close

తాజా వార్తలు

Published : 02/03/2020 09:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ - 9 AM

1. టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భంగపాటు

రెండో టెస్టులో న్యూజిలాండ్‌.. భారత్‌పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో రెండు టెస్టుల సిరీస్‌ను ఆ జట్టు 2-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌ నిర్దేశించిన 132 పరుగుల లక్ష్యాన్ని న్యూజిలాండ్‌ మూడు వికెట్లు నష్టపోయి ఛేదించింది. న్యూజిలాండ్‌ చేతిలో ఓటమితో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భారత్‌ తొలిసారి పాయింట్లు కోల్పోయి భంగపాటుకు గురైంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

2. నేటి నుంచి రెండో విడత బడ్జెట్‌ సమావేశాలు

పార్లమెంటు రెండో విడత బడ్జెట్‌ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇవి ఏప్రిల్‌ 3వ తేదీ వరకు కొనసాగుతాయి. దిల్లీలో గత వారం చోటుచేసుకున్న అల్లర్లలో 42 మంది మృతి చెందిన నేపథ్యంలో ప్రతిపక్షాల ఆందోళనలతో ఈ సమావేశాలు వేడెక్కే అవకాశం ఉంది. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 11 వరకు జరిగిన బడ్జెట్‌ తొలి విడత సమావేశాల్లో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం, బడ్జెట్‌పై చర్చలు జరిగాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

3. ఓ ఇంట్లో నలుగురి ఆత్మహత్య

నగరంలోని హస్తినాపురంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ ఇంట్లో నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. ఇద్దరు పిల్లలు సహా దంపతులు పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆర్థిక సమస్యలతోనే ఆ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిందని స్థానికులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతులను ఇబ్రహీంపట్నంకు చెందిన ప్రదీప్‌, స్వాతి దంపతులు, వారి కుమారులు కల్యాణ్‌, జయకృష్ణలుగా గుర్తించారు.

4. గడప వద్దకే పింఛన్లు

ఏపీలో వైఎస్‌ఆర్‌ పింఛను కానుక కింద తొలి రోజు 87.37% మంది లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. 58.99 లక్షల మందికిగాను 51,39,242 (రాత్రి 9 గంటల వరకు) మందికి గడపవద్దకే వెళ్లి అందించారు. లబ్ధిదారులు ఇళ్లవద్ద లేకపోతే వారున్న చోటుకే వెళ్లి అందించారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఆసుపత్రిలో ఉంటే అక్కడికే వెళ్లి నగదును అందించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

5. 2.29 లక్షల మందికి కాపు నేస్తం

వైఎస్‌ఆర్‌ కాపు నేస్తం పథకం అర్హుల ప్రాథమిక జాబితా ఖరారైంది. నవశకం సర్వేలో అర్హులను ప్రభుత్వం గుర్తించింది. లబ్ధిదారులకు ఈ నెలలోనే బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు. ఈ పథకం ద్వారా కాపు, తెలగ, ఒంటరి, బలిజ కులాలకు చెందిన 45-60 ఏళ్ల మహిళలకు ఐదేళ్లలో రూ.75 వేలు ఆర్థిక సాయంగా అందిస్తారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6. రెండు నెలల్లో ఇళ్ల పంపిణీ

రెండు పడక గదుల ఇళ్లు పూర్తయిన చోట రానున్న రెండు నెలల్లో అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేస్తామని తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు తెలిపారు. మెదక్‌ జిల్లా నర్సాపూర్‌లో నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఆదివారం ఆయన పాల్గొని ప్రసంగించారు. ఇళ్ల కోసం ఎవరూ పైరవీలు చేయొద్దని, ఎవరికీ లంచాలు ఇవ్వవద్దని సూచించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

7. కులగణన లేనట్లే

జనాభా లెక్కలు సేకరణలో కులాల వారీగా లెక్కలు తేల్చాలని కొన్ని రాష్ట్రాల డిమాండ్‌ను కేంద్రం తోసిపుచ్చింది. అలాంటిది లేకుండానే 2021లో జనాభా వివరాల సేకరణకు రంగం సిద్ధం చేస్తోంది. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడినవారు (ఎస్‌ఈబీసీలు), ఇతర వెనుకబడినవారు (ఓబీసీలు), మిగిలిన కులాల వివరాలను సేకరించడం లేదు. ఈ విషయంలో మహారాష్ట్ర, బిహార్‌ శాసనసభలు చేసిన డిమాండ్లను తిరస్కరించినట్లే ఒడిశాలోని అధికార బిజద లోక్‌సభలో చేసిన డిమాండునూ కేంద్రం తోసిపుచ్చింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

8. పౌరసత్వ చట్టాన్ని అమలు చేసి తీరుతాం

శరణార్థులకు నూతన చట్టం ప్రకారం పౌరసత్వం లభించేవరకు కేంద్రం వెనక్కి తగ్గబోదని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా స్పష్టం చేశారు. తృణమూల్‌ సహా విపక్షాలన్నీ శరణార్థుల్ని, మైనారిటీలను భయభ్రాంతుల్ని చేస్తూ తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆరోపించారు. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) వల్ల ఏ ఒక్కరూ పౌరసత్వం కోల్పోరని పునరుద్ఘాటించారు. ఆదివారం కోల్‌కతాలో జరిగిన సీఏఏ అనుకూల సభలో ఆయన మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. ఎస్‌బీఐ కార్డ్స్‌ ఐపీఓ నేటి నుంచే

ఎస్‌బీఐ కార్డ్స్‌ అండ్‌ పేమెంట్‌ సర్వీసెస్‌ మెగా పబ్లిక్‌ ఇష్యూకు రంగం సిద్ధమైంది. నేడు ప్రారంభం కానున్న ఈ ఇష్యూ.. గురువారం ముగియనుంది. ఈ నెల 16న ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈల్లో షేర్లు నమోదుకావొచ్చు. ఎస్‌బీఐ వాటాదార్లకు ఇష్యూ పరిమాణంలో 10 శాతం రిజర్వేషన్‌ కల్పించారు. ఎస్‌బీఐ, ఎస్‌బీఐ కార్డ్స్‌ ఉద్యోగులకు 18.4 లక్షల షేర్లను కేటాయించనున్నారు. వీరికి ఒక్కో షేరుపై రూ.75 రాయితీ అందించనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. 66 దేశాలకు సోకిన కొవిడ్‌

ప్రాణాంతక కొవిడ్‌-19 (కరోనా) వైరస్‌ ప్రపంచంలో 66 దేశాలకు విస్తరించింది. ఇంతవరకు 88,257 మంది దీని బారిన పడగా వారిలో 3000 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 2870 మంది చైనావారే. ఒక్కరోజు వ్యవధిలోనే వేర్వేరు దేశాల్లో 2338 మందికి వైరస్‌ సోకింది. చైనా తర్వాత ఎక్కువ తీవ్రత దక్షిణ కొరియా, ఇటలీ, ఇరాన్‌, జపాన్‌లలో కనిపిస్తోంది. ఆస్ట్రేలియాలోని పెర్త్‌ ఆస్పత్రిలో తొలి మరణం నమోదైంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.