close

తాజా వార్తలు

Published : 12/03/2020 09:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ - 9 AM

1. కరోనాను మహమ్మారిగా ప్రకటించిన డబ్ల్యూహెచ్‌ఓ

మానవాళికి పెనుసవాలుగా మారిన కరోనా (కొవిడ్‌19) వైరస్‌ వ్యాప్తిని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక ‘మహమ్మారి’గా గుర్తించింది. రోజురోజుకు అనేక దేశాలకు విస్తరిస్తుండడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ  డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధనామ్‌ కరోనాను మహమ్మారిగా ప్రకటించారు. ఈ మహమ్మారిని తేలికగా తీసుకోవద్దని, ఒక వేళ తాత్సారం చేస్తే తీవ్ర నష్టం కలిగిస్తుందన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

2. రోమ్‌ విమానాశ్రయంలో భారతీయ విద్యార్థులు

కరోనా కేసులతో ఉక్కిరి బిక్కిరవుతున్న ఇటలీలో 70 మంది భారతీయ విద్యార్థులు చిక్కుకున్నారు. స్వదేశానికి చేరుకునేందుకు రోమ్‌ విమానాశ్రయానికి చేరుకున్న విద్యార్థులు 24 గంటల నుంచి అక్కడే పడిగాపులు కాస్తున్నారు. భారత్‌కు వచ్చేందుకు ఎమిరేట్స్‌గానీ, ఎయిరిండియా గానీ బోర్డింగ్‌ పాస్‌లు ఇవ్వడం లేదని వాపోతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

3. ఓరుగల్లుకు మెట్రో

వరంగల్‌ మహా నగరాన్ని హైదరాబాద్‌కు దీటుగా అభివృద్ధి చేస్తామని పురపాలక మంత్రి కేటీఆర్‌ చెప్పారు. మెట్రో రైలు తెస్తామని, 15 కిలోమీటర్ల మేర మోనో రైలు ప్రారంభిస్తామని వెల్లడించారు. మామునూరులో విమానాశ్రయాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. వరంగల్‌కు మంజూరైన 68 కిలోమీటర్ల రింగ్‌రోడ్డులో 29 కిలోమీటర్ల పనులను మే చివరికి పూర్తి చేసి, జూన్‌ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. కాకతీయ మహానగరాభివృద్ధి సంస్థ (కుడా) బృహత్‌ ప్రణాళిక (మాస్టర్‌ ప్లాన్‌)కు ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. రాష్ట్రంలో కరోనా లేదు: మంత్రి ఈటల

‘‘కరోనా సోకిన వ్యక్తుల్లో 81% మందిలో ఆ వైరస్‌ ఎలాంటి ప్రభావం చూపదని మేం చెబుతున్నాం. 14% మందిలో మాత్రమే చికిత్స అవసరమవుతుంది. 3% మందిలోనే ప్రాణాంతకంగా మారుతుంది. ఈ రోజు రాష్ట్రంలో ఒక్కరు కూడా కరోనా సోకిన వ్యక్తి లేరు. అయినా విశ్రమించడంలేదు. ఉమ్మడి 9 జిల్లాల్లో కరోనా ప్రత్యేక వార్డులు నెలకొల్పుతున్నాం.’’అని తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. కరోనా నివారణ, కార్యాచరణపై కోఠిలోని వైద్య కార్యాలయంలో మంత్రి ఈటల బుధవారం ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

5. గ్రామ సచివాలయాల్లో ‘రిజిస్ట్రేషన్లు’

వచ్చే ఒకట్రెండేళ్లలో గ్రామ సచివాలయాల్లోనే భూముల రిజిస్ట్రేషన్లు చేస్తామంటూ ముఖ్యమంత్రి జగన్‌ ప్రకటించారు. తాడేపల్లిలో సీఎం జగన్‌తో కెనడా కాన్సుల్‌ జనరల్‌ నికోల్‌ గిరార్డ్‌ తదితరులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో అమలుచేస్తున్న ప్రభుత్వ పథకాలను సీఎం వారికి వివరించినట్లు ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారన్నారు. ముఖ్యంగా స్మార్ట్‌ సిటీ, ఫార్మా రంగాలపై ఆసక్తి వ్యక్తం చేశారన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6. దేశమంతటా అంటురోగాల చట్ట నిబంధనలు

