close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 18/03/2020 11:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కరోనా ఎఫెక్ట్‌: వేడుకలు వద్దు అంటోన్న చెర్రీ

అదే నాకు బహుమతి: రామ్‌చరణ్‌

హైదరాబాద్‌: కరోనా వైరస్‌(కొవిడ్‌-19) ప్రపంచ దేశాల్లో కల్లోలం సృష్టిస్తోన్న విషయం తెలిసిందే. భారతదేశంలో కూడా కరోనా వైరస్‌ రోజురోజుకీ విస్తరిస్తున్న తరుణంలో ఈ మహమ్మారి నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలను తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో మరికొన్ని రోజుల్లో (మార్చి27) తన పుట్టినరోజు రాబోతున్న సందర్భంగా రామ్‌చరణ్‌ తన అభిమానులనుద్దేశిస్తూ ప్రత్యేకంగా ఓ పత్రికా ప్రకటనను విడుదల చేశారు. ఈ ఏడాది తన పుట్టినరోజు వేడుకలను జరపవద్దని ఆయన పేర్కొన్నారు. ప్రతిఒక్కరూ తమ వంతుగా కరోనా వైరస్‌ గురించి ప్రజలకు అర్థమయ్యేలా తెలియచేస్తే అదే ఈ ఏడాది తనకిచ్చే పెద్ద పుట్టినరోజు బహుమతి అని ఆయన చెప్పారు.

ప్రస్తుతం రామ్‌చరణ్‌ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో రామ్‌చరణ్‌.. అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 8న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం భావిస్తుంది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.