత్రణకు సంబంధించి మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

7. సెలవులు పొడిగిస్తే 1-9 తరగతుల పరీక్షలు లేనట్లే!

కరోనా వ్యాప్తి నేపథ్యంలో పాఠశాలలకు ఈనెల 31వ తేదీ వరకు సెలవులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కూడా సెలవులు పొడిగిస్తే అప్పుడు ఒకటి నుంచి 9వ తరగతి వరకు సమ్మేటివ్‌ అసెస్‌మెంట్‌(ఎస్‌ఏ-2) పరీక్షలు ఉండవు!. ముందుగా ప్రకటించిన కాలపట్టిక ప్రకారం ఏప్రిల్‌ 7 నుంచి 16 వరకు పరీక్షలు నిర్వహించాలి. అదే నెల 24 నుంచి వేసవి సెలవులు ఇస్తారు. అవసరమైతే పరీక్షలు పాఠశాలలు పునఃప్రారంభం తర్వాత జూన్‌లో నిర్వహిస్తామని తెలంగాణ విద్యాశాఖ అధికారి ఒకరు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

8. ఉపాధ్యాయులకూ ‘వర్క్‌ ఫ్రం హోం’

కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో దేశంలోని అన్ని విద్యాసంస్థల్లో బోధన, బోధనేతర సిబ్బంది ఈ నెల 31 వరకు ఇంటి నుంచి పనిచేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. కేంద్ర మానవ వనరులశాఖ కార్యదర్శి అమిత్‌ఖరే శనివారం ఈ ఉత్తర్వులు జారీచేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. నీటిని గెలిచారు!

జలమే జీవం... నీళ్లు లేనిదే ప్రాణం లేదు... పంటల్లేవు... పరిశ్రమల్లేవు. కానీ ఆ నీరు అన్నిచోట్లా ఉండదు. ఎడారులు, కొండలు,  వానచుక్క ఎరగని పొడి నేలలు... ఎన్నో ఈ ప్రపంచంలో ఉన్నాయి. ఆ ప్రాంతాల్లోనూ మనుషులున్నారు. వాళ్లకు తాగడానికీ,  తిండి గింజలు పండించుకోడానికీ నీరు కావాలి. ప్రకృతి ఇస్తే తప్ప మరోరకంగా పొందలేని ఈ నీటి కోసం ప్రపంచదేశాలు పెద్ద సాహసాలే చేస్తున్నాయి. మార్చి 22 ప్రపంచ జలదినోత్సవం సందర్భంగా నీటి సంరక్షణకు వివిధ దేశాలు ఇస్తున్న ప్రాధాన్యాన్ని తెలిపే.. ప్రత్యేక కథనం కోసం క్లిక్‌ చేయండి 

10. సైనా, శ్రీకాంత్‌లకు నిరాశేనా..

దేశంలో బ్యాడ్మింటన్‌ విప్లవానికి కారణమైన అమ్మాయి సైనా నెహ్వాల్‌. భారత పురుషుల బ్యాడ్మింటన్‌లో ఎవరూ అందుకోని ఎత్తుల్ని చేరుకున్న ఆటగాడు కిదాంబి శ్రీకాంత్‌. ఈ ఇద్దరి ఒలింపిక్స్‌ ఆశలు ఇప్పుడు ప్రమాదంలో పడ్డాయి. ఒలింపిక్స్‌ ముంగిట జరగాల్సిన అర్హత టోర్నీలన్నీ వాయిదా పడటంతో వీళ్లిద్దరూ టోక్యోకు వెళ్లడం సందేహంగా మారింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.