మహమ్మారి అంటువ్యాధిగా కరోనా (కొవిడ్‌-19) విశ్వరూపం దాలుస్తున్న నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకుంది. ‘అంటురోగాల చట్టం-1897’లోని సెక్షన్‌-2 నిబంధనల్ని దేశమంతటా అమలు చేయాలని రాష్ట్రాలను ఆదేశించింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఆరోగ్య మంత్రిత్వశాఖలు ఎప్పటికప్పుడు జారీ చేసే సూచనలను అందరూ విధిగా అనుసరించాల్సి ఉంటుందని ఈ నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

7. పోటీ పరీక్షల్లో తప్పు చేస్తే శాశ్వత వేటు!

ప్రభుత్వ ఉద్యోగం పొందాలనే ఆతృతతో కొంత మంది అడ్డదారులు తొక్కుతున్నారు. ఇలాంటి వారిని కట్టడి చేయాలనేది అధికారుల ఆలోచన. ఇందుకోసం తప్పు చేస్తూ పట్టుబడిన అభ్యర్థులను ఆ తర్వాత నిర్వహించే ఏ పరీక్షకూ హాజరు కాకుండా నిషేధించేలా చూడాలని తెలంగాణ ప్రభుత్వానికి సిఫార్సు చేయాలనుకుంటున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

8. అది మహిళల హక్కులను  కాలరాయడమే

పని ప్రదేశంలో మహిళలను లైంగిక వేధింపులకు గురిచేయడమంటే.. వారి ప్రాథమిక హక్కులను కాలరాయడమేనని సుప్రీంకోర్టు ఉద్ఘాటించింది. గౌరవంగా జీవించే హక్కు, సమానత్వపు హక్కులను నిరాకరించడమేనని వ్యాఖ్యానించింది. లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారంటూ సీనియర్‌ అధికారిపై ఆరోపణలు చేసిన ఓ ఉద్యోగినిని బదిలీ చేస్తూ బ్యాంకు వెలువరించిన ఉత్తర్వులను మధ్యప్రదేశ్‌ హైకోర్టు కొట్టివేయడాన్ని సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. అంతర్జాతీయ ‘యువ’ మెరికల్లో మనోళ్లు అయిదుగురు

ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్‌) రూపొందించిన ‘యంగ్‌ గ్లోబల్‌ లీడర్స్‌’ జాబితాలో భారత్‌ నుంచి అయిదుగురికి చోటు దక్కింది. అందులో బైజూస్‌ క్లాసెస్‌ వ్యవస్థాపకుడు బైజు రవీంద్రన్‌, జొమోటో సహ వ్యవస్థాపకుడు గౌరవ్‌ గుప్తాలతో పాటు మరో ముగ్గురికి చోటు దక్కింది. 52 దేశాల్లో వివిధ రంగాల్లో అనూహ్య మార్పులు తెచ్చిన 115 మంది యువకుల (40 ఏళ్ల లోపు వారు)తో కూడిన జాబితాను జెనీవాకు చెందిన డబ్ల్యూఈఎఫ్‌ రూపొందించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. ఓ కొత్త ఆరంభం

తిరిగి గెలుపు బాట పట్టాలనుకుంటున్న భారత జట్టు గురువారం జరిగే తొలి వన్డేలో దక్షిణాఫ్రికాను ఢీకొంటుంది. న్యూజిలాండ్‌లో తల్లడిల్లిన కోహ్లీసేనకు తిరిగి సొంతగడ్డపై ఆడుతుండడం సానుకూలాంశమే. అయితే తక్కువ ఉష్ణోగ్రతలు, వర్షం ముప్పు నేపథ్యంలో ధర్మశాలలో భారత్‌కు స్వదేశంలో ఆడుతున్నామన్న భావన పూర్తిగా కలగకపోవచ్చు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.