close

తాజా వార్తలు

Published : 13/03/2020 09:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ - 9 AM

1. దేశంలో తొలి కరోనా మరణం

కరోనా కాటుకు భారత్‌లో తొలి మరణం చోటుచేసుకుంది. హైదరాబాద్‌లో మంగళవారం మరణించిన 70 ఏళ్ల కర్ణాటక వ్యక్తి కరోనాతోనే మృతి చెందినట్లు నిర్ధారణ అయిందని ఆ రాష్ట్ర మంత్రి శ్రీరాములు చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లోనూ తొలిసారిగా కరోనా కేసు నమోదైంది. కరోనా వ్యాప్తి ఆందోళనతో దేశంలోని 18-20 లక్షల మంది ఐటీ ఉద్యోగులు ఇళ్ల నుంచే పనిచేసేలా సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీ పార్క్స్‌ వెసులుబాటు కల్పించింది. భారత్‌లో ఇప్పటివరకూ 74 కరోనా కేసులు నమోదయ్యాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

2. నేడు రాష్ట్ర వ్యాప్తంగా కళాశాలల బంద్‌

తెలంగాణ అసెంబ్లీ ముట్టడి సందర్భంగా ఈ నెల 11న ఏబీవీపీ నాయకులపై జరిగిన లాఠీఛార్జికి నిరసనగా ఈ నెల 13న రాష్ట్రవ్యాప్తంగా కళాశాలల బంద్‌ నిర్వహిస్తున్నట్లు ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి అంబాల కిరణ్‌ తెలిపారు. ఇంటర్‌ విద్యాసంస్థలు మినహా డిగ్రీ, ఇంజినీరింగ్‌, మెడిసిన్‌, విశ్వవిద్యాలయాల బంద్‌కు పిలుపునిస్తున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

3. బిహార్‌లా మార్చేశారు

అదుపు తప్పిన ఎద్దుకు ముకుతాడు వేసినట్లు వైసీపీ రౌడీయిజానికి ముకుతాడు వేయాల్సిన సమయం ఆసన్నమైందని భాజపా, జనసేన పేర్కొన్నాయి. స్థానిక ఎన్నికల సందర్భంగా ‘ఉమ్మడి విజన్‌ డాక్యుమెంట్‌’ను విజయవాడలో గురువారం ఆ పార్టీలు ఆవిష్కరించాయి. ఈ సందర్భంగా పవన్‌ మాట్లాడుతూ.. ‘‘దౌర్జన్యంతో నెగ్గాలనుకుంటే ఎన్నికలెందుకు? బిహార్‌లో మాదిరిగా రాష్ట్రంలో పరిస్థితులు నెలకొన్నాయి’’అని అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. బెదిరింపులతో ఏకగ్రీవం చేస్తే ఊరుకోం

హింస, బెదిరింపులతో స్థానిక ఎన్నికలను ఏకగ్రీవం చేయడాన్ని, నామినేషన్లు దాఖలు చేయకుండా అభ్యర్థులను అడ్డుకోవడాన్ని తీవ్రంగా పరిగణిస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమేశ్‌కుమార్‌ హెచ్చరించారు. అభ్యర్థుల అడ్డగింత, బెదిరింపులు, హింసపై మీడియాలో వచ్చిన కథనాలపై కలెక్టర్ల నుంచి నివేదికలు తెప్పించి తగిన నిర్ణయం తీసుకుంటామన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

5. గంటంపావుకో మరణం

తెలంగాణలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల కారణంగా సగటున ప్రతి గంటంపావుకో మరణం సంభవిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా సంభవిస్తున్న ప్రమాదాలు రోజుకు సగటున 60 ఉంటున్నాయి. ప్రతి గంటకూ ఒకరు క్షతగాత్రులవుతున్నారు. గతేడాది రాష్ట్రంలో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాద గణాంకాలివి. అంతకుముందుతో పోల్చితే వీటి సంఖ్య తగ్గుముఖం పడుతున్నా.. పరిస్థితి కొంత ఆందోళనకరంగానే ఉన్నట్లు ఈ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6. ఇంజినీరింగ్‌ బోధన రుసుముల ఖరారు

ఇంజినీరింగ్‌ కళాశాలలకు బోధన రుసుములను ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ దాదాపుగా ఖరారు చేసింది. ముఖ్యమంత్రి జగన్‌తో గురువారం కమిషన్‌ సభ్యులు సమావేశమయ్యారు. బోధన రుసుములపై ప్రతిపాదనలను సమర్పించారు. మొదటగా బీటెక్‌కు ఖరారు చేశారు. రూ.35వేల నుంచి రూ.75వేల వరకు నిర్ణయించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

7. కొన్నాళ్లు సభలు, సదస్సులు వద్దు

కరోనా వైరస్‌ (కొవిడ్‌ 19) ప్రబలుతున్న నేపథ్యంలో.. బహిరంగ సభల నిర్వహణకు  అనుమతించవద్దని అన్ని రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం గురువారం ఆదేశించింది. ఎక్కువమంది గుమిగూడడానికి అవకాశమున్న జాతీయ, అంతర్జాతీయ సదస్సులు, సమావేశాలను వాయిదా వేసుకోవాలని సూచించింది. కేంద్ర ఆదేశాలపై రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ చర్చించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

8. బ్లడ్‌ బ్యాంక్‌ కాదు.. బ్లడ్‌ సెంటర్‌

ప్రస్తుతం ఉన్న రక్తదాన నిబంధనలను క్రమబద్ధీకరిస్తూ కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ కొత్త నిబంధనలు జారీచేసింది. ఇక మీదట బ్లడ్‌ బ్యాంకులను బ్లడ్‌ సెంటర్స్‌గా పిలవాలని పేర్కొంటూ డ్రగ్స్‌ అండ్‌ కాస్మొటిక్స్‌ నిబంధనలను సవరిస్తూ నోటిఫికేషన్‌ జారీచేసింది. ప్రపంచవ్యాప్తంగా బ్లడ్‌ బ్యాంకులను బ్లడ్‌ సెంటర్స్‌గా పిలుస్తున్నందున దేశంలోనూ ఆమేరకు సవరణ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. ఐఆర్‌సీటీసీ విదేశీ యాత్రల రద్దు!

రైల్వే అనుబంధ సంస్థ ఇండియన్‌ రైల్వే క్యాటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (ఐఆర్‌సీటీసీ) దేశ, విదేశాలకు తలపెట్టిన యాత్రలపై కరోనా వైరస్‌ ప్రభావం పడింది. అయిదు రోజుల శ్రీలంక యాత్రను రద్దు చేస్తూ ఈ సంస్థ తాజాగా నిర్ణయించింది. ఏప్రిల్‌, మే, జూన్‌ నెలల్లో తలపెట్టిన సింగపూర్‌, మారిషస్‌, బాలి, మలేసియా, యూరప్‌ ఖండంలోని వివిధ దేశాల యాత్రలను కూడా ఉపసంహరించే యోచనలో ఉంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. రూ.7,250 కోట్లు

సంక్షోభంలో చిక్కుకున్న యెస్‌బ్యాంక్‌లో తొలుత అనుకున్న రూ.2,450 కోట్లు కాకుండా రూ.7,250 కోట్లను స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) పెట్టుబడిగా పెట్టనుంది. ఒక్కో షేరు రూ.10 చొప్పున 725 కోట్ల షేర్లను కొనుగోలు చేసేందుకు 11న జరిగిన సమావేశంలో ఎగ్జిక్యూటివ్‌ కమిటీ ఆఫ్‌ సెంట్రల్‌ బోర్డు (ఈసీసీబీ) ఆమోదం తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.