close

తాజా వార్తలు

Published : 10/03/2020 09:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ - 9 AM

1. మంత్రుల రాజీనామాకు కమల్‌నాథ్‌ ఆమోదం

బొటాబొటీ మెజార్టీతో 15 నెలలుగా నెట్టుకొస్తున్న మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ నేతృత్వంలోని సర్కార్‌ సంక్షోభం అంచున ఉంది. 16 మంది మంత్రివర్గ సభ్యులు సోమవారం రాత్రి ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో తమ రాజీనామాలను సమర్పించారు.  వీటికి ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ ఆమోదించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

2. రుణమాఫీ లబ్ధిదారులు 40 లక్షల మంది

తెలంగాణలో రైతుల రుణమాఫీకి రంగం సిద్ధమవుతోంది. ఒక్కో రైతుకు 2018 డిసెంబరు 11వ తేదీ నాటికి ఉన్న బ్యాంకు రుణబకాయిలో రూ.లక్ష వరకూ మాఫీ చేయాలనేది ఈ పథకం ఉద్దేశం.  కేవలం రూ.25 వేల లోపు మాత్రమే అప్పు ఉన్న 5.83 లక్షల మంది పేర్లతో బ్యాంకులు జాబితాలు సిద్ధం చేశాయి. మొత్తం 40.66 లక్షల మంది రైతులకు బ్యాంకుల్లో రూ.25,936 కోట్ల బకాయిలున్నట్లు వ్యవసాయశాఖ అధ్యయనంలో తేలింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

3. 33 చోట్ల పురపోరు లేదు

ఏపీ రాష్ట్రంలో 75 పురపాలక సంఘాలు, నగర పంచాయతీలు, 12 నగర పాలక సంస్థల్లోనే ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం సాయంత్రం ప్రకటన (నోటిఫికేషన్‌) విడుదల చేసింది. వివిధ కారణాలతో 33 నగరాలు, పట్టణాల్లో ఎన్నికలను నిలిపివేసింది. కోర్టు కేసుల కారణంగా శ్రీకాకుళం, రాజమహేంద్రవరం, నెల్లూరులో నిర్వహించడం లేదు. కాకినాడలో ఇప్పటికే పాలకవర్గం ఉంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. ఏ దేశం నుంచి కాలిడినా.. ‘కరోనా’ పరీక్ష

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ (కొవిడ్‌ 19) విజృంభిస్తున్న నేపథ్యంలో.. విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చే ప్రయాణికులపై నిఘా తీవ్రతరం చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటివరకూ 12 దేశాల నుంచి వచ్చిన వారికే ఈ పరీక్షలు చేస్తున్నారు. ఇకపై ప్రతి అంతర్జాతీయ ప్రయాణికుడిని థర్మల్‌ స్క్రీనింగ్‌ ద్వారా పరీక్షించాలని ప్రభుత్వం ఆదేశించింది. శంషాబాద్‌ విమానాశ్రయంలో థర్మల్‌ స్క్రీనింగ్‌, వైద్య పరీక్షల నిర్వహణను వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ సోమవారం పరిశీలించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

5. వైకాపా నుంచే నత్వానీ

రాజ్యసభకు పోటీ చేయనున్న నలుగురు అభ్యర్థులను వైకాపా ఖరారు చేసింది. మొదటి 3 స్థానాలను వైకాపా నాయకులకు కేటాయించిన ఆ పార్టీ అధినాయకత్వం నాలుగో స్థానాన్ని రిలయన్స్‌ కార్పొరేట్‌ వ్యవహారాల విభాగం అధ్యక్షుడు పరిమళ్‌ నత్వానీకి ఇచ్చింది. పార్టీ ముఖ్య నేతలతో సోమవారం తన క్యాంపు కార్యాలయంలో సమావేశమైన ముఖ్యమంత్రి జగన్‌ ఈ నలుగురి పేర్లను ఖరారు చేస్తున్నట్లు వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6. పోటీ చేయొద్దంటూ బెదిరింపులు

