close

తాజా వార్తలు

Published : 06/03/2020 09:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ - 9 AM

1. షీ టీమ్స్‌ ఆధ్వర్యంలో 5కే, 2కే రన్‌

ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌ చార్మినార్‌ వద్ద షీ టీమ్స్‌ ఆధ్వర్యంలో 5కే, 2కే రన్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హోం మంత్రి మహమూద్‌ అలీ ముఖ్యఅతిథిగా హాజరై జెండా ఊపి పరుగును ప్రారంభించారు. డీజీపీ మహేందర్‌రెడ్డి, సీపీ అంజనికుమార్‌, షీ టీమ్స్‌ ఇన్‌ఛార్జి స్వాతి లక్రా, సినీ నటి అంజలి, ఎమ్మెల్యే పాషా ఖాద్రి, విద్యార్థినులు, మహిళా కానిస్టేబుళ్లు తదితరులు పాల్గొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

2. కర్ణాటకలో ఘోర ప్రమాదం: 13 మంది మృతి

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బెంగళూరు-మంగళూరు జాతీయ రహదారిపై జరిగిన  దుర్ఘటనలో రెండు కార్లలో ప్రయాణిస్తున్న 13 మంది మృతి చెందారు. బైలాదాకెరే వద్ద  ఓ కారు అదుపుతప్పి అతివేగంతో డివైడర్‌ను ఢీకొట్టి పల్టీలు కొట్టింది. అదే సమయంలో వేగంగా వస్తున్న మరో కారు బోల్తాపడిన కారును ఢీకొట్టింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

3. నేటి నుంచి సభాపర్వం

తెలంగాణ శాసనసభ, శాసనమండలి 2020-21 వార్షిక బడ్జెట్‌ సమావేశాలు శుక్రవారం నుంచి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు గవర్నర్‌ తమిళిసై ఉభయసభల సభ్యులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ నెల 8న రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. మార్చి 9న హోలీ సెలవు దినం కాగా పదో తేదీ నుంచి 23 వరకు సమావేశాలు కొనసాగే వీలుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. తమిళనాడు దాహం తీరుస్తాం

తమిళనాడు తాగునీటి సమస్య పరిష్కారానికి సహకరిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆ రాష్ట్ర మంత్రులకు హామీ ఇచ్చారు. తాగునీటి సమస్యపై తమిళనాడుకు చెందిన మంత్రుల బృందం గురువారం సీఎం కేసీఆర్‌తో ప్రగతి భవన్‌లో భేటీ అయింది. తమ రాష్ట్రం ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యను వివరించి సహకరించాలని అభ్యర్థించారు. దీంతో సీఎం కేసీఆర్‌ ఏపీ సీఎం జగన్‌కు ఫోన్‌ చేశారు. ఆ రాష్ట్రాన్ని ఆదుకోవలసిన అవసరం ఉందని ఆయనకు వివరించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

5. ఏపీ నుంచి రాజ్యసభకు ముగ్గురు ఖరారు!

ఆంధ్రప్రదేశ్‌ నుంచి రాజ్యసభకు వైకాపా అభ్యర్థుల పేర్లు దాదాపు కొలిక్కి వచ్చాయి. ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, మంత్రి మోపిదేవి వెంకటరమణ, గుంటూరు జిల్లాకు చెందిన అయోధ్య రామిరెడ్డిల పేర్లు మూడు స్థానాలకు దాదాపు ఖరారైనట్లు తెలిసింది. నాలుగో స్థానం విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. దీనిపై శుక్రవారం జగన్‌ పార్టీ నేతలతో మరోసారి చర్చించనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6. అమరావతి రింగ్‌రోడ్డు ప్రణాళికలో మార్పు లేదు

అమరావతి రింగ్‌రోడ్డు నిర్మాణం నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదని కేంద్రం పేర్కొంది. రాష్ట్రప్రభుత్వం మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని నిర్ణయించడంతో రింగ్‌రోడ్డు నిర్మాణం అంశంలో ఏమైనా మార్పు ఉందా అని తెదేపా ఎంపీ గల్లా జయదేవ్‌ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ గురువారం లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానమిచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

7. కరోనా కట్టడికి బృందాలు

మహమ్మారి కరోనాకు కళ్లెం వేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలకు ఉపక్రమించింది. జిల్లా, బ్లాకు, గ్రామ స్థాయుల్లో శీఘ్ర ప్రతిస్పందన బృందాలను ఏర్పాటు చేయాలని రాష్ట్రాలను ఆదేశించింది. కొవిడ్‌-19 కట్టడిలో జిల్లా కలెక్టర్లను భాగస్వాములను చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం సూచించింది. భారత్‌లో ఇప్పటివరకు కరోనా బారినపడ్డ వారి సంఖ్య 30కి చేరింది. వీరిలో ముగ్గురు ఇప్పటికే కోలుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

8. ఎన్‌పీఆర్‌ నవీకరణకు ఆధార్‌ వివరాలు చాలు

జాతీయ జనాభా పట్టిక (ఎన్‌పీఆర్‌) నవీకరణకు ఆధార్‌ కార్డుల కోసం సేకరించిన సమాచారాన్నే ఉపయోగించుకోవాలని హోంశాఖ వ్యవహారాల పార్లమెంటరీ స్థాయీసంఘం సిఫార్సు చేసింది. ఆధార్‌ కార్డులు జారీ చేసేందుకు వ్యక్తులకు సంబంధించిన సంపూర్ణ వివరాలు సేకరించారని గుర్తు చేసింది. ఎన్‌పీఆర్‌ విషయంలో ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించి, రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం సాధించాలని కోరింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. కుబేర భారతం

భారత్‌లో అత్యంత శ్రీమంతుల (అల్ట్రా రిచ్‌) సంఖ్య 2024 కల్లా 73 శాతం పెరిగే అవకాశం ఉందని ఓ సర్వేలో తేలింది. స్థిరాస్తి కన్సల్టెంట్‌ సంస్థ నైట్‌ ఫ్రాంక్‌ ఈ సర్వేను నిర్వహించి నివేదికను రూపొందించింది. సంపద విలువ సుమారు రూ.200 కోట్లకు (30 మిలియన్‌ డాలర్లు) పైగా ఉన్నవారిని అల్ట్రారిచ్‌గా సర్వే పరిగణనలోకి తీసుకుంది. 2019లో భారత్‌లో అత్యంత శ్రీమంతులు 5,986 మంది ఉండగా.. 2024 కల్లా ఈ సంఖ్య దాదాపు రెట్టింపై 10,354కు చేరొచ్చని పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. 81 అడుగుల వేంకటేశ్వరస్వామి విగ్రహ ప్రతిష్ఠ

 



Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.