close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 02/03/2020 00:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పెట్రోలు లేకుండా... ఛారి్జంగ్‌ పెట్టకుండా!

గురుకుల విద్యార్థుల ప్రతిభ

పెట్రోలు బైకులు... పెరుగుతున్న ఇంధన ధరలతో భారం. ఎలక్ట్రిక్‌ బండ్లు... గంటలు గంటలు ఛార్జింగ్‌కే సరిపోతుండటం సమస్య. వీటిని అధిగమిస్తే... అద్భుతమే కదూ! పెట్రోలు అడగకుండా... ఛార్జింగ్‌ చేసే పని పెట్టకుండా... మోటర్‌సైకిల్‌ సర్రున పరుగులు తీస్తుంటే... అంతకంటే కావాల్సిందేముంది! ఈ అద్భుతాన్ని ఆవిష్కరించింది... ఏ శాస్త్రవేత్తలో కాదు, పదోతరగతి విద్యార్థులు. ఇలాంటి బైక్‌ను, అలాంటి విద్యార్థులను చూడాలంటే.. కుమురం భీం జిల్లాలోని కాగజ్‌నగర్‌ మండలం గన్నారం మైనారిటీ గురుకులానికి వెళ్లాల్సిందే.

ఏదో ఒక ఇంధనం లేకుండా వాహనం ఎలా నడుస్తుంది? నడవదు. అయితే ఛార్జింగ్‌ పెట్టాలన్నా కష్టం. బ్యాటరీలు వాటంతటవే ఛార్జింగ్‌ చేసుకొని... బండి నడవడానికి కావాల్సిన శక్తినిస్తుంటే ఎంత బాగుంటుంది? ఇదే ఆలోచన చేశారు గన్నారం మైనారిటీ గురుకులానికి చెందిన పదో తరగతి విద్యార్థులు. ఇదే ఆలోచనతో ఉన్న సయ్యద్‌ అలాం, జమ్మిడి ఆకాశ్‌, తామెరా అఖిల్‌కుమార్‌, అసైన్‌ ఉల్లాఖాన్‌, ఎండీ సలీం, గుర్రం మల్లికార్జున్‌ జట్టుగా ఏర్పడ్డారు. తమ ఆలోచనను ఆచరణలో పెట్టడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. మంచిర్యాలలో తెలిసిన మెకానిక్‌ల వద్ద వాహనాలు, వాటి విడిభాగాల గురించి తెలుసుకున్నారు.

అందిన ప్రోత్సాహం

జిల్లాలోని కెరమెరి ఘాట్‌లో అయిదు కిలోమీటర్ల మేర అనేక వంపులు తిరిగి ఉంటుంది. ఇక్కడ తరుచూ ప్రమాదాలు జరిగి ఎందరో ప్రాణాలు కోల్పోతుంటారు. దీన్ని నివారించడానికి ఈ విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టును మైనారిటీ గురుకులాల రాష్ట్ర కార్యదర్శి షఫీయుల్లా ప్రశంసించారు. కొత్త ఆలోచనలు ఇంకా ఏమైనా ఉంటే చెప్పండని వెన్నుతట్టారు. అప్పుడు తమ మనసులోని ‘కలల బైక్‌’ గురించి చెప్పారు. ఆయన వెంటనే వారికి రూ.1.50 లక్షలు మంజూరు చేసి ప్రయోగాలు చేయమని ప్రోత్సహించారు.

ఆ సమస్య ఉండదు

ఖర్చు తక్కువలో... కాలుష్య రహిత బైక్‌ తయారు చేయాలని నిర్ణయించుకున్నారు. గన్నారం గురుకులం ప్రిన్సిపల్‌ కొండయ్య, బహదూర్‌పురా గురుకుల ప్రిన్సిపల్‌ దావల్‌ అహ్మద్‌ల సహకారం తీసుకున్నారు. బీఎల్‌డీసీ మోటార్‌ (150 కిలోవాట్స్‌)ను పుణె వెళ్లి తీసుకువచ్చారు. ఈ మోటార్‌కు 12 వాట్స్‌ సామర్థ్యం గల డైనమోను అమర్చారు. వీటికి 4 బ్యాటరీలు (ఒక్కో బ్యాటరీ 120 ఎంపీయర్స్‌)ను అనుసంధానించారు. బీఎల్‌డీసీ మోటార్‌ నుంచి శక్తి ఉత్పత్తి అయి.. మోటార్‌కు పెట్టిన చైన్‌ తిరగడం వల్ల బైక్‌ కదిలేట్లు చేశారు. బైక్‌ నడుస్తుండగా, వాటికవే బ్యాటరీలు ఛార్జ్‌ అవుతాయి. డైనమోలో నిల్వచేస్తాయి. దీనివల్ల ఛార్జింగ్‌ సమస్య ఉండదు. ప్రస్తుతం ఈ వాహనం 50-60 కిలోమీటర్ల వేగంతో వెళుతుంది. ‘‘మరింత మెరుగైన పరికరాలు, ఆర్థిక సహాయం అందిస్తే 160 కిలోమీటర్ల వేగంతో పాటు, గేర్లు అమర్చి బండి సామర్థ్యం పెంచుతామ’’ని విద్యార్థులు ధీమాగా చెబుతున్నారు. ఆలోచనకు ఆర్థిక సాయం తోడై... ఆచరణ మొదలైతే అద్భుతాలే ఆవిష్కృతమవుతాయని నిరూపించారు ఈ ఆరుగురు.

- చొక్కాల రమేశ్‌, ఈనాడు డిజిటల్‌, ఆసిఫాబాద్‌


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.