స్థానికసంస్థల ఎన్నికల్లో పోటీ చేయొద్దని ప్రతిపక్ష పార్టీలకు చెందినవారిని వైకాపా నాయకులు బెదిరిస్తున్నారని తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు ధ్వజమెత్తారు. ఇళ్ల స్థలాల కూపన్లు, రేషన్‌ కార్డులు, చీరలు పంచుతూ ఓటర్లను ప్రలోభపెడుతున్నారని, మంత్రులు, వైకాపా నాయకులు గ్రామ/వార్డు వాలంటీర్లతో సమావేశాలు నిర్వహించి, వైకాపాను గెలిపించి జగన్‌ రుణం తీర్చుకోవాలని సూచిస్తున్నారని మండిపడ్డారు. సోమవారం తెదేపా కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడుతూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

7. అజ్ఞాత దాతలెవరో?

పారదర్శకత పాటించాల్సిన రాజకీయపార్టీలు తమకు విరాళాలు ఇచ్చిన వారి పేర్లు బయటపెట్టడంలేదు. ఈ సమాచారం లేకుండానే కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదికలు సమర్పిస్తున్నాయి. అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రాటిక్‌ రిఫామ్స్‌ (ఏడీఆర్‌) సంస్థ జరిపిన విశ్లేషణలో ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. 2018-19లో ఈ రూపంలో అన్ని పార్టీలకు కలిపి రూ.2,512.98 కోట్లు వచ్చాయి. అందులో భాజపాకు అందినవి రూ.1,612.04 కోట్లు. అంటే 64 శాతం ఆ పార్టీ ఖాతాలో పడ్డాయి. కాంగ్రెస్‌కు లభించినవి రూ.728.88 కోట్లు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

8. కరోనా మూల్యం రూ.148 లక్షల కోట్లు

కరోనా (కొవిడ్‌-19) కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఈ ఏడాది ఒకటి నుంచి రెండు ట్రిలియన్‌ డాలర్ల (సుమారు రూ.74 లక్షల కోట్ల నుంచి రూ.148 లక్షల కోట్లు) మేర నష్టం వాటిల్లుతుందని ఐరాస ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. కొన్ని దేశాలు మాంద్యంలో చిక్కుకుపోతాయని, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనంలో పడుతుందని వారు అంచనావేశారు. మరోవైపు కరోనా కేసులు చైనాలో తగ్గుముఖం పట్టినా మిగతా దేశాలను మాత్రం ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. ‘కరోనా’..70వేల మంది ఖైదీలు ఇంటికి

కరోనా (కొవిడ్‌ 19) వైరస్‌తో ఇరాన్‌ అతలాకుతలమవుతోంది. ఈ ప్రాణాంతక వైరస్‌ బారిన పడి ఆ దేశంలో తాజాగా మరో 43 మంది మృత్యువాత పడటంతో మొత్తం మృతుల సంఖ్య 237కి చేరింది. మరో 7వేల మందికి పైగా ఈ వైరస్‌ బారినపడి చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ఇరాన్‌ పలు జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న దాదాపు 70వేల మంది ఖైదీలను విడుదల చేసింది.  ఈ విషయాన్ని ఇరానియన్‌ జ్యుడీషియరీ చీఫ్‌ ఇబ్రహీం రైసీ వెల్లడించినట్టు మిజాన్‌ అనే ఓ న్యూస్‌ వెబ్‌సైట్‌ వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. ఒకే రోజు అధ్యక్షులుగా ప్రమాణం చేసిన ఘనీ, అబ్దుల్లా

అఫ్గానిస్థాన్‌ రాజకీయ సంక్షోభంలో కూరుకుపోయింది. సోమవారం కేవలం నిమిషాల వ్యవధిలో ఇద్దరు నేతలు అధ్యక్షులుగా ప్రమాణం చేయడమే ఇందుకు కారణం. ప్రస్తుత అధ్యక్షుడు అష్రాఫ్‌ ఘనీ, ఆయన మాజీ సీఈవో అబ్దుల్లా అబ్దుల్లాల మధ్య విభేదాల వల్లే ఈ పరిస్థితి తలెత్తింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.