close

తాజా వార్తలు

Published : 09/03/2020 09:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ - 9 AM

1. తెలంగాణలో గణనీయ ప్రగతి

తెలంగాణ ఆవిర్భావం తర్వాత వివిధ రంగాల్లో రాష్ట్రం గణనీయ ప్రగతి సాధిస్తోందని రాష్ట్ర సామాజిక ఆర్థిక సర్వే- 2020 పేర్కొంది. ఆదివారం శాసనసభలో ప్రవేశపెట్టిన నివేదికలో పలు అంశాలను వెల్లడించింది. రాష్ట్ర తలసరి ఆదాయం జాతీయ స్థాయి కంటే మెరుగైన దశలో ఉంది. 2019లో రాష్ట్ర తలసరి ఆదాయం 11.6 కాగా.. జాతీయ తలసరి ఆదాయం 6.3 శాతమే ఉంది. రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లా తలసరి ఆదాయంలో ప్రథమంగా నిలిచింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

2. లక్ష మందికి సొంత గూడు

తెలంగాణ రాష్ట్రంలోని పేదల సొంతింటి కలను నిజం చేసేందుకు ప్రభుత్వం మరో ప్రయత్నానికి అడుగు వేసింది. వారు తమ సొంత స్థలాల్లో ఇళ్లను నిర్మించుకునేందుకు ఆర్థిక సహాయం చేయనుంది. ఈమేరకు సంబంధిత బడ్జెట్‌ను ఏకంగా 11 రెట్లు పెంచింది. గతంలో రూ.1005 కోట్లు ఇవ్వగా... వచ్చే ఏడాదికి రూ.11,916.59 కోట్లను ప్రతిపాదించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

3. 51 ఛైర్‌పర్సన్‌ స్థానాలు మహిళలకే

ఏపీ రాష్ట్రంలోని 103 పురపాలక, నగర పంచాయతీల్లో ఛైర్‌పర్సన్‌ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. ఆ ప్రకారం ఎస్టీ మహిళ 1, ఎస్సీ మహిళ 7, బీసీ మహిళలకు 17, మహిళ జనరల్‌ కోటాలో 26 కలిపి మొత్తం 51 స్థానాలను మహిళలకు కేటాయించారు. పురపాలకశాఖ కమిషనర్‌ విజయకుమార్‌ ఆదివారం రిజర్వేషన్లకు సంబంధించిన రాజపత్రాన్ని (గెజిట్‌) విడుదల చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి 

4. అక్రమ కేసులతో వేధిస్తున్నారు

ప్రపంచమంతా ఆనందంగా మహిళా దినోత్సవం చేసుకుంటున్న వేళ.. ఏపీ రాజధాని మహిళలు తమకు జరుగుతున్న అన్యాయాన్ని తలచుకుంటూ, ఆవేదనతో కన్నీటి పర్యంతమయ్యారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రాజధాని ప్రాంత మహిళా రైతులతో విజయవాడలో ఆదివారం సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా తుళ్లూరుకు చెందిన శైలజ మాట్లాడుతూ ఎంతోమంది మహిళలను వేధిస్తూ, అక్రమ కేసులు పెట్టి ఏడిపించారని, ఇలాంటి సందర్భంలో మహిళా దినోత్సవం చేసుకోవడం చాలా బాధాకరమని కన్నీరు పెట్టుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

5. కళాశాలల్లోనూ ఓటు హక్కు దరఖాస్తు

18 ఏళ్లు నిండేవరకు నిరీక్షించకుండానే ఒక ఏడాది ముందుగానే ఓటు హక్కు కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పిస్తోంది. 17 ఏళ్ల విద్యార్థులుండే కళాశాలలు, ఇతర విద్యాసంస్థల్లో ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువస్తారు. అక్కడ వివరాలు నమోదు చేసుకుంటే 18 ఏళ్లు నిండిన తర్వాత ఓటు కోసం నిరీక్షించాల్సిన అవసరం ఉండదు. అంటే అర్హత వయసు రాగానే వెంటనే ఓటు హక్కు వస్తుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6. దేశవ్యాప్తంగా షీటీమ్‌ల ఏర్పాటు

సమాజంలో సగభాగమైన మహిళలకు ఇబ్బందులు కలగకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నాయని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జి.కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. మహిళల రక్షణకు హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ‘షీటీమ్‌’ బాగా పనిచేస్తోందని, ఈ తరహా బృందాలను దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోందని వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

7. మధ్యప్రదేశ్‌: వెనక్కి వచ్చిన మరో ఎమ్మెల్యే

మధ్యప్రదేశ్‌లో కనిపించకుండా పోయిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల్లో ఆదివారం మరొకరు వెనక్కి వచ్చారు. ఎమ్మెల్యే బిసాహులాల్‌ సింగ్‌ బెంగళూరు నుంచి భోపాల్‌కు విమానంలో వచ్చినట్లు ఓ కాంగ్రెస్‌ నేత తెలిపారు. మిస్సింగ్‌ అయిన ఎమ్మెల్యేల రాకతో ప్రభుత్వాన్ని కూల్చేందుకు భాజపా చేసిన ప్రయత్నం విఫలమైందని హోంమంత్రి బాల బచ్చన్‌ అన్నారు. నిన్న వెనక్కి వచ్చిన స్వతంత్ర ఎమ్మెల్యే సైతం తాను కాంగ్రెస్‌ వైపునే ఉన్నట్లు ప్రకటించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

8. జమ్మూ-కశ్మీర్‌లో కొత్త పార్టీ ఏర్పాటు

జమ్మూ-కశ్మీర్‌ అప్నీ పార్టీ పేరుతో పీడీపీ మాజీ నాయకుడు అల్తాఫ్‌ బుకారీ ఆదివారం కొత్తగా పార్టీ ఏర్పాటు చేశారు. ఆయన పూర్వపు జమ్మూ-కశ్మీర్‌ రాష్ట్ర ఆర్థిక మంత్రిగా పనిచేశారు. 30 మంది రాజకీయ ప్రముఖులతో కలిసి దీన్ని ఏర్పాటు చేశారు. పీడీపీ వ్యవస్థాపక సభ్యుడైన గులాం హస్సన్‌ మీర్‌ సహా ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు ఇందులో చేరారు.

9. వ్యోమగాముల పంట పండింది!

రోదసిలోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌)లో ప్రయోగాత్మకంగా సాగు చేసిన ఆకుకూర (లెటుస్‌)లో భూమి మీద పండించిన పంట తరహాలోనే పోషక విలువలు ఉన్నాయని శాస్త్రవేత్తలు తేల్చారు.  దీంతో రోదసి యాత్రల్లో సురక్షితమైన, తాజా ఆహారాన్ని పండించుకోవడానికి వ్యోమగాములకు మార్గం సుగమమైందని వివరించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి 

10. కరోనా ఎఫెక్ట్‌.. ఉల్లంఘిస్తే 3 నెలల జైలు

చైనాలో తగ్గుముఖం పట్టిన కరోనా వైరస్‌(కొవిడ్‌-19) ఇప్పుడు ఇటలీని వణికిస్తోంది. ఆదివారం ఒక్కరోజు ఇటలీలో 133 మంది వైరస్‌ వల్ల ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య 366కు చేరింది. పర్యాటక స్థలాలు బోసిపోయాయి. అత్యవసర పరిస్థితుల్లోనే ప్రజలు బయటకు రావాలని అధికారులు ఆదేశించారు. ఎవరైనా ఉల్లంఘిస్తే మూడు నెలల పాటు జైలు శిక్ష లేదా 206 యూరోల జరిమానా విధిస్తామని హెచ్చరించారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.