టాటా చెబుతూనే.. ట్రాలీ ఆటో కింద పడి..
close

తాజా వార్తలు

Updated : 06/03/2020 07:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

టాటా చెబుతూనే.. ట్రాలీ ఆటో కింద పడి..

ప్రమాదవశాత్తు ఏడాదిన్నర చిన్నారి దుర్మరణం

హైదరాబాద్‌: తప్పటడుగులు వేస్తూ బోసి నవ్వులతో మేనమామను సాగనంపేందుకు గేటు వద్దకు వచ్చిన ఆ చిన్నారిని అంతలోనే విధి వెంటాడింది. మేనమామ నడుపుతున్న ఆటోనే మృత్యుపాశమై కన్నుమూసింది.. పేట్‌బషీరాబాద్‌ ఠాణా పరిధి దూలపల్లిలో గురువారం ఈ సంఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ సమీప శ్రీనగర్‌కు చెందిన శ్రవణ్‌కుమార్‌ దంపతులు కొన్నేళ్ల క్రితం దూలపల్లిలో స్థిరపడ్డారు. వీరికి ఏడాదిన్నర పాప ఆరాధ్య ఉంది. శ్రవణ్‌తో పాటు బావమరిది హనుమంతు టాటా ఏస్‌(ట్రాలీ ఆటో) నడుపుతుంటారు. గురువారం మధ్యాహ్నం బావ ఇంటికి హనుమంతు వెళ్లాడు. కొద్దిసేపు మాట్లాడిన అనంతరం తిరిగి బయలుదేరాడు. మేనమామకు వీడ్కోలు(టాటా) చెప్పేందుకు చిన్నారి ఆరాధ్య గేటు బయటకు వచ్చింది. హనుమంతు కూడా వీడ్కోలు చెప్పి వాహనం ఎక్కాడు. పాప ఇంట్లోకి వెళ్లిందనుకొని వాహనాన్ని రివర్స్‌ తీస్తుండగా వెనుక చక్రాల కింద పడిన చిన్నారి తీవ్రంగా గాయపడింది. సమీపంలోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పాప తమ కళ్లెదుటే విగత జీవిగా మారడంతో కుటుంబీకులు శోకసంద్రంలో మునిగిపోయారు. మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించిన పోలీసులు బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని